పెళ్లి తరువాత.. 89

వెంటనే మా నాన్న అవును పాపం వాడు కంపెనీ లేకుండా తాగడం తక్కువ పోయి కంపెనీ ఇస్తా అంటూ వెళ్తుంటే రూప ఎదో గుర్తొచ్చిన దానిలా హా ఇంకో విశయం అంకుల్ అంది. దానికి మా నాన్న హా ఎంటమ్మా అన్నాడు. రూప ఏం లేదు, నా దగ్గర చేరమని మీ అబ్బాయికి డైరెక్ట్ గా చెప్పకండి, మళ్ళీ ఇదేదో ప్లాన్ అన్నట్లుగా వొద్దు అంటాడు, ముందు మీ కంపెనీ లో చేరమని చెప్పి ఆ తరువాత వొద్దు నేను చేరను అని అన్నాక, మరి ఏం చేద్దాం అనుకుంటున్నవ్ పోనీ, వర్క్ అయినా నేర్చుకో అని మెల్లగా నా దగ్గర చేరేలా లాక్కురాండి. అయినా వినకపోతే మీకు తెలుసుగా ఎలా చెప్పాలో అంటూ నవ్వుతూ పెళ్లి చేసెస్తా అని బ్లాక్ మెయిల్ చేయండి సరిపోతుంది అంది. ఆ మాట వినగానే నేను షాక్ అయ్యా. తను నిజంగా దీన్ని కూడా వాడుకుంటుంది అని అనుకోలేదు. నేను అప్పట్లో రూప తో నాకు పెళ్ళి అంటే ఇష్టం లేదు అని చెప్పినట్లు గుర్తు. అందుకే ఇప్పుడు దాన్ని కూడా అడ్డం పెట్టమని మా నాన్నతో చెప్తుంది. తనలా అంటుంది అని అనుకోలేదు. అంతలో మా నాన్న సరే అమ్మా నేను చూసుకుంటాలే మిగితాది అన్నాడు. అలా అని దేవేంద్ర ను చూసి తన దగ్గరికి వెళ్ళిపోయాడు.
అలా మా నాన్న వెళ్ళిపోగానే రూప చేతిలో ఉన్న డ్రింక్ మొత్తం తాగేసి, నేను ఉన్న గోడ దగ్గరకు రాబోయింది. తను రావడం చూసి నేను వెంటనే అక్కడ నుండి తనకు దొరక కుండా వెళ్ళబోయా. కానీ అంతలోనే రూప గోడ దగ్గరికి వచ్చేసి విన్నూ.. అని పిలిచింది. అంతే అక్కడ నుండి వెళ్ళిపోతున్న నేను ఆగిపోయి వెనక్కి తిరిగాను. తను కళ్ళెగరేస్తూ చూసింది. నేను ఎంటి అన్నట్లుగా ఫేస్ పెట్టా. రూప నా దగ్గరికి స్టైల్ గా నడుస్తూ వచ్చి ఏంటి వినాల్సింది అంతా విని ఇప్పుడు వెళ్లిపోతున్నావా ? అంది. నేను కొంచెం చిరాకు గా ఫేస్ పెడుతూ నేనేం వినలేదు అన్నా. రూప నా ఫేస్ చూసి నవ్వుతూ, ఆపుతావా ఆ చెత్త ఎక్స్ప్రెషన్ అని అంది. నేను తనని ఏంటి నీ బాధ అన్నట్లుగా చూసా. రూప నాకు కొంచెం దగ్గరికి వస్తూ ఇందాక విన్నావ్ గా ఏం చెప్పానో అర్దం అయ్యిందా అంది. నేను ఏం విన్నా అన్నట్లుగా చూసా. రూప నవ్వుతూ నాకు తెలుసులే నువ్వు విన్నది ఎక్కువ చేయకు, అంటూ అటు ఇటు చూసి ఎవ్వరూ తనని గమనించడం లేదు అని ఖరారు చేసుకుంటూ నన్ను చూసి మూసుకుని ఎల్లుండి నుండి ఆఫీస్ కు రా, నీకే మంచింది, లేదంటే తెలుసుగా నా గురించి అంది. నేను తనని చూడకుండా అవతల వైపుకు చూస్తూ తన మాటలు మాత్రమే వింటున్నా. అది చూసి రూప నా చెయ్యి పట్టుకుంది. అంతే వెంటనే నేను కంగారు పడి అటు ఇటు చూస్తూ ఎవరైనా చూస్తారు అని అంటూ చెయ్ విడిపించుకున్నా. నేను అలా అనేసరికి ఒక్కసారిగా గట్టిగా నవ్వింది రూప.
