హూ కిల్డ్ అవంతిక 216

సా : గాళ్ ఫ్రెండ్ సార్..
ప్ర : గాళ్ ఫ్రెండ్ అంటే..??
సా : వీ వర్ లవర్స్ సర్…
ప్ర : ఒహ్…జస్ట్ టైంపాస్ లవర్స్ ఆ లేక పెళ్లి గట్రా ఏమైనా ఉందా…
సా : మా ఇంట్లో ఒప్పించడానికి ట్రై చేస్తున్నా సర్….అన్ని సరిగా జరిగితే త్వరలోనే చేసుకునే వాళ్ళము…
ప్ర : లేక టైంపాస్ చేసి …వదిలించుకోవాలని లేపేయడానికి ప్లాన్ చేసావా…
సా ; సర్ నో….నాకు తనంటే ప్రాణం…ఆమె లేకుంటే నా లైఫ్ ఊహించుకొలే కున్నా…అలాంటిది ఆమెని నేనెందుకు…స్టుపిడ్ కొశ్చెన్…
ప్ర : ఏమో …ఆమె నిన్ను లైఫ్ లాంగ్ డామినేట్ చేసి నీకు ఫ్రీడం లేకుండా చేస్తుందని ….వద్దనుకునిండచ్చు గా
సా : సర్….ఆమె నన్ను డామినేట్ ఎప్పుడు చేయలేదు… షీ యుసెడ్ టు గైడ్ మీ….నాకు ఎప్పుడు హెల్ఫ్ఫుల్ గా ఉండేది….ఎలా సొసైటీ లో ఉండాలో చెప్పేది… ఐ వాస్ లక్కీ టు హావ్ హర్…
ప్ర ; నీకు ఎవరి మీద అయినా అనుమానం ఉందా మరి
సా ; తాను చాలా రుడ్ గా ఉండేది కానీ ..తన డెసిషన్ ఎపుడు కరెక్ట్ గా ఉండేవి…అంతే కాని ఎవరిని హార్ట్ చేసే రకం కాదు…మరి ఎవరు ఇలా చేశారో…
ప్ర : నీతో కాకుండా ఇంకెవరితో అయినా అవంతిక ???
సా : నో సర్…తను ఎప్పుడూ నాతో నే క్లోజ్ గా ఉండేది .
ప్ర : ఓకే ఒక సూటి ప్రశ్న …. ఆమెతో ఎప్పుడు సెక్స్ చేశావ్ లాస్ట్ గా…
సా : సర్ అలా ఎమీ…
ప్ర : చూడు మిస్టర్ చేయి వేసి మాట్లాడను అనుకో ..తట్టుకోలేవు మర్యాదగా చెప్పు…
సా : సర్ లాస్ట్ సండే …తన ఫ్లాట్ లో …
ప్ర : అర్ యూ ష్యూర్…?
సా : ఎస్ సర్….
ప్ర : సరే…నీ కాంటాక్ట్ డీటెయిల్స్ …నీ అడ్రెస్స్….అన్ని ఇచ్చి వేళ్ళు …నేను ఎపుడు అడిగినా స్టేషన్ రావాలి….ఈ సిటీ దాటి వెళ్ళడానికి వీలులేదు….
సా : అలాగే సర్…

ఎక్కడికి తెగట్లేదు ఈ కేస్…కానీ ఇంకో కొత్త విషయం తెలిసింది…ఆ రోజు నైట్ కంపెనీ క్వార్టర్లీ ఈవెంట్ లో ఫుల్ డ్రింక్స్ నడిచాయి…అందరూ అటెండ్ అయ్యారు అవంతిక తో సహా…అందులోనే అవంతిక పీకల దాకా తాగింది….తర్వాత డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళింది అందరూ వారించినా….కానీ ఇంటికి వెళ్ళే రూట్ కాకుండా హైవే వైపు ఎందుకు వెళ్ళింది….ఆమె మొబైల్ సిగ్నల్ ట్రేస్ చేయడానికి ప్రద్యుమ్న ట్రై చేస్తున్నాడు…ఆ ఇన్ఫర్మేషన్ రావడానికి 2 రోజులు పట్టుద్ది….ఈ లోపు ఆ కంపెనీ ఎండీ సుభాష్ ని కూడా పిలిచి అడిగాడు….సుభాష్ ” అవంతిక చాలా టాలెంటెడ్…ఆమె కి ఇంకొన్ని రోజుల్లో ప్రమోషన్ వచ్చేది…ఇంతలో ఇలా జరగడం చాలా దురదృష్టం…ఆ రోజు మేము అంతా చెప్పాము…క్యాబ్ లో వెళ్ళమని కానీ తను ఇలా…. డామ్ ఇట్…మీకు మా కంపెనీ నుండి అన్ని రకాల సహకారం ఉంటుంది ….ఫుల్ కోపరేషన్ ఉంటుంది…” అని హామీ ఇచ్చాడు….

