జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 6 91

వొంటి గంట కల్లా మొత్తం పని పూర్తయ్యి వాహనాన్ని బయటకు తీసుకు రాగా వంట సామానులు అన్ని వెనుక ట్రాలీ లో పెట్టి చీరల బ్యాగును ముందు పెట్టి బిల్ వెయ్యమనగా మొత్తం డీటెయిల్ గా బిల్ వేసి ఇవ్వగా 5 లక్ష లు అవ్వడంతో స్వైప్ అడుగగా ఉందని చెప్పగా బిల్ స్వైప్ చేస్తాడు. దీనికోసం పని చేసిన మెకానిక్ లకు తన పర్సు లోనుండి తలా ఒక 5000 ఇవ్వగా థాంక్స్ చెబుతుండగా మీ పనితనం అద్భుతం అని పొగిడి అందరికి థాంక్స్ చెప్పి ఇంటికి భయలుదేరుతాడు.

ఇక్కడ 10 గంటలకు జానకికి మెలకువ కళ్ళు ముసుకొనే చేతితో ఆమె రెండు పక్కల తడమగా బెడ్ మాత్రమే తగలగా ఒక్కసారిగా పైకి లేచి కూర్చొని ఆత్రంగా కళ్ళు తుడుచుకుంటూ చూడగా తన కొడుకు లేక పోవడంతో బాత్ రూమ్ కి వెళ్ళాడేమోనని వెళ్లి చూడగా అక్కడ కూడా లేకపోవడంతో , బయట ఉన్నాడేమోనని మొత్తం చూడగా బయట గేట్ తాళం వేసి ఉండటంతో తనకు చెప్పకుండా బయటకు వెళ్లినందుకు దుఃఖం తన్నుకు వచ్చి కంటిలోనుండి కన్నీళ్లు జలపాతంలా ఆగకుండా కారసాగాయి.

కారు కూడా అక్కడే ఉండటంతో ఎక్కడికి వెళ్ళాడోనని భయం వెయ్యగా శరీరమంతా చెమటలు పట్టి చల్లగా అయిపోతోంది. ఫోన్ చేద్దామంటే ఫోన్ లేదు ఏమి చెయ్యాలో తోచక లోపలికి వెళ్ళి బెడ్ పై కూర్చొని వెక్కి ఏడుస్తుండగా పేపర్ కదిలిన చప్పుడు వినిపించగా అటువైపు చూడగా పేపర్ మీద తన కొడుకు చేతివ్రాత ఉండటంతో దానినిఒక చేతితో అందుకొని చదువగా తన కొడుకు పని మీద వెళ్లాడని గ్రహించి ఏడుస్తూ నవ్వుతుంది.

ఆకలిగా ఉండటంతో బ్రష్ చేసి ముఖం కడుక్కొని వంట గదిలోకి వెళ్లి ఆమ్లెట్ వేసుకొని తింటుంది. ఇప్పుడు మనసు కొంచెం శాంతించగా మళ్ళీ బెడ్ రూమ్ లోకి వెళ్లి పేపర్ అందుకొని మధ్యలో నుండి చదువుతూ నా ఇష్టమా నా కొడుకు ఎక్కడికి రమ్మన్న ఏమి మాట్లాడకుండా వెళ్లిపోతాను అని సంతోషంగా తనలో తాను అనుకుంటుంది.

బెడ్ పక్కనే నిన్న తెచ్చిన బ్యాగులు ఇంకా తెరవకుండా అలాగే ఉండటంతో , మొదటిది ఓపెన్ చెయ్యగా చీర జాకెట్ ఉండటంతో స్నానం చేసి వేసుకుందామని పక్కనే పెడుతుంది. మరొకటి తెరువగా అలంకరణ వస్తువులు లేడీస్ హాండ్ బ్యాగ్ లు మూడు ఉండటంతో తనకు నచ్చినది ఒకటి తీసుకొని టూర్ లో ఏవేవి కావలసి వస్తాయో వాటిని అందులో పెడుతుంది.

1 Comment

Comments are closed.