ఆడపిల్లవా నువ్వేం అయినా ? అంత భయపడుతున్నావ్..
అయినా ఇక్కడ అందరూ మనల్ని అక్కా తమ్ముడి లాగే చూస్తున్నారు లే, చెయ్యి పట్టుకున్ననంత మాత్రాన తప్పుగా అనుకోరు అంది. నేను తనని చూసి ఇక అయిపోయిందా అన్నట్లుగా ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టాను. తను అటు ఇటు చూసి పెదాలతో ఉమ్మ్ అంటూ ఫ్లయింగ్ కీస్ ఇచ్చింది. నేను తనని కోపంగా చూసా. నిజానికి తన లాంటి అందమైన అమ్మాయ్ ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది అంటే ఎవ్వడైనా ఎగిరి గంతేస్తారు. కానీ ఇక్కడ నా పరిస్థితి అలా లేదు. తను ఇంకా నన్ను చూస్తూ ఎందుకు అలా బిగుసుకు పోతున్నావ్ ఫ్రీ గా ఉండు అంది. నేను ఉఫ్ అని అనుకుంటూ నేను వెళ్ళాలి అన్నా. దానికి రూప అయ్యో నేనేం నిన్ను ఆపలేదే అంది. నేను వెంటనే తన వైపు ఒక లుక్ ఇచ్చి ముందుకు నడవబోయా. అలా ముందుకు వెళ్తుంటే అంతలోనే ఒక్క నిమిషం అంటూ రూప ఆపింది. నేను తల తిప్పి చూసా. రూప నాకు దగ్గరగా వస్తూ నా చేయి పట్టుకుంటూ నా కళ్ళలోకి చూసి నన్ను ఎక్కువ కష్టపెట్టకు, ఆఫిస్ కు వచ్చేయి కలిసి పని చేసుకుందాం సరేనా ? అంది. నేను తన చేయి విడిపించు కుంటూ ముందుకు వెళ్ళిపోయా కోపంగా..
రూప వెనుక నుండి మమ్మల్ని ఎవ్వరూ చూడలేదు అని కన్ఫర్మ్ చేసుకుంటూ, నా చేతిని తాకిన తన వేళ్ళని తన నోట్లో పెట్టుకుంది. అలా పెట్టుకుని కాసింత చీకి మళ్ళీ ఛ ఛా వీడు నన్ను చాలా చెడ గొడుతున్నాడు అని అనుకుంటూ వెనుక నుండి నన్ను చూసి అంతలోనే పక్కనే ఎవరో వస్తుంటే అటు వైపుకు వెళ్ళింది.

ఐ లవ్ యూ చెప్పిన వేల..
తమరేమ్ గిఫ్ట్ ఇవ్వరా నాకు అని అడిగిన రూప ను చూస్తూ ఈరోజే పుట్టిన పాపాయికి ఏం గిఫ్ట్ కావాలి ఏంటి ? అని అడిగా. రూప నా భుజం చుట్టూ చెయ్యి వేసి నా ఎడమ భుజం పై తల పెట్టుకుని పడుకుంది. నేను తన చేతిని పట్టుకుని రాస్తూ చెప్పు ఏం గిఫ్ట్ కావాలి అని అడిగా. రూప నా చేతిని వొదిలేస్తూ గిఫ్ట్ ఎవరైనా అడుగుతారా ఇది ఇవ్వమని, నువ్వే తోచింది ఇవ్వాలి అంది. నేను ఏం ఇవ్వాలి అబ్బా అని ఆలోచిస్తూ ఉండిపోయా. నేను అలా ఆలోచించడం చూసి ఏం ఆలోచిస్తున్నావ్ అంది. నేను అదే నీకు ఏం గిఫ్ట్ ఇవ్వాల్లో అని అన్నా. తను నా తల పై ఒకటి కొట్టి నువ్వు దాని గురించి ఆలోచించ కూడదు నన్ను చూడగానే అది ఇచ్చేయాలి అని అనిపించాలి అలాంటి గిఫ్ట్ ఏదైనా ఉందా అంది. నేను అయోమయంగా చూసాను. నేను అలా చూడడం చూసి చిన్నగా