జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 6 89

పక్కనే ఒక కిరాణా షాప్ ఉండగా 10 కోడి గుడ్లు మరియు బ్రెడ్ పేకెట్ తీసుకొని ఇంటికి రాగా తన తల్లి ఇంకా ఘాడంగా నిద్రపోతుండగా బ్రెడ్ ఆమ్లెట్ వేసుకొని తిని , ఒక పేపర్ తీసుకొని , అమ్మ కొద్దిగా పని ఉంది అయిపోగానే వచ్చేస్తాను , బొర్రా కేవ్స్ మరియు అరకు వెళదాము నీకు వెళ్లడం ఇష్ఠంగా ఉంటేనే , లేచిన వెంటనే వంట గదిలో గుడ్లు బ్రెడ్ ఉన్నాయి తినేసి రెడి గా ఉండు అని రాసి చివరగా లవ్ యు అమ్మ నీ కన్నయ్య అని రాసి తలుపు ముందుకు వేసి బయట గేట్ కు తాళం వేసి నడుచుకుంటూ రోడ్ మీదకు వెళతూ తమ గుడిలో పండగలప్పుడు రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రైవేట్ సెక్యురిటి ని పెట్టేవాళ్ళం ,అది గుర్తుకు రాగా వెంటనే వారికి ఫోన్ చేసి అడ్రస్ చెప్పి కొన్ని రోజులు ఇంటికి వాచ్ మాన్ కావాలని చెబుతాడు.

లక్ష్మయ్య గారు ఇంకా అక్కడే పని చేస్తున్నారా అని అడుగగా అవును ఇక్కడే ఉన్నారు ఎందుకు అని అడుగగా ఆయననే పంపండి అని చెప్పగా మీరు ఎవరు అని అడుగగా మహేష్ అని చెప్పండి , లక్మయ్యా ను పిలిచి అంతా చెప్పగా అతనా మన శివ గారి కొడుకు సార్ అని చెప్పగా , ఎప్పుడు పంపాలని అడుగగా ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు పంపించండి అని thanks చెప్పి కట్ చేస్తాడు. మెయిన్ రోడ్ మీదకు రాగా లిఫ్ట్ అడిగి సిటీ లో దిగుతాడు.

ఆటో లో Ap టూరిజం ఆఫీస్ కు చేరుకొని బొర్రా కేవ్స్ HHR రిసార్ట్స్ లో ఒక లగ్జరీ రూమ్ బుక్ చేసి అటు నుండి కిరాణా షాప్ కు వెళ్లి కొన్ని రోజులకు సరిపడే వంట వస్తువులన్నీ ప్యాక్ చేయించి పక్కనే చిన్న గ్యాస్ స్టవ్ తీసుకొని దానితో పాటు రెండు పెద్ద బ్యాటరీలు దాని నుండి వెలిగేలా ఆటో లో పెట్టుకొని , ఫోన్ తీసుకొని మెకానిక్ కు ఫోన్ చేసి వాహనం గురించి అడుగగా ఇంకో గంట పడుతుంది అని చెప్పగా ,అంతలోపు అదే ఆటో లో షో రూమ్ కు వెళ్లగా నిన్న సహాయం చేసిన అమ్మాయి నవ్వుతూ దగ్గరికి వచ్చి sorry సర్ సగం చీరలు మాత్రమే బ్లౌజ్ లు రెడి అయ్యాయి ,అన్ని రెడి అవ్వడానికి సాయంత్రం అవుతుంది అని చెప్పగా ,నా పేరు మహేష్ నేను సర్ కాదు అని నవ్వగా నా పేరు పూజ అని చెప్పగా ఇప్పుడు ఎన్ని అయ్యుంటే అన్ని ఇవ్వండి అని వాటికి బిల్ పే చేసి రెండు రోజుల తరువాత వచ్చి మళ్ళీ తీసుకుంటాను అని చెబుతుంటే మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అవ్వగానే కాల్ చేస్తాను అంటూ నవ్వుతుండగా పెన్ తీసుకొని పేపర్ కోసం చూస్తుండగా చెయ్యి చూపగా చేతిలో రాస్తాడు.

1 Comment

Comments are closed.