రూప : (మెలుకువ వచ్చి కళ్ళు తెరిచి నన్ను చూస్తూ) ఇవ్వాళ కూడా మేలుకునే ఉన్నావా ?
నేను : హ్మ్మ్ (నవ్వుతూ)
రూప : (తొడల పై నుండి లేస్తూ), నన్ను పక్కకు జరిపి పడుకోవచ్చుగా
నేను : నిద్ర రాలేదు
రూప : కళ్ళు తెరిచుకుని నన్నే చూస్తూ కూర్చుంటే ఎక్కడ వస్తుంది, పడుకుంటే వస్తుంది..
నేను : నేనేం నిన్ను చూడలేదు
రూప : మరి, చుట్టూ ఉన్న గాలిని చూస్తున్నావా ?
నేను : (తన పొట్ట పై చేయి వేసి నిమురుతూ) పుట్టబోయే బుల్లి రూప ను చూస్తున్నా.
రూప : అవునా..
అప్పుడే తెలిసి పోయిందా తమకు ఇది బుల్లి రూపే అని ?
నేను : అవును కచ్చితంగా అది బుల్లి రూపే..
రూప : కానీ నాకు బుల్లి వినయ్ కావాలి మరి..
నేను : ఏం నేను లేనా ? మళ్ళీ వాడేందుకు ?
రూప : మరైతే నీకు మాత్రం నేను చాలనా ? మళ్ళీ అదెందుకు ?
నేను : ఎందుకంటే ఈ పెద్ద రూప నన్నెప్పుడూ డామినేట్ చేస్తూ వస్తుంది అదే చిన్న రూప అనుకో నేను చెప్పింది వింటుంది, ఈ పెద్ద రూప లా చెయ్యదు
రూప : అలా అంటే నాకూ అంతే, ఈ పెద్ద వినయ్ నా మాట వినడం మానేశాడు, ఈ మధ్య బాగా కొవ్వు పట్టింది. అదే నా బుల్లి వినయ్ అనుకో, నా మాట వింటాడు నేను చెప్పింది చేస్తాడు, ఎదురు చెప్పడు ఈ పెద్ద వినయ్ లాగా
నేను : అవునవును, ఎదురు చెప్పడు, ఎగిరి తంతాడు అంతే
రూప : ఎందుకు తంతాడు, వాడు నా కొడుకు అలా ఏం చేయడు
నేను : ఎందుకు చేయడు ? నేనంటే వేస్ట్ ఫెలో ని కాబట్టి నువ్వు చెప్పిన దాని కంతా ఆ, వూ, అని అంటూ నీ చుట్టూ తిరిగా. అందరూ అలాగే ఉంటారు అనుకుంటున్నావా ?
రూప : (చిరు కోపంగా చూస్తూ) నీకు బాగా కొవ్వు పట్టింది రా, ఇందుకే నేను బుల్లి వినయ్ కావాలి అంటున్నా అంటూ నా పెదాలని తన పెదాలతో అందుకుంది. అలా అందుకుని చిన్నగా నన్ను వెనక్కి తోసేస్తూ నా మీద పడింది..
ఇంట్లో..
పొద్దున్న లేవగానే మా నాన్న మా అమ్మ తో కలిసి రామాయణం స్టార్ట్ చేసాడు. ఇదంతా రూప వలనే అని తెలిసినా కూడా నేను సైలెంట్ గా ఉన్నా. మా నాన్న ఇంకా మా అమ్మ ఇద్దరూ కాసేపు నన్ను అదీ ఇదీ అంటూ చివరికి వాళ్ళు ఏమైతే అనుకున్నారో అది చెప్పారు. నేను గట్టిగా ఊపిరి పీల్చి వదులుతూ మీకు కావాల్సింది ఇప్పుడు నేను దాని దగ్గర చేరి పని నేర్చుకోవడమే కదా అంతేనా అన్నా. దానికి మా నాన్న ఇంకా అమ్మా అంతే అన్నారు. నేను కోపంగా సరే ఎలాగోలా చావండి అని అంటూ అక్కడ నుండి నా రూం లోకి వచ్చేశా. నిజానికి ఇది మా అమ్మా నాన్నల మీద కోపం కాదు రూప మీద కోపం. తను ఇలా పెళ్లి ఫిక్స్ అయ్యాక కూడా నాతో ఇలాంటివి అనడం ఏమీ బాగాలేదు. కానీ తనేమో నేనెంత చెప్పినా వినేలా లేదు. పైగా నేను ఎంత తప్పించుకోవడానికి చూసినా తను మాత్రం వదిలేలా కనిపించడం లేదు. అందుకే ఇక ఎలాగో తను అనుకున్నది సాధిస్తుంది కదా మళ్ళీ గొడవలు ఎందుకులే అన్నట్లుగా మా నాన్న తో సరే అని చెప్పేశా. కానీ మనసులో మాత్రం తన మీద ఇంకా కోపంగా గానే ఉన్నా.
