ఏంటయ్యా సుందరం ఎలా ఉంది నీ కొత్త గది 1 521

సుందరం మాత్రం ఆమె అన్న మాటకు అష్ట వంకర్లు తిరిగిపోయాడు. ఆ పని పూర్తి చేసేవరకూ పొరపాటున కూడా ఆమె వంక చూడలేదు . అప్పటికి యాదవ్ ముఖం కడుక్కుని వెళ్లిపోవడంతో సుదీర్ ని స్నానం చేయించడానికి తీసుకెళ్ళాడు . ఆ రోజు వంటలో కూడా ఇతోధికంగా ఆమెకు సాయపడ్డాడతను. దానికి సునీత చాలా ఆనందపడింది . డిన్నర్ టైం లో యాదవ్ హృదయపూర్వకంగా అభినందిచాడతన్ని. ” వీళ్లకి నువ్వింత అండగా వుండే మాటైతే ఏ చీకూ చింతా లేకుండా నేను దేశమంతా టూర్ చేసి మా కంపెనీ సేల్స్ రెట్టింపు పెంచుతాను ” అన్నాడు ఉత్సాహంగా. మర్నాడు శనివారం సుందరానికి శలవు. అయినా సునీత కంటే ముందే లేచాడు రోజూ ఆమె లేస్తూనే చేసే పని నీళ్లు పట్టడం. ఆ పని తనే ప్రారంభించాడు పని లో పని గా ముఖం కూడా కడిగేసుకున్నాడు ఆ సవ్వడికి లేచి బయటకు వచ్చిన సునీత ‘గుడ్ మార్నింగ్ మై బాయ్ ” అంది నవ్వుతూ. మొదట పిల్లలూ తర్వాత యాదవ్ బయటకు వెళ్ళిపోయారు. “ఇప్పుడు బట్టల రేవు పెట్టాలి.. నీ బట్టలు కూడా ఏమైనా వుంటే తెచ్చి పడెయ్” సునీత
“వద్దు లెండి ఆంటీ నావి నేను ఉతుక్కుంటాను”
ఆమె వప్పుకోలేదు – ఆటను తెచ్చే వరకూ వూరుకోలేదు
ఆటను కూడా కొన్ని బట్టలకు పెడతానన్నాడు . ఆమె ఆ ఛాన్స్ ఇవ్వలేదు
అవసరమైనప్పుడు బకేట్లోకి నీళ్ళు పట్టి అందిస్తూ అక్కడే నిలబడ్డాడు
ఆ సందర్భంలో దొర్లిన మాటల్లో అతనికో కొత్త విషయం తెలిసింది

వాళ్ళు కూడా తనలాగే ఏడాది క్రితం ఇక్కడికి వచ్చారు. యాదవ్ పనిచేస్తున్న కంపెనీ తాలూకు లోకల్ ఏజెంట్ ద్వారా అతనికి హరనాధరావు పరిచయమయ్యాడు. ఆ మరుసటి నెలలో యాదవ్ కి ఆ క్వార్టర్ సబ్ లెట్ చేయించాడు హరనాధరావు.దానికి ఐదు వేలు అడ్వాన్సు కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా అతను ఈ కుటుంబానికి కావలసినవాడయ్యాడు.
“సాయంత్రం నాలుగు గంటలకు మార్కెట్ కు వెళదాం – వెజిటబుల్స్ అవీ తెచ్చుకోవాలి ” అంది సునీత ఒక్కొక్కటిగా అతను అందిస్తున్న బట్టల్ని బాల్కనీ లో తాడుమీద వేస్తూ
అలాగే అన్నాడు తను
ఆ తరువాత ఆమె స్నానానికి వెళ్ళింది
మధ్యాన్హం ఇద్దరూ కలిసే భోజనం చేసారు
మంచం మీద పడుకుని పేపర్ చదువుతూండగా అలాగే నిద్ర పట్టేసింది సుందరానికి
మెలకువ వచ్చేసరికి మూడయింది
గదిలోనుండి బయటకు వచ్చి చూశాడు. సునీత కనిపించలేదు
తను ఇంకాలేవలేదేమోనని గదిలోకి రాబోతూండగా అటు వైపు బెడ్ రూమ్ లో నుండి ఒక కొత్త స్వరం వినిపించింది
“అక్కడ రెండు వారాలున్నానన్నమాటేగాని నా మనసంతా ఇక్కడేవుంది . ఉదయం ఇంటికొచ్చినప్పటినించీ ఇక్కడికేప్పుడొద్దమా అని అరాటపదిపోయా” అంది ఆ కొత్త కంఠం
ఆ మాటలు సుందరాన్ని తికమక పెట్టాయి
అతని మస్తిష్కంలో సునీత పట్ల సవాలక్ష సందేహలు బయలుదేరాయి

5 Comments

  1. గుడ్డు

    చాలా రంజుగా ఉంది. ఇంతకన్నా లబ్జుగా ఉండేట్లు ఇంకా మజాగా ఉండేట్లు కొనసాగించాలండోయ్…thanks

  2. బాగుంది ఇంకా వ్రాయండి

  3. బాగుంది ఇంకా వ్రాయండి Nice story continued

  4. Chala bagundi

  5. Chala bagundi. Superb

Comments are closed.