హూ కిల్డ్ అవంతిక 216

ప్ర : ష్యూర్ సర్…
అసలు ఎక్కడి నుండి మొదలెట్టాలి అని తల గోక్కున్నాడు ప్రద్యుమ్న… ముందు సెక్యూరిటీ అధికారి వ్యాన్ లో స్పాట్ కి వెళ్ళాడు ….చుట్టూ సిసిటివి లేని బ్లైండ్ స్పొట్ ఎంచుకున్నాడు కిల్లర్….సరే అని ముందు ఎక్కడి నుండి వచ్చింది వెహికిల్ అని ఓ అర్ అర్ ఫుటేజ్ చూసాడు….అది సర్వీస్ రోడ్డు నుండి ఎక్కింది హై వే అని చూసాడు….కార్ కి ఇల్లీగల్ గా వేసిన బ్లాక్ స్క్రీన్ వల్ల ఫుటేజ్ లో లోపల ఎవరన్నది అర్టం కాలేదు…. డెడ్ ఎండ్ అయ్యింది కేస్…

సెక్యూరిటీ అధికారి స్టేషన్ లో ఉన్న నుజ్జైన స్కోడా కార్ దగ్గరికి వెళ్ళాడు…..క్లూస్ టీమ్ ని పిలిపించి కార్ లో ఫింగర్ ప్రింట్స్ ఇంకేదైనా ఆధారాలు దొరుకుతాయి అని వెతికించాడు…స్టీరింగ్ మీద అవంతిక ఫింగర్స్ తప్ప ఇంకేమీ దొరకలేదు….చాలా తెలివైన కిల్లర్ అనుకున్నాడు…వెంటనే ప్రద్యుమ్న వెంట ఇద్దరు కానిస్టేబుల్స్ ని తీసుకుని మాఫ్టీ లో అవంతిక ఆఫీస్ కి వెళ్ళాడు…ముక్తా యాడ్ ఏజెన్సీ…నేషనల్ కంపెనీ….కోట్ల టర్నోవర్….అందులో అవంతిక పెద్ద పొజిషన్ లో ఉన్న అమ్మాయి….అందుకే పే ఎక్కువ..ఆమెకి సోకులెక్కువ…ఆమె కొలీగ్స్ ని ఫ్రెండ్స్ ని మొదట కలిశాడు ప్రద్యుమ్న.. ఆమె ఎలాంటిది…ఆమె అలవాట్లు…. ఎక్కడుంటుంది….ఎవరన్నా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా….బ్యాక్ గ్రౌండ్ ఎంటి….ఇలాంటి ప్రశ్నలతో జవాబులు వెదికాడు….అతని కి దొరికిన విషయాలు….

” అవంతిక ఒక అనాథ …సైంట్ మెరిస్ ఓర్ఫానేజ్ లో పెరిగింది….చురుకైన అమ్మాయి …చదువుల్లో దిట్ట….ఆమె పడ్డ కష్టాల్ని …బాగా సంపాదించి తన గతాన్ని పాతిపెట్టాలని కసిగా లైఫ్ ని కొనసాగిస్తున్న సక్సెస్ఫుల్ ఉమన్….చిన్న వయ్సులోనే తన టాలెంట్ తో పెద్ద పొజిషన్ లోకి వెళ్ళింది…. కాని దానితో పాటు పార్టీ లైఫ్ స్టయిల్ కి అలవాటు పడింది.. ఎప్పటికప్పుడు ఎంజాయ్ మెంట్ తగ్గకుండా…లీవ్ లైఫ్ క్వీన్ సైజ్ అని చెప్తూ ఉండేది….దమ్ము కొట్టేది ….డ్రింక్ కొట్టేది….మగాళ్లకు చాలెంజ్ లు వేసేది…దేనికి జంకే రకం కాదు….మగరాయుడి లా అప్పుడపడు బిహేవ్ చేసేది …..కానీ రెగ్యులర్ అమ్మాయి లాగే తను ఇద్దర్నీ ప్రేమించింది….అదే కంపెనీ లో పని చేసే అజయ్ ని 2ఏళ్ల డేటింగ్ తర్వాత బ్రేకప్ చెప్పింది….కారణం అతను తనని కంట్రోల్ చేయాలని చూసాడు …. తర్వాత కంపెనీ లో కి కొత్తగా వచ్చిన సాత్విక్ తనకంటే 2 యేళ్లు చిన్నవాడని లవ్ చేసింది….ఈ సారి మాత్రం తానే వాడిని కంట్రోల్ లో పెట్టింది…ఫ్రీ స్టైల్ కి అలవాటు పడింది…..విచ్చలవిడిగా షాపింగ్ చేసేది…. ఫ్రైడే అయితే పబ్బులు దిస్కోతెక్ లో మునిగి తేలేది…కంపెనీ సంవత్సరానికి ఒక ప్రమోషన్ కొట్టి అందర్నీ అవక్కయెలా చేసేది….ఇంకొన్ని రోజుల్లో ఎక్జిక్యూటివ్ మ్యానేజర్ కూడా కాబోతుంది అందరూ గుస గుస లాడుకునేవాల్లు….ఇంతలోనే ఇలా జరగడం అందరూ ఒకింత జాలి పడ్డారు…”

