టీచర్ కోసం 4 153

మేడం వాళ్ళిద్దరితో మాట్లాడుతూనే నా వంక చూస్తుంది. నేను ఏదో లోకంలో ఉన్నాను అని పసిగట్టేసింది. నా కళ్ళు మేడం దొండపండు పెదాల మీదకు వెళ్లాయి. ఆ పేదాలను ఎలాగైనా అందుకోవాలి అని నా మనసులో కోరిక మెల్లిగా పుట్టింది. నేను మేడం పెదాలనే కళ్లార్పకుండా చూస్తున్నందుకేమో ఆ కోరిక మెల్లిగా పురివిప్పి నా మనసంతా ఆక్రమించేసింది. ఇప్పుడు నా మైండ్ లో ఒకటే రన్ అవుతుంది ఎదురుగా ఉన్న మేడం దొండపండు పేదాలను అందుకోవాలి అని. నా చూపు మేడం పెదాలను దాటి పక్కకు పోవడమ్ లేదు. మెల్లిగా నా మైండ్ రెడీ అవుతోంది, నేను ఇప్పుడు ముద్దు పెట్టుకుంటే ఏమవుతుంది ఎం కాదు, నాకు ఎవరు అడ్డం అసలు మేడం నాదే కదా పెట్టుకుంటే తప్పేముంది అని నా మైండ్ లో రన్ అవుతుంది. చుట్టూ ఎవరు వున్నారు అనేది కూడా గుర్తు రావడం లేదు. ఓన్లీ మేడం పెదాలు మాత్రమే నా కంటికి కనిపిస్తున్నాయి. మేడం హారిక తో సిద్దు గాడితో మాట్లాడుతూ నవ్వుతుంది. నాకు ఎందుకో కాళ్ళు వనకడం స్టార్ట్ అయ్యాయి. మెల్లిగా చేతులు కూడా వణుకుతున్నాయి. నా గుండె జారిపోతున్న ఫీలింగ్. ఇప్పుడు నేను మేడం పెదాలు అందుకోక పోతే ఊపిరి అందదు అన్నట్లు ఉంది. నా గుండె ఒక్కసారిగా కిందకు జారిపోయింది అని అనిపించింది ఊపిరి ఆడడం లేదు, మేడం నా వంక చూసి భరత్ భరత్ అని పిలుస్తోంది. నేను ఈ లోకంలో ఉంటేనే కదా పలకడానికి, ఇక భరించలేక పోయాను వెంటనే మేడం చేతిని పట్టుకుని నా వైపు లాక్కుని తన దొండపండు పెదాల మీద నా పెదాలతో గట్టిగా ముద్దు పెట్టా……….
ఒక్కసారిగా నాకు ఊపిరి అందినట్లు అయ్యింది. ఎంతో హాయిగా అనిపించింది. తరువాత నాకు ఒక అర నిమిషం నిజంగా మైండ్ పనిచేయలేదు నేను ఎం చేసానో కూడా అర్థం కావడం లేదు, నా చెంప చెల్లుమంది. ఎదురుగా మేడం నన్ను తిడుతుంది కానీ నా చెవికి ఎక్కడం లేదు, నేను ఇంకా మేడం పెదాల రుచిని అనుభవిస్తూ ఉన్నా, ప్రస్తుతం నా ముందు ఏం జరుగుతోంది అని కూడా పట్టించుకోవడం లేదు, నా చెంప మళ్ళీ చెల్లుమంది. ఎదురుగా మేడం నన్ను అడుస్తుంది. కానీ వినిపించడం లేదు, నా కాలర్ పట్టుకుని స్టాఫ్ రూమ్ బయటకు నెట్టింది నేను కిందబడబోయి నిలదొక్కుకుని పడిపోకుండా నిలబడ్డాను. ఇంకా నాకు ఏదో ట్రాన్స్ లొనే ఉన్నట్లు అనిపించింది. ఇదంతా కలనేమో అని అనుకుంటున్న. మేడం ఇంకా అరుస్తున్నట్లు ఉంది. అంతలో సిద్దు గాడు వచ్చి నన్ను లాక్కుని వేరే రూమ్ లోకి తీసుకువెళ్లాడు. వాడు ఏదో చెప్తున్నాడు. అరుస్తున్నాడు కానీ ఇందాక మేడం పెదాల తీపి అనుభూతి తప్ప నా మైండ్ లో ఏది రన్ కావడం లేదు. నన్ను వదిలి సిద్దు గాడు బయటకు వెళ్ళాడు. నేను అక్కడే బెంచ్ మీద కూర్చుని ఇందాకటి తీపి అనుభూతి