రూప లేదాంటి కొంచెం అర్జెంట్ పని ఉంది ఇద్దరం తరువాత కలిసి తింటాం లే బయట అంది. దాంతో మా అమ్మ వాడు తినలేదు అని నీకు ఎలా తెలుసు అంది. రూప నవ్వుతూ ఆంటీ వాడు నా ఫ్రెండు, నాకు తెలీదా వాడు ఎప్పుడు తింటాడో ఎప్పుడు పడుకుంటాడో అని అంది. మా అమ్మ సరే లే అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోగానే అక్కడే రూం ఇవతల వైపు డోర్ దగ్గరే నిల్చుని వాళ్ళ మాటలు వింటున్న నేను ఇది ఇప్పుడు ఏం చేస్తుందో అని అనుకున్నా. అలా అనుకుంటూ వుండగానే రూప తలుపు దగ్గరికి వచ్చి చిన్నగా డోర్ మీద కొడుతూ మెల్లగా నాకు మాత్రమే వినపడేలా విన్నూ, నీ బంగారాన్ని, నీ పెళ్లాన్ని వచ్చారా తలుపు తీయి అంది. అంతే తనలా అనేసరికి నాకు ఒక్కసారిగా కోపం వచ్చి వెంటనే వెళ్ళి తలుపు తీసా తనని తిడదాం అని. తను నవ్వుతూ కనిపించింది. నేను కోపంగా తనని లోపలికి లాగుతూ వాళ్ళకి వినిపిస్తే పరిస్థితి ఎంటో ఆలోచించావా ? అన్నా. తను నా బెడ్ మీదకు వెళ్ళి కూర్చుంటూ కంగారు పడకు విన్నూ, అలా చెప్తే కానీ వెంటనే తలుపు తీయవ్ అని అలా చెప్పా అంతే అంది. నేను కోపంగా తనని చూసి నీతో కొంచెం మాట్లాడాలి అన్నా. తను అవునా అంటూ నా వంక చూసి వెంటనే టైం వంక చూసింది. అలా చూస్తూ మళ్ళీ తిరిగి నాతో లేదురా బంగారూ టైం అయ్యింది త్వరగా వెళ్ళాలి మనం, అంటూ నన్ను చూసి సాయంత్రం ఎంచక్కా మాట్లాడుకుందాం సరేనా అంది. నేను వెంటనే తను నా మాట వినదు లే అని అనుకుని ఫాస్ట్ గా రెడీ అయిపోయా. సారి రెడీ అయినట్లు నటించా..
కాసేపటికి ఇద్దరం కార్ లో ఉన్నాం. రూప ఫాస్ట్ గా కార్ పోనిస్తుంది. నేను తనని మధ్య మధ్యలో చూస్తూ ఉన్నా. తను నేను అలా చూడడం చూసి నా వంక చూస్తూ ఏంటి బంగారూ అలా చూస్తున్నావ్ ఆకలి అవుతుందా అంది. నేను సీరియస్ గా తన వంక చూసా. తను ఏమైందిరా అలా ఉన్నావ్ చెప్పు అంది. నేను వెంటనే తల తిప్పేసుకుని బయటకు చూసా. ఇరవై నిమిషాల్లో ఆఫిస్ కు చేరుకున్నాం. ఆ రోజు అంతా తను ఎదో పనిలో మునిగిపోయింది. నాతో పెద్దగా టైం కూడా స్పెండ్ చేయలేదు. మొత్తం ఏవో మీటింగ్స్ అంటూ అటూ ఇటూ తిరగడమే సరిపోయింది తనకు. సాయంత్రం అవుతుండగా రమేష్ వచ్చాడు ఆఫిస్ కు. నన్ను