మా నాన్న నేను ఒప్పుకోవడం తో వెంటనే సంతోషంగా రూప కు మెసేజ్ చేసాడు. ఇక్కడ రూప సంగతి వేరేలా ఉంది, నిన్న రాత్రి గొడవ అయినప్పటి నుండి తన మనసు ఏమీ బాగాలేదు. చిన్న చిన్న వాటికి చిరాకు పడుతూ కోపంగా ఉంది. అలా కోపంగా చిరాక్కా ఉండడం తో వాళ్ళ నాన్నకు ఇవ్వాళ ఆఫిస్ కు రాను అని కూడా చెప్పేసింది. ఇవ్వాళ ఒక ముఖ్యమైన మీటింగ్ ఉండడం తో దేవేంద్ర రూప ను రమ్మని మళ్ళీ అడిగాడు. కానీ రూప కోపంగా రాను అని చెప్పేసింది. దేవేంద్ర దీని మూడ్ బాలేదు ఏమో లే అని అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు. కాసేపటికి మా నాన్న నుండి తనకు మెసేజ్ వచ్చింది, వస్తా అన్నాడు అంటూ.. అది చూడగానే రూప ముఖం వెలిగి పోయింది. వెంటనే ఉత్సాహంగా పైకి లేస్తూ గబ గబా స్నానం చేసేసింది. స్నానం చేసి మంచిగా స్కై బ్లూ కలర్ చీర కట్టుకుని, నీట్ గా రెడీ అయ్యింది. అలా అయ్యి మా నాన్నకు మెసేజ్ చేస్తూ ఇంకో పదహైదు నిమిషాలలోపు వస్తాను రమ్మని చెప్పండి అని పెట్టింది. దాంతో మా నాన్న ఆ మెసేజ్ ను చూసి రేయ్ రూప రెడీ అయ్యిందట త్వరగా రెడీ అవ్వు కలిసి వెల్డురు అన్నాడు. నేను కోపంగా రూం లో నుండి అడుస్తు ఏం అక్కర్లేదు నేనే డైరెక్ట్ గా వెళ్తా లే ఆఫిస్ కు అన్నా. దాంతో మా నాన్న మా అమ్మకు సైగ చేసాడు. కాసేపటికి చిన్నగా మా అమ్మ నా రూం లోకి వచ్చింది. నేను మా అమ్మ ను చూసి ఏం చెప్పి పంపించాడో చెప్పు అన్నా. అంతే ఆ మాట విన్న మా అమ్మ కొంచెం తడబడి మళ్ళీ మామూలు అవుతూ రేయ్ నాన్నా ఆమే వస్తా నన్నప్పుడు వద్దంటే ఏం బాగుంటుంది చెప్పు అంది. నేను కోపంగా ఇదేనా చెప్పి పంపాడు నీతో అన్నా. మా అమ్మ నా దగ్గరికి వస్తూ అంటే ఆయన చెప్తేనే ఇలా వచ్చా అనుకుంటున్నావా ? నిన్ను కూడా ఆయన చెప్తేనే కన్నాను అనుకుంటున్నావా ? అంది. నేను తన వంక చూసా. తను ప్లీస్ రా కన్నా చెప్పింది విను ఇదంతా నీ కోసమే కదా చెప్తుంది అంది. నేను తన ముఖం చూసి అబ్బా సరేలే వెళ్తా ఇక నువ్వు వెళ్ళు అన్నా. వెంటనే మా అమ్మ హ్మ్మ్ సరే అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయింది.
