హూ కిల్డ్ అవంతిక 216

” సర్ ఆ రూం మిత్రా యాడ్ ఏజెన్సీ పేరు మీద కార్పొరేట్ బుకింగ్ లో ఉంటుంది సర్…డూప్లికేట్ కీస్ వాళ్ళ కంపెనీ దగ్గర ఉంటాయి… అది మా బాస్ ఏ మ్యానేజ్ చేస్తారు..”
” ఎవడ్రా నీ బాస్…”
“హెలో మిస్టర్ …హు ఆర్ యూ… వాట్స్ యువర్ ప్రాబ్లం…” అంటూ కేకలేసాడు రిసార్ట్ ఓనర్…
తిరిగి చేతికి పని చెప్పాడు ప్రద్యుమ్న….దవడ పగల గొట్టాడు…
“సర్…ఇందులో మా తప్పేమీ లేదు …కావాలంటే ఆ కంపెనీ వాళ్ళనే అడగండి…”
“మర్యాదగా చెప్పు …ఆ కంపెనీ లో ఎవడు నీకు డబ్బిచ్చి మ్యానేజ్ చేశాడు..చెప్పకుంటే నీ రిసార్ట్ ని సీజ్ చేసి పాడ దొబ్బుతా నా కొడకా…”
“సర్….అదీ….******* …ఆయనే పెర్సనల్ గా ఆ రూం బుక్ చేసి కంపెనీ పేరున రిజిస్టర్ చేయించారు.. … ఉన్న రేటు కంటే 3 టైమ్స్ ఇచ్చి సీక్రెట్ గా ఉంచామన్నారు…”
” ఆ రూం తాళం ఇవ్వు ….!!!”

ప్రద్యుమ్న రూం నెంబర్ 118 కి వెళ్ళాడు….గదంతా క్షుణ్నంగా పరిశీలించాడు…బెడ్ మీద కొన్ని వెంట్రుకలు దొరికాయి… వాటిని క్లూస్ కవర్ లో ఉంచాడు …ఇంకా అటు ఇటూ పరిశీలించగా ఒక మూల వాడి పడేసిన కండోమ్ దొరికింది…దాని కొద్ది దూరం లో డస్ట్ బీన్ ఉంది ….అందులో ఏమి లేదు…కోపం లో తన్నాడు దాన్ని…అది పక్కకి పడిపోగా ….ఏదో హ్యాండ్ కర్చీఫ్ లాంటి చిన్న. క్లాత్ ఉంది….అందులో ఏదో ఇనిషియల్స్ ఉన్నాయి…. డామ్ ఇట్ …అని షాక్ తిన్నాడు….
మళ్లీ ఏదో తట్టిన తరువాత ప్రద్యుమ్న రిసెప్షన్ కి వెళ్లి కాసేపటి తర్వాత ఫుటేజ్ చూసాడు….అవంతిక గదిలోకి వెళ్ళిన దారిలోనే ఇంకో మనిషి అదే ప్లే ఏరియా లో ని బ్లైండ్ స్పాట్ నుండి ఆ గదిలో దూరాడు…ఆ ఆకారం చూశాక ప్రద్యుమ్న కి క్లియర్ గా కిల్లర్ రూపురేఖలు తెలిసిపోయాయి …..ఆలాగే కంటిన్యూ గా చూసాక దాదాపు గంట తర్వాత ఆ రెండు ఆకారాలు చీకటిలో వెళ్లి కార్ ఎక్కి ఔటర్ రింగ్ రోడ్ వైపు వెళ్ళాయి…. కాని కిల్లర్ మోటివ్ మాత్రం అర్థం అవలేదు…

తనకి దొరికన ఆధారాలతో ఫోరెన్సిక్ ల్యాబ్ కి చేరాడు ప్రద్యుమ్న….త్వరిత గతిన కొన్ని టెస్ట్స్ చేయించి ఒక నిర్దారణ కి వచ్చాడు..వెంటనే సెక్యూరిటీ అధికారి వెహికిల్ లో మిత్రా యాడ్ ఏజెన్సీ ఆఫీస్ కి వెళ్ళాడు… పరుగు పరుగు వచ్చాడు ఆఫీస్ లో కి ..అందుకే ప్రద్యుమ్న నే చూస్తున్నారు….అందరి లో ఏదో టెన్షన్…ఒక్కసారి ప్రద్యుమ్న అందరినీ స్కాన్ చేశాడు….కాసేపు అజయ్ ని అనుమానం గా చూసాడు….మళ్లీ చూపు తిప్పి సాత్విక్ మీద కన్నేశాడు…..ఇద్దరి లో చెమటలు చూసాడు ….కానీ అతని ఫోకస్ మళ్లీ అటు నుండి తిరిగి ….ఎండీ క్యాబిన్ లో ఆగింది…వడి వడి గా అడుగేసి…బలంగా డోర్ బద్దలయ్యే లా కొట్టాడు….

” మిస్టర్ సుభాష్….యూ ఆర్ అండర్ అరెస్ట్ …”
“వాట్ ది ఫక్ అర్యూ టాకింగ్…”
“అవంతిక మర్డర్ కేసు లో నీ మీద ఆధారాలు. దొరికాయి…”
“రేయ్ నా గురించి నీకు తెలీదు…నేను తలచుకుంటే..”
” హా ఏం పీకుతావ్…ట్రాన్స్ఫర్ ఆ సస్పెన్షన్ ఆ …అంతేగా…నా దగ్గర అన్నీ ఆధారాలు ఉన్నాయి….అలంకృత రిసార్ట్ రూం నెంబర్ 118 …ఆ రోజు నైట్ నువ్వు ts07 ag 1234 బ్లాక్ కలర్ బెంజ్ లో పార్క్ చేశావ్….ఆ రూం లో నీ హండ్కర్చిఫ్ మీద ఎస్ కే అన్న ఇనిషియల్స్ అంటే సుభాష్ కృష్ణ…దాని మీద అవంతిక లిప్స్టిక్ మరకలు…ఆ బెడ్ మీద మీ ఇద్దరి హైర్ శాంపిల్స్… వాడి పడేసిన కండోమ్ మీద నీ ఫింగర్ ప్రింట్స్ అండ్ ఫైనల్లీ నువ్వు అవంతిక కు గుచ్చిన ఖాళీ సిరెంజ్…ఏక్సిడెంట్ సైట్ లో దొరికింది….చాలా ఇంకేమైనా కావాలా…”
సుభాష్ నోట మాట రాలేదు…
” మర్యాదగా నేరాన్ని ఒప్పుకో ….లేదా నా స్టైల్ లో స్టేషన్ లో కోటింగ్ ఇస్తా…నిజం తన్నుకుంటూ వస్తాది…అసలెందుకు చంపావు అవంతిక ని…”