రాములు ఆటోగ్రాఫ్ – Part 23 125

అనిత కోపానికి భాస్కర్ ఒక్కసారిగా అవాక్కయిపోయి….ఏమీ మాట్లాడలేక రాము వైపు, అనిత వైపు అలానే చూస్తున్నాడు.

భాస్కర్ మాట్లాడకుండా మెదలకుండా ఉండటంతో అనిత మళ్ళి రాము వైపు తిరిగి, “మీ నాన్నగారికి మేము ఇక్కడ ఉంటున్న విషయం తెలిసిందా?” అని అడిగింది.

“అదెం లేదు….మా నాన్న నన్ను వేరే విషయం మా అత్తయ్య గురించి మాట్లాడటానికి పిలిచాడు,” అన్నాడు రాము.

ఆ మాట వినగానే అనిత ఒక్కసారిగా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటూ, “హమ్మయ్యా…మా గురించి కాదన్న మాట….రెండు రోజుల నుండి నిద్ర పట్టక చస్తున్నాను,” అన్నది.

భాస్కర్ అనిత తో, “ఎందుకు అంత టెన్షన్ పడతావు అనిత…..అసలు ఏం జరిగింది?” అని అడిగాడు.

ఆ మాట వినగానే అనిత భాస్కర్ మీద తోక తొక్కిన తాచులాగా లేచింది, “నీకేం తెలుసు….నేను ఎంత టెన్షన్ పడుతున్నానో…రాము నాన్నగారికి మనం ఇక్కడ ఉంటున్న విషయం తెలిసిందంటే ఎన్ని సమస్యలు వస్తాయో నీకు ఏం తెలుసు…తింటం…పడుకోవడం తప్ప ఏమైనా చేస్తున్నావా…ఏదైనా తేడా వస్తే మళ్ళీ మనం రోడ్డు మీదకు వెళ్ళల్సివస్తుంది…నీకు జాబ్ లేదు, నాకు పిల్లల తల్లినని జాబ్ రాదు…ఎలా బతకాలనుకుంటున్నావు…మమ్మల్ని ఎలా పోషిద్దామనుకుంటున్నావు…మాట్లాడితే మా ఇద్దరి వైపు అనుమానంగా చూడటం మాత్రం వచ్చు…అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలుస్తుందా?” అని అడిగింది.

అనిత కళ్ళు నీళ్లతో నిండిపోయింది….ఆమె గొంతులో ఏడుపు తన్నుకొచ్చేలా ఉన్నది….అన్ని రోజుల కోపాన్ని ఒక్కసారిగా భాస్కర్ మీద వెళ్ళగక్కింది.

అనితని అంత కోపంగా భాస్కర్ ఎప్పుడూ చూడక పోయే సరికి భాస్కర్ నిజంగానే భయపడ్డాడు…..ఏం మాట్లాడాలో తెలియక సతమతమవుతున్నాడు.

రాము వెంటనే అనిత భుజం మీద చెయ్యి వేని కూర్చోబెడుతూ, “ఊరుకో వదినా….ఇప్పుడు ఏమయిందని…..అంతలా భాస్కర్ మీద కోప్పడుతున్నావు?” అన్నాడు.

“లేకపోతే ఏంటీ రాము….ఈ మనిషి సహాయం చెయ్యకపోగా….మనిద్దర్ని అనుమానంగా చూస్తున్నాడు….ప్రతి దానికి భూతద్దంలో చూస్తున్నాడు,” జీర బోయిన గొంతుతో అన్నది అనిత.
అనిత అలా ఏడుపు గొంతుతో అనగానే రాము భాస్కర్ వైపు కోపంగా చూసాడు.