అప్పుడు అనిపించింది రేపొద్దున నాకు కూడా ఇలాగే ఒక కొడుకు పుడితే వాడికి డైరెక్ట్ గా చెప్పలేక ఇలా నా పెళ్ళాన్ని పంపించి వాడికి చెప్పిస్తానా ? అని. ఇంకో పడైదు నిమిషాల్లో రెడీ అయిన నేను బయటకు వస్తూ ఆలోచించా, కరెక్ట్ గా టైం కే పోవాలా ? లేట్ అయితే పోతే ఏమవ్వుద్ది ? అయితే తీసేస్తుంది జాబ్ నుండి లేదంటే మూసుకుని ఉంటుంది అంతే కదా అని అనిపించింది. వెంటనే మళ్ళీ రూం లోకి వెళ్తూ బెడ్ మీద కూర్చున్నా. కాసేపటికి బయట హార్న్ వినిపించింది. నేను కిటికీ లో నుండి చూసా. తను ఇంటి ముందు కార్ లో వుంది. నేను తన వంక చూసా. బ్లూ కలర్ శారీ లో అప్సరస లా తయారు అయ్యి వచ్చింది. నేను అనుకున్నా దీనెమ్మ ఎవడు చేసుకుంటాడో కానీ అదృష్టవంతుడు అని. అలా అనుకుంటూ ఉండగా అంతలోనే అదేదో నేనే చేసుకుంటే పోలా ? అని అనిపించింది. అంతే వెంటనే చి ఛీ ఇది దగ్గర నుండే కాదు దూరం నుండి కూడా నన్ను అట్రాక్ట్ చేస్తుంది, దీంతో జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ ఉండగా అప్పుడే రూప ఇంకో సారి హార్న్ కొడుతూ పైన నేను నిలబడి ఉన్న విండో వంక చూసింది. తను చూస్తుంది అని వెంటనే పక్కకు తప్పుకున్నా. నేను అలా తప్పుకోవడం తనకి కనిపించింది. నేను అలా చేయడం చూసి ఉఫ్ అని అనుకుంటూ కూలింగ్ గ్లాసెస్ తీసేసి కార్ దిగింది. దిగి లోపలికి వచ్చింది. అలా వస్తుండగా ఇక్కడ మా అమ్మ నా రూం దగ్గరికి వచ్చింది. వచ్చి ఏరా ? ఇంకా రెడీ కాలేదా అంది. నేను లేదు మా ఇంకో అర గంట అని అన్నా. దాంతో మా అమ్మ ఇంత సేపు ఏం చేస్తున్నావ్ ? రూప కూడా వచ్చింది అంటూ ఉండగా అక్కడ రూప ఇంట్లోకి వస్తూ మా నాన్నకు హెలో చెప్పింది. మా నాన్న నవ్వుతూ విష్ చేసి ఇంకా రెడీ అవుతున్నాడు అన్నట్లుగా సైగ చేసాడు. దాంతో రూప నా రూం వంక చూసి నేను చూసుకుంటాలే అంటూ అక్కడ నుండి పైకి వచ్చింది. మా అమ్మ ఇక్కడ నా రూం దగ్గర ఉండడం చూసి ఆంటీ బాగున్నారా అంది. మా అమ్మ హా బాగున్నా రూప అంటూ రూప ను చూస్తూ వాడింకా రెడీ అవుతున్నాడంట అంది. దానికి రూప నవ్వి పర్లేదు ఆంటీ, నేను వెయిట్ చేస్థాలే మీరు వెళ్ళండి అంది. మా అమ్మ సరే నీ ఇష్టం అంటూ రూప దగ్గరికి వస్తూ ఇంకా మీ మధ్య గొడవలు చల్లారలేదా ? అంది. దానికి రూప నవ్వుతూ ఎక్కడ ఆంటీ వాడేమో పిల్లోడు అయిపోయాడు, మెచ్యూరిటీ లేదు, ఎక్కడ చెప్పండి ? ఏది చెప్పినా టైం తీసుకుంటాడు అర్దం చేసుకోవడానికి అంటూ అయినా ఇది మాకు మామూలే గా ఆంటీ అంది. అలా అనగానే మా అమ్మ నవ్వుతూ రూప తల మీద నిమిరి నువ్వేనే వాడిని సరిగ్గా అర్దం చేసుకునేది అంది. రూప నవ్వి సరిగ్గా చెప్పారు ఆంటీ కానీ ఏం చేస్తాం కొందరికి అది అర్దం కాదు అంటూ నా రూం వంక చూసింది. మా అమ్మ నవ్వుతూ సరే కింద వుంటా అంటూ వెళ్ళిపోతూ అవునూ, తిన్నావా ? అంది.