చూసి హేయ్ ఏంట్రా ఇక్కడ ఉన్నావ్ అని అడిగాడు. అంతలోనే అక్కడికి రూప వస్తూ హేయ్ ఏంటి ? నువ్వు నా పియే ను పట్టుకుని రెస్పెక్ట్ లేకుండా అరేయి గిరేయి అంటున్నావ్ అంది. వెంటనే రమేష్ ఓహ్ ఇదెప్పటి నుండి అంటూ నా వంక చూసాడు. నేను దానికి రమేష్ కు ఎదో చెప్పబోతూ ఉంటే రూప మధ్యలో వస్తూ ఇవాళ్టి నుండే అంది. దానికి రమేష్ నన్ను చూస్తూ కానీ ఎందుకు ? అన్నాడు. అంతలో అక్కడికి దేవేంద్ర వచ్చి మమ్మల్ని చూస్తూ ఏంటి ఎదో డిస్కేషన్ పెట్టారు అని అన్నాడు. దానికి రూప అదే మన వినయ్ గురించి అడుగుతుంటే చెప్తున్నా అంది. దేవేంద్ర అవునా అంటూ రూప వంక చూసి నువ్వు చెప్పింది విన్నాక క్లయింట్ బాగా కన్విన్స్ అయ్యడమ్మా. నెక్స్ట్ వీక్ లో ఇంకో మీటింగ్ పెడతా అన్నారు. బహుశా అప్పుడు వాళ్ళ డెసిషన్ చెప్పొచ్చు అన్నాడు. దానికి రూప మీటింగ్ ఎక్కడ నాన్నా బెంగళూర్ అహ్ ? అంది. దేవేంద్ర అవును అన్నాడు. అలా అంటూ ఉండగా బెంగళూర్ అహ్ ? కానీ నాకు ఢిల్లీ లో వేరే పని ఉంది కదా నెక్స్ట్ వీక్ ఎలా మరి అన్నాడు రమేష్ దేవేంద్ర ను చూస్తూ. దానికి దేవేంద్ర నువ్వేం కంగారు పడకు, మన వినయ్ ఉన్నాడు గా రూప తో వెళ్తాడులే అంటూ నన్ను చూసి ఏమంటావ్ అంతేగా అన్నాడు. నేను హా అంతే అంతే అంకుల్ అన్నా. రూప నన్ను చూసి చిన్నగా నవ్వుకుంది. తను ఎందుకు నవ్విందో నాకు అర్దం కాలేదు బహుశా తనతో పాటు బెంగళూర్ కు వొంటరిగా వెళ్తానన్నందుకు అలా నవ్వింది అనుకుంటా. తరువాత దేవేంద్ర, రమేష్ ఇద్దరూ రూప తో కాసేపు మాట్లాడి వెళ్ళిపోయారు. నేను రూప వంక చూసా తను కాస్త అలిసి పోయినట్లు కనిపించింది. నేను ఇక వెళ్దామా అని అడిగా తనని. తను అప్పుడేనా అంది. నేను ఏం చేయాలి ఇక్కడ ఉండి అన్నా. తను నవ్వి నా చెవి దగ్గరికి వస్తూ అయితే పార్క్ కు వెళ్దామా అంది. నేను వెళ్దాం అన్నా. తను నా వంక ఆశ్చర్యంగా చూసింది. ఎంటి ? నువ్వేనా అంది ఒక్కసారిగా. నేను తనని చూసి ఆవేశపడకు, నేను నీతో మాట్లాడాలి అందుకే అన్నా. తను నిరాశగా ఫేస్ పెడుతూ అందుకా నేనింకా అంటూ ఎదో చెప్పబోతు ఆగిపోయి సరే వెళ్దాం పద అంటూ వాష్ రూం కు వెళ్లి ముఖం కడుక్కుని వచ్చింది. నేను తనతో బయలుదేరా.
