టీచర్ కోసం 4 153

హిమ ఆంటీ నా వంక చూసి, భరత్ నేను బాగున్నానా, ఈమె బాగుందా అని అంది. నేను ఎం చెప్పాలో అర్థం కాక సైలెంట్ గా ఉన్నా. మేడం హే నోరు ముయ్యవే ముందు అని అంటూ భరత్ వచ్చి బండి ఎక్కు అని అంది .అంతలో హిమ, నీ కంటే నేనే అందంగా ఉన్నాను అని నీ బాయ్ ఫ్రెండ్ చెప్తాడని నీకు భయం కదా అని అంది. నేను కామ్ గా మేడం చెప్పినట్లు స్కూటీ దగ్గరకు వచ్చా. మేడం ఒసేయ్ నిన్ను చంపేస్తా ఇంకో మాట మాట్లాడావ్ అంటే అని హిమ ని బయపెట్టింది. హిమ పక పక నవ్వుతూ మేడం వంక చూసి ఒసేయ్ నీ బాయ్ ఫ్రెండ్ నేనే నీ కంటే అందంగా ఉన్నాను అని చెప్తున్నాడే అని అంది నా వంక చూపెడుతూ. మేడం కు కోపం వచ్చి, షట్ అప్ అని అరిచింది. హిమ నవ్వును ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ నవ్వుతుంది. హిమ నవ్వుతూ ఏదో చెప్పాలి అని ట్ర్య్ చేసింది, అంతలో మేడం హిమ గొంతు రెండు చేతులతో పట్టుకుని ఇంకో మాట మాట్లాడితే గొంతు పిసికేస్తా, బండి తీయ్ ముందు అని అంది. హిమ బండి స్టార్ట్ చేస్తూ నా వంక చూసి మనం తరువాత మాట్లాడుకుందాంలే అని అంది. మేడం హే నిన్ను మాట్లాడొద్దు అన్నా కదా అని గట్టిగా చెప్పింది.
హిమ సరే, సరే మాట్లాడనలే అని అంటూ స్టార్ట్ చేసింది.
మేడం స్కూటీ ఎక్కి హేమ వెనుక కూర్చుంది. నన్ను మేడం, తన వెనుక కూర్చోమని అంది. అంతలో హిమ అవునులే, బాయ్ ఫ్రెండ్ వెనుక ఉంటే ఆ మజా నే వేరు అని అంది. అంతే మేడం కు కోపంవచ్చి, హే నోరు ముయ్యి ఇంకో సారి బాయ్ ఫ్రెండ్ అన్నావో చంపేస్తా అని అంది. హిమ కొంచెం బయటపడినట్లుగా ఆక్ట్ చేస్తూ సరే, బాయ్ ఫ్రెండ్ అననులే లవర్ అని అంటా ఇప్పటినుండి అని అంది. మేడం హిమ నడుము మీద గట్టిగా గిచ్చింది. హిమ అబ్బా దొంగదాన అని తిట్టింది.
మేడం తగిన శాస్థి అయిందా అన్నట్లు నవ్వుతుంది. అంతలో హిమ మేడం మీద కోపంతో నా వంక చూసి, రేయ్ భరత్ నీకో విషయం తెలుసా, నీ లవర్ రోజూ నాకు ఫోన్ చేసి, నీ గురించి అని చెప్తూ ఉండేలోపు మేడం హిమ నోటిని తన చేత్తో మూసింది. హిమ మేడం ను విడిపించుకోవాలని గింజుకుంటు ఉంటే మేడం నడుముని గట్టిగా కసిగా పిసికింది. హిమ కెవ్వు మని అరిచింది. మేడం హిమ వంక చూసి ఇంకో మాట మాట్లాడావ్ అంటే నేను ఇంకెప్పుడు నీతో మాట్లాడను అని అంది. హిమ మేడం ముఖం చూసి సరే ఇప్పుడు వదిలేస్తున్న అని అంది. మేడం మొహం అలాగే మాడ్చుకుని ఉంది. హేమ మేడం వంక చూసి వదిలేసాను అని చెప్పా కదా ఇంకెందుకు అలా మాడిపోయిన మొహం పెడతావ్ అని అంది. మేడం తన మాటలకు రియాక్ట్ కాకుండా బండి దిగి పక్కన నిలబడింది. హిమ మేడం ని చూసి సరే సారి సారి సారి సారి అని అంది. మేడం ఇంకా మొహం అలాగే మాడ్చుకుని ఉండడం చూసి, హిమ తన దగ్గరకు వెళ్లి, నీ బాయ్ ఫ్రెండ్ నువ్వే అందంగా ఉన్నావ్ అని చెప్పాడులే అని అంది. మేడం ఒక్కసారిగా నవ్వి, హిమ బుజామ్ మీద కొట్టి నీ యాంకమ్మ అని అంది. హిమ నవ్వుతూ సరే త్వరగా ఎక్కండి టైం అవుతుంది అని అంది. మేడం స్కూటీ మీద ఎక్కుతూ కొంచెం ఆలోచించి, భరత్ ముందు నువ్వు ఎక్కు అని అంది. నేను ఎందుకు అని అడిగా, హిమ నా వంక చూసి, ఎక్కరా మగడా లేకపోతే టీచర్ కు కోపము వచ్చి కట్టే తీసుకుని దాన్నదే కొట్టుకుంటది అని అంది. అంతే నేను ఒక్క సారిగా నవ్వా. మేడం నా వంక సీరియస్ గా చూసి, భరత్ నువ్వు బండి ఎక్కు అని అంది. నేను సైలెంట్ గా స్కూటీ ఎక్కి హిమ వెనుక తనని ఆనుకుని కూర్చున్నా.

2 Comments

  1. Nice story tharanga upload cheyadi daily two parts cheyadi

  2. Super brooo..plsss nex part

Comments are closed.