నవ్వింది. అంతలో మా అమ్మ బయట నుండి డోర్ కొట్టింది. నేను హా చెప్పు మా అన్నా. బయట నుండి అమ్మ, రూప లోపల ఉందా అంది. నేను హా అవును అన్నా. దాంతో బయట మా అమ్మ ఫోన్ లో మాట్లాడుతూ హా వుంది మా ఇంట్లోనే అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయింది. రూప నవ్వుతూ మా అమ్మ అనుకుంటా అంది. నేను టైం వంక చూసా రాత్రి పది నర అవుతుంది, వెంటనే తన వంక చూసి ఇక్కడే పడుకో ఈ రాత్రికి అన్నా. (మాకు ఇది అలవాటే ఒకే బెడ్ మీద పడుకోవడం) రూప నవ్వి హ్మ్మ్ అంది. నాకు తన ఫేస్ చూస్తుంటే తను నాకేదో చెప్పాలని ఉన్నట్లు కానీ, చెప్పలేక పోతున్నట్లు కనిపించింది. అలా అనిపించగానే నేను వెంటనే తన కళ్ళలోకి చూస్తూ నాకేమైనా చెప్పాలా అని అన్నా. తను కొంచెం కంగారుగా చూస్తూ ఏం లేదే అంది. నేను మరేంటి అలా ఉన్నావ్ అన్నా. తను మామూలుగా ఫేస్ పెడుతూ ఎలా ఉన్నా ? బాగానే ఉన్నానే అంది పైకి లేచి ఎదురుగా ఉన్న అద్దం చూసుకుంటూ. నేను తనని చూస్తూ నువ్వు రోజులా లేవు అన్నా. రూప నన్ను చూసింది. నేను పైకి లేచి పర్లేదు చెప్పు నా దగ్గర దాపరికం ఎందుకు అన్నా. తను నా కళ్ళలోకి చూస్తూ నిజంగా ఏమీ లేదు ఉంటే నీకు చెప్పనా ? అంది. నేను మళ్ళీ బెడ్ మీద కూర్చుంటూ మనసులో ఇదేంటి ఇవ్వాళ తేడాగా ప్రవర్తిస్తుంది అని అనుకుంటూ సరేలే త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకో పడుకుందాం అన్నా. (తను చాల సార్లు నా దగ్గరే పడుకుంటుంది కాబట్టి తన డ్రెస్ లు ఐదారు నా దగ్గరే పెట్టుకుని ఉంది) దానికి రూప పడుకుందాం లే తొందర ఎందుకు అంది వొళ్ళు విరుచుకుంటూ. అలా విరుచుకుంటూ తన బొడ్డు నాకు కనపడేలా చీర ను జరిపింది. అలా చీర జరుపుతూ ఉండడం నేను చూసా. తను నేను చూడలేదు అనుకుంది కానీ నేను అప్పటికే చూసేసి ఉండడం తో వెంటనే తన ముఖం లోకి చూస్తూ నన్ను ఏమైనా సెడ్యుస్ చేస్తున్నావా ? అన్నా. తను వెంటనే ఏంటి ? అంది. నేను తనని చూస్తూ ఏమైంది నీకు ఇవ్వాళ అన్నా. తను నన్ను చిరు కోపంగా చూస్తూ నేను ఇక వెళ్తా అంది. నేను అదేంటి ఉంటా అన్నావ్ గా అన్నా. తను ఏమో నాకు వెళ్ళాలి అని ఉంది అంది. నేను సరే నీ ఇష్టం అన్నా. తను బాగ్ తీసుకుని తలుపు తెరిచి బయటకు వెళ్తూ నా వంక ఒకసారి చూసింది. నేను కూడా తనని చూసా. తన కళ్ళలో ఎదో నాకు చెప్పాలి అని ఉన్నట్లు నాకు క్లియర్ గా తెలుస్తోంది. నేను ఏమయి ఉంటుందా అని ఆలోచిస్తూ ఉండగా తను డోర్ క్లోజ్ చేసేసింది.