కార్ లో వెళ్తుండగా తన వంక చూసా. తను కూడా నా వంక చూసి చిన్న స్మైల్ ఇచ్చింది. నేను ఫేస్ సీరియస్ గా పెట్టుకుని కూర్చున్నా. తను అది చూసి కొంచెం నవ్వొచ్చు గా అంది. నేను సీరియస్ గా ఒక లుక్ ఇచ్చా తను ఉఫ్ అని అనుకుంటూ డ్రైవ్ చేయడం లో ధ్యాస పెట్టింది. కాసేపటికి ఒక పార్క్ కు వచ్చాం. ఈ టైం లో ఈ పార్క్ లో పెద్దగా ఎవ్వరూ ఉండరని తను ఇక్కడికి తీసుకువచ్చింది అని అర్దం అయ్యింది. వెంటనే నేను కార్ దిగుతూ పార్క్ లోకి ఎంటర్ అయ్యా. తను కూడా కార్ పార్క్ చేసి లోపలికి వచ్చింది. ఇద్దరం కలిసి పార్క్ లో ఎవ్వరూ లేని చోటికి వెళ్ళి కూర్చున్నాం. అలా కూర్చుని ఒకరి ముఖాలు ఒకరం చూసుకున్నాం. తను చిన్నగా నవ్వింది. కానీ నేను నవ్వలేదు, తననే సీరియస్ గా చూసి తల తిప్పుకున్నా. తనకు నేను కోపంగా ఉన్నాను అని అర్దం అయ్యింది. అందుకే వెంటనే నవ్వు ఆపెసి కామ్ గా కూర్చుంది. నేను కూడా కామ్ గా కూర్చుని ఉన్నా. వచ్చి దాదాపు ఇరవై నిమిషాలు అవుతుంది. అయినా మేము ఒక్క మాట కూడా మాట్లాడు కోలేదు. నేనేం చెప్తానో అని తను, తనకు ఎలా చెప్పాలో అని నేను అలాగే ఉండిపోయాం. చాలా సేపు గడవడం తో నేను తనతో చెప్పాలి అనుకుంటున్న విశయాన్ని చెప్పడం మొదలు పెడదాం అనుకున్నా..
కానీ అంతలోనే రూప నాకు దగ్గరిగా జరుగుతూ ఎలా చెప్పాలో అని ఆలోచిస్తూ ఉన్న నన్ను చూస్తూ దగ్గరికి వచ్చి నా భుజం పై తల పెట్టింది. నేను ఏమీ అనలేదు. తను అలా తల పెట్టినా నేను ఏమీ అనకపోవడం తో తను ఇంకొంచెం ముందుకు వెళ్ళి నా చేతిని పట్టుకుంది. నేను మౌనంగా కూర్చున్నా. తను కూడా మౌనంగా కూర్చుని ఉంది. నేను తనకి పొద్దున నుండి చెప్పాలి అని అనుకుంటూ ఉన్నది చెప్దామని నోరు తెరిచా. కానీ అంతలోనే తను నోరు విప్పుతూ
నేనేంటే నీకు ఇష్టం లేదు కదా అంది. నేను తన వంక చూసా. తను నన్ను చూస్తూ ఇదేగా చెప్పాలి అని పొద్దున నుండి అనుకుంటున్నావ్ అంది.
నేను ఏం పలకలేదు..
చెప్పు పర్లేదు అంది.,
నేను ఇక మౌనంగా ఉండడం ఆపి తన వంక చూస్తూ అసలు నీకు ఏమైనా గుర్తు ఉందా నీకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయ్యిందని, మీ అన్నకు ప్రేమ పెళ్ళిళ్ళు అంటే ఇష్టం లేదు అని, నువ్వు నాకంటే వయసులో మూడేళ్లు పెద్దా అని కొంచెం అయినా గుర్తుందా అన్నా తన వంక కోపంగా చూస్తూ. తను నేను అలా అనగానే తలెత్తి చూసింది. నేను మామూలుగానే ఫేస్ పెట్టి మీ నాన్న ఇచ్చిన మాట గురించి కానీ, మీ అన్న గురించి కానీ, నువ్వనుకున్నట్లు జరిగితే వచ్చే ప్రాబ్లమ్స్ గురించి కానీ ఏమైనా కొంచెమైనా ఆలోచిస్తున్నావా నువ్వు ? అన్నా. తను సైలెంట్ గా చూసింది. నేను తనని చూసి అలాగే కంటిన్యూ చేస్తూ అయినా ఇన్నాళ్ల పరిచయం లో ఎన్నడూ లేనిది ఎందుకు నీకిప్పుడే ఇలా నాపై కోరిక కలిగింది ఎందుకు చెప్పు ? అన్నా. తను నా వంక అయ్యిందా అన్నట్లుగా చూసింది. నేను అది చూసి కొంచెం సీరియస్ గా ఇలా ఉంటే ఎలా రూప ? అన్నా. తను నన్ను చూసి ఎమైంది ఇప్పుడు కేవలం మా నాన్న ఇచ్చిన మాట తప్పుతున్నా, మా అన్నకు ఇష్టం లేకున్నా ప్రేమిస్తున్నా, నువ్వు నాకంటే చిన్న అయినా నిన్ను లవ్ చేస్తున్నా. అంతే కదా అంది ఇంకేమైనా ఉందా అన్నట్లుగా చూస్తూ..