ఇప్పుడు రాము ఏమంటాడొ అని భయపడుతూ భాస్కర్ తలెత్తి రాము వైపు చూడటానికి కూడా భయపడుతున్నాడు.
రాము కోపంగా భాస్కర్ వైపు చూస్తూ, “చూడు భాస్కర్…అనిత నీకోసం, పిల్లల కోసం ఎంత కష్టపడుతున్నదో తెలుసా…అయినా నువ్వు ఆమెని అనుమానిస్తావా…రోడ్డు మీద ఉండాల్సిన మిమ్మల్ని ఇంట్లోకి తెచ్చి నేను చాలా పెద్ద తప్పు చేసాను…నీకు ముందే చెప్పా…తిను, పడుకో, మందులేసుకో…ఇక వేరే విషయాలు పట్టించుకోవద్దని చెప్పినా నువ్వు వినడం లేదు…ఇక నా వల్ల కాదు…మీరు వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోండి,” అన్నాడు.
రాము అలా అనగానే భాస్కర్ గుండెల్లో రాయి పడింది…ఏం చెయ్యాలో అర్ధం కాక తనను తాను తిట్టుకుంటూ, “రాము అలా మాట్లాడకు రాము…నువ్వు వెళ్ళిపోమంటే ఇప్పటి కిప్పుడు ఎలా వెళ్తాము,” అంటూ బ్రతిమలాడుతున్నాడు.
భాస్కర్ మాటలు వినగానే అనిత మళ్ళీ కోపంతో, “అంటే రాము టైం ఇస్తే మమ్మల్ని ఎక్కడకు తీసుకెళ్తావు….ఏ రోడ్డు మీద మమ్మల్ని కూర్చోబెడతావు,” అనడిగింది.
అనిత కూడా అలా మాట్లాడే సరికి భాస్కర్ కి దిక్కుతోచలేదు…ఒక వైపు రాము, ఇంకో వైపు తన భార్య తన మీద అలా కోప్పడుతుండే సరికి ఏం చెయ్యాలో తోచడం లేదు.
దాంతో భాస్కర్ తన వీల్ చైర్ తోసుకుంటూ రాము దగ్గరకు వచ్చి, “ప్లీజ్ రాము…ఈ ఒక్కసారికి నన్ను క్షమించు…మిమ్మల్ని ఎప్పుడు అనుమానించను…మమ్మల్ని బయటకు వెళ్ళిపొమ్మనద్దు,” అంటూ అతని చేతులు పట్టుకుని బ్రతిమిలాడుతున్నాడు.
భాస్కర్ తన చేతులు పట్టుకుని బ్రతిమలాడటం చూసి రాము అనిత వైపు చూసి నవ్వుతూ, “చూడు ఎలా బ్రతిమిలాడుతున్నాడో,” అన్నట్టు సైగ చేసాడు.
అప్పటిదాక అనిత కూడా రాము నిజంగానే కోప్పడుతున్నాడు అనుకుని భయపడింది.
రాము నవ్వుతూ తన వైపు చూసే సరికి అనిత మనసులో అప్పటి దాకా ఉన్న భయం మంచులా కరిగిపోవడంతో తేలిక పడిన మనసుతో నవ్వుతూ రాము వైపు చూసింది.
రాము భాస్కర్ తో, “అయితే నువ్వు నేను చెప్పినట్టు వినాలి…..” అన్నాడు.
భాస్కర్ తల ఎత్తి రాము వైపు అర్ధం కానట్టు చూసి, “ఏం వినాలి,” అనడిగాడు.
“అదే…ముందు ఇటువంటి ప్రశ్నలు వెయ్యడం ఆపాలి….నేను, అనిత వదిన ఏం చెబితే అది వినాలి,” అన్నాడు రాము.
భాస్కర్ చేసేది లేక అలాగే అన్నట్టు తల ఊపుతూ, “సరె….వింటాను,” అన్నాడు.
“అయితే ముందు మమ్మల్ని ఇద్దరిని అనుమానించడం మానేయాలి….అనిత ఏం చేసినా నీ కోసం, నీ పిల్లల కోసం కష్టపడుతుంది,” అన్నాడు రాము.
భాస్కర్ అలాగే అని అనిత వైపు అర్ధం కానట్టు చూసాడు.
“ఏం చేసినా అంటే మరీ అంత లోతుగా ఆలోచించకు…..ఇంట్లో పని చేస్తుంది, నా బట్టలు ఉతుకుతుంది….నా గురించి శ్రధ్ధ తీసుకుంటుంది,” అన్నాడు రాము.
రాము క్లారిటీ ఇవ్వడంతో భాస్కర్ తేలిక పడిన మనసుతో సరె అన్నాడు.

“సోనియా చదువు విషయం నువ్వే చూసుకోవాలి….సోనియా స్కూలు నుండి వచ్చిన తరువాత నువ్వే చదివించాలి…..అన్నిటి కంటే ముఖ్యమైనది, ఇది మాత్రం తప్పితే నేను నిన్ను బయటకు గెంటేస్తాను….అనితని, పిల్లలను నేను చూసుకుంటాను,” అంటూ భాస్కర్ ని భయపెడుతున్నట్టు అతని వైపు చూసాడు రాము.

రాము మాట అనగానే భాస్కర్ మొహంలో భయం చాలా స్పష్టంగా కనిపించింది…అనిత వైపు చూసాడు.
అనిత కూడా భయపడుతున్నట్టు నటించింది.
భాస్కర్ మళ్ళీ రాము వైపు తిరిగి, “నువ్వు చెప్పినట్టే వింటాను….చెప్పు,” అన్నాడు.
భాస్కర్ మాట్లాడుతున్నాడు కాని అతని మాట ఎక్కడో నూతి లోపలి నుండి వస్తున్నట్టు వస్తున్నది.
అనితకి తన భర్తని రాము అంతలా భయపెడుతుంటే చిత్రంగా కోపం రావడం లేదు….ఒక పక్క రాము మాట వినకపోతే వాళ్ళని బయటకు గెంటేస్తానన్న భయం ఇందాక బాగా కనిపించింది….ఇంకో పక్క భాస్కర్ అసమర్ధత, తను రాము మాట వినేలా చేస్తుంది.

4 Comments

  1. మొగుడ్ని మరీ అలా చేతగానివాడిని చేసి అలారాయటం బాగాలేదు

    1. Raju bairagoni 71@gmail. com

      నేను నా చిన్నతనంలో చూసా ఇలా అవిటి వాడైన మొగుడు ముందు పరాయి మొగాడితో సరసం ఇప్పుడు మళ్ళీ జ్ఞాపకమ్ వచ్చింది

  2. గుడ్డు

    Super గా రాస్తున్నావు గురూ!
    సెక్సీగా ఉంది. Readability చాలా బాగా ఉంది. సెక్స్ వర్ణన పెంచు. డోస్ పంచు. Thankq.

Comments are closed.