ఫ్రెండ్స్ ద్వారా కొంతమంది జులాయి వెధవలు… ఆమెని ఎపుడు టీజ్ చేసే వాళ్ళు …ప్రపోజ్ చేసే వాళ్ళు …. అలాంటి వాళ్లందరినీ పోగేసాడు ప్రద్యుమ్న….అందరికీ సెకండ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చినా …ఎవరి దగ్గర అంత సీరియస్ త్రెట్ లేదని తెలిసింది….ఈ లోపు మొబైల్ సిగ్నల్ డాటా వచ్చింది…అందులో ఒక ఆసక్తి కరమైన విషయం తెలిసింది…ఆమె కారు సర్వీస్ రోడ్ నుండి హై వే ఎక్కేముందు…సిగ్నల్ అలంకృత రిసార్ట్ లో ఆగిందని తెలిసింది…..ఏదో తట్టింది ప్రద్యుమ్న కి ….వెంటనే ఆ రిసార్ట్ వైపు చురుగ్గా కదిలాడు….

ఇంతకీ ప్రద్యుమ్న ఎలా ఈ కేస్ ని చేదిస్తాడు…ఆ రాత్రి రిసార్ట్ లో ఏం జరిగింది….అవంతిక కిల్లర్ దొరుకుతాడా…ఆమె మర్డర్ వెనుక మిస్టరీ ఏమిటి…. హూ కిల్డ్ అవంతిక…..
అలంకృత రిసార్ట్…మరునాడు పొద్దున్న ప్రద్యుమ్న అక్కడికి చేరుకున్నాడు…కార్పొరేట్. కంపెనీల ఔటింగ్స్ తో వీకెండ్స్ ఎపుడు బిజీ గా ఉండే రిసార్ట్…వీక్ డే లో పెద్ద గా బుకింగ్స్ ఉండవు…..వెంటనే రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి ….లాస్ట్ ఫ్రైడే సిసిటివి ఫుటేజ్ చూపించు…”మీరెవరు సర్…?”…”ఇన్స్పెక్టర్ ప్రద్యుమ్న హియర్….ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ పని మీద ఇక్కడ క్లూస్ ఉన్నాయి…అవును ఆ రోజు మీ రిసార్ట్ కి అవంతిక అనే అమ్మాయి వచ్చిందా…” ….”ఓకే సర్ … రికార్డ్స్ చూద్దాం …రండి ”

“లాస్ట్ ఫ్రైడే…అవంతిక పేరు తో బుకింగ్ లేదు సార్….”
“అయితే ఆ రోజు 9-10 గంటల మధ్య సిసిటివీ ఫుటేజ్ చూపించు…”
పార్కింగ్ ఏరియా…మైన్ ఎంట్రన్స్…. ఎంటర్టైన్మెంట్ ఏరియా ….అన్ని చూసాడు ప్రద్యుమ్న….చీకటిలో కార్ పార్కింగ్ నుండి నేరుగా…ఒక యువతి రిసార్ట్ ప్లే ఏరియా లో కి వెళ్ళి ఏదో మాచ్ జరుగుతుంటే చూసినట్టే చూసి కాసేపటికి రిసెప్షన్ ని తప్పించుకుని రూమ్స్ వైపు వెళ్ళి …ఒక రూం డోర్ తన దగ్గర ఉన్న కీ తో ఓపెన్ చేసి లాక్ చేసింది…పక్క ఆమె అవంతిక అని అర్థం అయ్యింది…

“అక్కడ ఎవరు వెళ్ళింది…ఆమెకి ఆ రూం తాళం ఎలా దొరికింది…”
“ఏమో తెలీదు సర్…” అనగానే చెంప చెల్లుమని పించాడు ప్రద్యుమ్న మ్యానేజర్ కి…
“మీ రిసార్ట్ ముడ్డి వెనకాల ఏమి జరుగుతుందో తెలీదా… ఎవడ్రా మీకు పెర్మిషన్ ఇచ్చింది …” అని కోపాన్ని వెళ్లగక్కాడు…” ముందు ఆ రూం ఎవడి పేరు మీద ఉంది చూడు”