అలా డోర్ క్లోజ్ చేసి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి మా ఇంటి ముందు నిలబడి తన తల మీద తనే కొట్టుకుంటూ ఛా, ఏమైందే నీకివ్వాల ? ఆ మాత్రం చెప్పలేవా వాడికి అనుకుంటూ అక్కడే తచ్చాడుతూ చెప్పేయవే రూపా చెప్పెయి ఏం కాదూ.. అని తనకు తనే దైర్యం చెప్పుకుంటూ అక్కడే మా ఇంటి ముందు అటు ఇటూ తిరుగుతూ ఉంది. అలా తిరుగుతూ తనని తనే ప్రిపేర్ చేసుకుంటూ ఏముందీ డైరెక్ట్ గా వెళ్ళి ఐ లవ్ యూ వినయ్ అని చెప్పి వచ్చేయి తరువాత ఏమైతే అది అయ్యింది అని బయటికే చిన్నగా మాట్లాడుకుంటూ చెప్పేయవే రూపా చేప్పేయి అని దైర్యం తెచ్చుకుంటూ కళ్ళు మూసుకుని నాలుగైదు సార్లు ఊపిరి తీసుకుని వదిలింది. అలా వోదులుతూ ఏమైతే అది అయ్యింది చెప్పెద్దాం అని దైర్యంగా అనుకుంటూ ఒకసారి మా ఇంటి పై ఫ్లోర్ లో ఉన్న నా రూం విండో వంక చూసింది. అంతే తనకు వెంటనే షాక్ కొట్టినట్లు అయ్యింది. అక్కడ నేను తననే చూస్తూ నిలబడి ఉన్నా. అది చూసి అయ్యో చుసేసాడే అని మనసులో అనుకుంటూ ఇలా అడ్డంగా దొరికి పోయానేంటి అని వెంటనే నా ముందు ఉండలేక తల దించుకుంటూ బుద్దిగా అక్కడ నుండి నడుచుకుంటూ తనింటి వైపుకు వెళ్ళింది. నేను అలా నడుస్తూ వెళ్తున్న తనని చూస్తూ ఏమైంది దీనికి అని అనుకుంటూ వెంటనే తనకి ఫోన్ చేశా. తను ఫోన్ రావడం చూసి తల తిప్పి నేను ఉన్న విండో వైపు చూసింది. నేను ఫోన్లో పైకి రా అని చెప్పేసి పెట్టేసా. అలా పెట్టేసి బెడ్ మీద వచ్చి కూర్చున్నా. కాసేపటికి తలుపు తట్టిన సౌండ్ వచ్చింది. నేను డోర్ తీసా. తను సైలెంట్ గా తల దించుకుని లోపలికి వచ్చింది. నేను తన ముఖం లో చూస్తూన్నా ఏం చెప్తుందా అని. తను నేను చూస్తుండడం చూసి తల అలాగే వంచుకుని ఉంది. నేను ఉఫ్ అనుకుంటూ ఇప్పుడైనా చెప్తావా లేక అంటూ అనబోతూ ఉండగానే వెంటనే తను తలెత్తింది. తలెత్తి నా వంక చూస్తూ ఐ లవ్ యూ అంది. నేను ఒక్కనిమిషం అర్దం కానట్లుగా చూసా. తను నన్ను చూసి మళ్ళీ కన్ఫర్మ్ చేస్తూ ఐ లవ్ యూ అని అంటూ ఇదే అప్పటి నుండి చెప్పాలి అనుకుంటున్నది అంది. నేను తనని అర్దం కానట్లుగా చూస్తూ జోక్ చేస్తున్నావ్ కదా అన్నా. రూప నా వంక సూటిగా చూసింది. నేను తన చూపు చూసి ఏంటి నిజమా ? అన్నా. రూప నెమ్మదిగా తల వొంచుకుంది. నేను తనని చూసి ఏంటిది అంటూ అనబోతు ఉంటే రూప నన్ను ఆపుతూ నా వంక చూసి నా చేతిని పట్టుకుంటూ ఇప్పుడేం చెప్పకు, నెమ్మదిగా ఆలోచించు, ఇవ్వాళ నా బర్త్ డే, నన్ను డిస్ అపాయింట్ చేయకు, అదే నువ్వు నాకిచ్చి గిఫ్ట్ అంది. అలా అంటూ నెమ్మదిగా డోర్ దగ్గరకు వెళ్ళింది. అలా వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంటే ఆగు అన్నా. రూప నా వంక చూసింది. నేను తన దగ్గరికి వెళ్తూ నీకు ఆల్రెడీ రమణ అంకుల్ కొడుకు తో పెళ్ళి కుదిరింది అని గుర్తుందా అన్నా. రూప తల దించుకుని మౌనంగా ఉండిపోయింది. నేను ఇంట్లో వాళ్ళు సడెన్ ఎవరినైనా వస్తారేమో అని వెంటనే తలుపు వేసేస్తూ తన వంక చూసా.