ఒక్కోకరిని పిలిచి ప్రద్యుమ్న ఈ చిక్కు ముడి విప్పాలని డిసైడ్ అయ్యాడు….ముందుగా అజయ్ ని పిలిచాడు ….
ప్ర : హై అజయ్… చెప్పు ….అవంతిక కి నీకు ఎంటి రిలేషన్
అజ్ : సర్ అవంతిక నేను 2 ఏళ్ల క్రితం ప్రేమించుకున్నాం…ఆ తర్వాత మా మధ్య గొడవ అయ్యి విడిపోయాం ….అప్పటి నుండి జస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నాం అంతే…
ప్ర : నిజం చెప్పు …ఆ అమ్మాయి సాత్విక్ కి క్లోజ్ గా ఉంటుందని నువ్వే ఏదో చేశావ్ కదూ…
అజ్ : సర్ …నేను అలా ఎందుకు చేస్తాను ….మేము ఇద్దరం డిస్కస్ చేసుకుని మూవ్ ఆన్ అయ్యాము ….ఆ తరువాత నాకు ఆమె మీద ఇంట్రెస్ట్ కూడా పోయింది… షీ ఇస్ వెరీ కాస్యువల్….నాకు అలా నచ్చలేదు…అతనితో లవ్ లో ఉందని తెలుసు ….నేను అసలు ఆమెతో ఈ మధ్యలో టచ్ లో కూడా లేను….నాకు నిశ్చితార్థం అయ్యింది…నేను వేరే అమ్మాయిని ఇంకో నెలలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాను…అవంతిక వాస్ జస్ట్ ఎ పాసింగ్ క్లౌడ్…
ప్ర : ఆమెతో పడుకున్నావా…
అజ్ :……
ప్ర : చెప్పు…. డిడ్ యు హడ్ సెక్స్ విత్ హర్…
అజ్ : మేము లవ్ లో ఉన్నపుడు కొన్ని సార్లు ఇద్దరం కావాలి అని చేసుకున్నాం ….
ప్ర : ఇప్పుడు కూడా ఛాన్స్ దొరికితే ఆమెతో చేస్తావు కదా…
అజ్ : సర్ చెప్పాను కదా సార్…వీ మూవ్డ్ ఆన్ ….ఆ తరవాత ఎప్పుడు ఆమెని అలా చూడలేదు అడగలేదు….
ప్ర : నీ కాంటాక్ట్ డీటెయిల్స్ …నీ అడ్రెస్స్….అన్ని ఇచ్చి వేళ్ళు …నేను ఎపుడు అడిగినా స్టేషన్ రావాలి….ఈ సిటీ దాటి వెళ్ళడానికి వీలులేదు….
అజ్ : ఓకే సర్ …అలాగే…. అని వెళ్ళిపోయాడు….

ప్రద్యుమ్న కి మళ్లీ ఒక డెడ్ ఎండ్ తగిలింది…ఏదో ఒకటి తేలుతుంది అన్న ప్రతిసారీ ఇలాగే జరుగుతుంది….తర్వాత సాత్విక్ ని పిలిచాడు…బాగా ఏడ్చి ఏడ్చి చిక్కిన మొహం తో
సా : గుడ్ మార్నింగ్ సర్
ప్ర : సాత్విక్…..అవంతిక నీకు ..?