నెమరువేసుకున్న. కొద్దిసేపు అలాగే కళ్ళుమూసుకుని డ్రీమ్ లోకి వెళ్ళిపోయాను. అంతలో బెల్ మోగింది. ఆ సౌండ్ కి నేను కళ్ళు తెరిచాను. అంతలో నేను ఉన్న రూమ్ లోకి హారిక సిద్దు ఇద్దరు వచ్చారు. నా వంక చూసి హారిక ఏంట్రా నువ్వు చేసిన పని ఎందుకు అలా చేశావ్ అని అంటుంది. సిద్దు గాడు కూడా నా మీద కోపంతో తిడుతున్నాడు. నాకు నోటి నుండి మాటలు రావడం లేదు. వాళ్ళు ఎమో నా మీద అరుస్తూ ఉన్నారు. కొద్దిసేపటికి నేను ఏమి పలకక పోయే సరికి వాళ్ళు తిట్టడం స్టాప్ చేసి, బయటకు వెళ్లిపోయారు. నేను ఒక్కడినే అలాగే కూర్చుని ఉన్నా నా మనసు నన్ను తిడుతుంది ఎందుకు అలా చేశావ్ ఎందుకు అని. కొద్దిసేపు క్రితం ఆ మనసే కదా దానికి ప్రేరేపించింది కానీ ఇప్పుడు ఏమో అదే నన్ను తిడుతుంది. నాకు మెల్లిగా ఇందాక జరిగింది గుర్తు వస్తుంది. మైండ్ ఇప్పుడు ప్రస్తుతం లోకి వచ్చింది. వచ్చాక తెలిసింది ఏంటి నేను చేసింది ఎంత పెద్ద మిస్టేక్ అని. అంతలో ఇంకో బెల్ మోగింది. అంటే నేను గంట సేపు నా మనసుతో సంఘర్షణ పడుతున్నానా ?
అప్పుడే రూమ్ లోకి హారిక వచ్చి పద వెళదాం అని అంది. నేను ఎక్కడికి అని అన్నా, ఎం ఇక్కడే ఇలాగే ఉండిపోతావా కాలేజ్ అయిపోయింది అందరూ వెళ్లిపోయారు మనం మాత్రమే ఉన్నాం కాలేజ్ లో పద ఇంకెంతసేపు బాధ పడతావ్ అని అంది. నేను గొంతు పెగల్చి, మేడం ఎక్కడ అని అన్నా, హారిక చేసిందంతా చేసి మళ్ళీ అడుగుతున్నావ మేడం నీ మీద చాలా సీరియస్ గా ఉంది అని చెప్తూ ఉంటే, నేను పైకి లేచి హారిక భుజాలు గట్టిగా రెండు చేతులతో పట్టుకుని మేడం ఎక్కడ అని అరిచినట్లుగా అడిగాను. హారిక నేను అలా ఆడిగేసరికి స స్ స్టాఫ్ రూమ్ అని అంది.
నేను వెంటనే అక్కడ నుండి పరుగెత్తుకుంటూ స్టాఫ్ రూమ్ దగ్గరకు వెళ్ళాను. అప్పటికే కాలేజ్ లో అందరూ వెళ్లిపోయారు. మేడం కూడా వెళ్ళిపోయింది. నేను చుట్టూ చూసా మేడం దూరంగా నడుచుకుంటూ వెళ్ళేది కనిపించింది అంతే పరుగు పరుగున వెళ్ళాను. మేడం మేడం అని పిలుస్తూ పరిగెత్తుతూ ఉన్నా. మేడం ఎవరు పిలుస్తున్నారు అని వెనక్కి తిరిగి చూసింది. నన్ను చూసి మళ్ళీ తల తిప్పుకుని నడుస్తుంది. నేను పరుగెత్తుకుంటూ వెళ్లి మేడం ముందుకు వెళ్లకుండా అడ్డుపడ్డాను. మేడం నావంక కోపంగా చూస్తుంది. కాలేజ్ లో అందరూ వెళ్లిపోయారు నేను మేడం సిద్దు హారిక మాత్రమే ఉన్నాం. చాలా సైలెంట్ గా ఉంది వాతావరణం. తుఫాను వచ్చే ముందు ఇలాగే ఉంటుంది అని ఎవరో అనంగా విన్నా. సిద్దు హారిక ఇద్దరు మా దగ్గరకు వచ్చి నేను ఎం చేస్తానో అని చూస్తున్నారు.

2 Comments

  1. Nice story tharanga upload cheyadi daily two parts cheyadi

  2. Super brooo..plsss nex part

Comments are closed.