నేను తన మాటలు విని ఆశ్చర్య పోతూ అంటే నీకు ఇవ్వన్నీ చేస్తున్నందుకు అస్సలు కొంచెం కూడా గిల్టీ లేదా అన్నా. తను లేదు అన్నట్లుగా చూసింది. నేను తనని చూసి ఒక్కసారి ఆలోచించు రూపా నువ్వు ఏం చేస్తున్నావో అంటూ తనని చూసి ఒకవేళ నువ్వు అనుకున్నదే చేస్తే మీ నాన్న ఏం కావాలి ? మీ అన్న ఏం కావాలి ? నిన్ను అంతలా ప్రేమించే నీ ఫ్యామిలీ పరువు ఏం కావాలి ? అసలు ఒక్కసారి అయినా ఆలోచించావా ? నువ్వు గానీ నన్ను పెళ్లి చేసుకుంటే మా నాన్న ఇంకా మీ నాన్న కనీసం రమణ అంకుల్ ముందు తలైనా ఎత్తుకోగలుతారా ? అని అన్నా. అది విన్న రూప కోపంగా ముఖం అటు వైపుకు తిప్పుకుంటూ ఒక్కసారి గాలి పీల్చి వోదులుతు నన్ను చూసి ఒక్కటి చెప్పు అంటూ నేను పుట్టాను అని వాళ్ళు మాట ఇచ్చారా ? లేక వాళ్ళు మాటిచ్చారు అని నేను పుట్టానా ? అంది. నేను అది విని ఉఫ్ అని అనుకుంటూ తల పక్కకు తిప్పుకున్నా. నేనెలా తల తిప్పుకోవడం చూసి రూప నన్ను చూస్తూ, నాకు కేవలం పెళ్ళి మాత్రమే ఫిక్స్ అయ్యింది వినయ్ పెళ్లైపోలేదు అంటూ నా వంక చూసింది. నేను తనని చూసి నీకు పెళ్లి కాలేదు అని నాకూ తెలుసు రూపా, కానీ నీకు అర్దం కావడం లేదు ఆ పెళ్లి వెనుక ఉన్న మాట గురించి అన్నా. అలా అనగానే రూప కోపంగా నన్ను చూస్తూ ఏంట్రా మాట మాట అంటూ ఒకటే అంటున్నావ్ ? నువ్వేమైనా ఇచ్చావా వాడికి మాట చెప్పు ? అంది కోపంగా. అంతే నేను వెంటనే సైలెంట్ అయిపోయా. తను కూడా వెంటనే నార్మల్ అవుతూ సైలెంట్ అయిపోయింది. కాసేపు ఇద్దరం మాట్లాడుకోలేదు. కాసేపటికి రూప నా బుజం మీద చెయ్ పెడుతూ నిజమే మా నాన్న మాట ఇచ్చాడు, మా అన్న కు ప్రేమ అంటే పడదు, నువ్వు నా కంటే చిన్న వాడివి, కానీ నాకు ఇవ్వన్నీ ప్రాబ్లమ్స్ లా కనిపించడం లేదు. నన్నేం చేయమంటావ్ చెప్పు అంది. నేను తన వంక సీరియస్ గా చూసా. తను తల తిప్పుకుంది. నేను గాలి పీల్చి వదులుతూ కాసేపు మౌనంగా ఉండి, వెంటనే తనతో ఏమో రూపా నాకు ఇదంతా తెలీదు. నాకైతే ఇలా చేయాలి అని లేదు అంటూ తనని చూసి, నువ్వు నన్ను ప్రేమించినా, నేనైతే నిన్ను ప్రేమించలేను అన్నా. తను నా వంక సీరియస్ గా చూసింది. నేను అది చూసి నాకు తెలుసు నువ్వైతే నువ్వు అనుకున్నది ఎలాగైనా పట్టుపట్టి సాదిస్తావ్ అని కానీ ఈ విశయం లో మాత్రం అలా జరగదు అని కచ్చితంగా చెప్తున్నా అన్నా తన వంక చూసి. తను సైలెంట్ గా ఉంది. అది చూసి నేను కూడా సైలెంట్ అయిపోయా.
