పెళ్లి తరువాత.. 89

తను కూడా స్మైల్ ఇస్తూ అవునూ చెప్పడం మరిచిపోయా, రమేష్ ఇందాక నీ కోసం చాలా సేపు వెయిట్ చేసాడు. వెయిట్ చేసి చేసి నీ ఫోన్ కూడా తగలక పోయే సరికి ఒక్కడే వెళ్ళిపోయాడు. నువ్వొస్తే వాడికి ఫోన్ చేయమని చెప్పాడు అని అంది. నేను అవునా సరే నేను ఇప్పుడే చేస్తాలే అని అంటూ ఫోన్ తీసుకుని పక్కకి వస్తుంటే ఆంటీ అమ్మను అక్కని లోపలికి తీసుకు వెళ్ళింది. నేను ఫోన్ చేత్తో పట్టుకుని రమేష్ గాడికి ఫోన్ చేయబోయా. కానీ సిగ్నల్స్ వీక్ గా ఉండడం తో కాల్ వెళ్ళలేదు. ఛా చెత్త సిగ్నల్స్ అని అనుకుంటూ బావ ను అక్కడే కూర్చోమని చెప్పి పైన బాల్కనీ లో ఏమైనా సిగ్నల్స్ రావొచ్చేమో అని పైకి వెళ్ళా. అక్కడ టీవీ ఆడుతూ కనిపించింది. నేను దగ్గరకు వెళ్లి ఎవ్వరూ లేరు అయినా ఆడుతూనే ఉంది అని అనుకుంటూ టివీ బంద్ చేసి బాల్కనీ లోకి వెళ్ళాను. అలా అక్కడకు వెళ్ళే సరికి అక్కడ అటు వైపుకు తిరిగి నిల్చొని ఉన్న రూప కనిపించింది.
రూప గురించి చెప్పాలంటే తను నాకంటే మూడేళ్లు పెద్దది. చాలా అందంగా ఉంటుంది. అమాయకంగా కనిపించే ముఖం తో ఎప్పుడూ ఫ్రెష్ గా ఫ్రిడ్జ్ లో నుండి తీసిన ఆపిల్ పండులా నిగనిగ లాడుతూ ఉంటుంది. విశాలవంతమైన నుదురుతో, నెలవంకల్లాంటి కనులతో, గులాబీ రేకుల్లాంటి బుల్లి పెదాలతో, అందంగా చక్కగా ఉంటుంది. తనని చూసిన ఎవ్వరైనా సరే ఇంకోసారి తిరిగి చూడాలి అని అనుకుంటారు. అలా ఉంటుంది, ఆ అందానికి తోడు తన సంపదలు, ఏ మగాణ్ణి అయినా ఇట్టే ఆకర్షింప చేయగల మోతాదు లో చాలా పొందికగా ఉంటాయ్. ఎన్నో సార్లు నేనే తనని వేరే విధంగా చూసే వాడ్ని. ఇక అసలు విశయం చెప్పాలంటే నేను తను చాలా క్లోజ్. తనకి నేనంటే నాకు తనంటే చాలా ఇష్టం. ఏ విశయాన్ని అయినా తనకి నేను తను నాకు షేర్ చేసుకోనిది అస్సలు ఉండం. కానీ మొన్న రీసెంట్ గా జరిగిన గొడవ వళ్ళ ఇద్దరం మాట్లాడుకోవడం మానేసాం. దాదాపు అది పెద్ద గొడవే అని చెప్పాలి ఎందుకు అంటే అది మా ఇద్దరి కుటుంబాల మధ్య చిచ్చు పెట్టగల అంశం. అందుకే ఇద్దరం మాట్లాడుకోవడం మానేశాం. నిజానికి ఇద్దరం అనే కంటే నేనే మాట్లాడడం మానేశా అనడం కరెక్ట్. అయినా ఇది మాకు మామూలే గొడవ పడడం మళ్ళీ కలవడం, కానీ ఈసారే కాస్త సీరియస్ గా ఉంది ఇష్యూ.
ఇప్పుడే స్నానం చేసినట్లు ఉంది. టవల్ తో తల తుడుచుకుంటూ ఉంది. నేను వచ్చిన పని చూసుకోవడం మానేసి తనని అలాగే నిల్చొని చూస్తూ ఉన్నా. అంతలో తను క్యాసువల్ గా తల తుడుచుకుంటూ ఇటు వైపుకు తిరిగింది. అంతే నేను ఇక్కడ బొమ్మలా నిలబడి తననే చూస్తూ ఉండడం తనకి కనిపించింది. వెంటనే తల తుడుచుకోవడం ఆపేసి నా వంక సీరియస్ గా చూసింది. నేను వెంటనే నేనేం నీతో మాట్లాడడానికి రాలేదు సెల్ సిగ్నల్స్ రాక వచ్చా అన్నట్లుగా తనని చూసా నా సెల్ తనకి చూపిస్తూ. తను నా వంక ఒకసారి ఎగా దిగా చూసి విసుగ్గా తల తిప్పేసుకుని మళ్ళీ తుడుచుకోవడం మొదలు పెట్టింది. ఇక్కడ ఉండి అనోసరంగా తనతో ఎందుకు లే అని అనుకుంటూ అక్కడ నుండి కిందికి వచ్చేశా.
అలా వస్తుండగా రమేష్ బార్య ఎదురు వచ్చింది. నన్ను చూసి పలకరింపుగా నవ్వుతూ ఏంటి వినయ్ ఎలా ఉన్నావ్ అంది. నేను నవ్వి బాగున్నా అని అన్నా. తను అంతలో ఎదో గుర్తు వచ్చినదానిలా అవునూ ఇందాక రమేష్ నీకు కాల్ చేస్తున్నా తగలలేదు అంట కదా ఎక్కడ పెట్టుకున్నావ్ ఫోన్ ను అంది. నేను చేతిలో ఫోన్ ను చూపిస్తూ నెట్వర్క్ రావట్లేదు అన్నా. అంతలో చేతిలో ఉన్న ఫోన్ మోగింది. చూస్తే రమేష్ చేస్తున్నాడు. వెంటనే అది తనకి చూపిస్తూ వాడే చేస్తున్నాడు అని అంటూ ఫోన్ లిఫ్ట్ చేశా. లిఫ్ట్ చేసి హెలో అంటూ హాల్ లోకి వచ్చా. అవతల నుండి రమేష్ గాడు..
రమేష్ : ఏరా ఏ లోకం లో ఉన్నావ్ నీ ఫోనే తగలడం లేదు..
నేను : ఏమోరా పొద్దున నుండి నెట్వర్క్ సరిగా రావట్లేదు, ఇప్పుడే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేశా వెంటనే నీ ఫోన్ వచ్చింది
రమేష్ : అది సర్లే కానీ సాయంత్రం పార్టీ కి సూట్ కొంటా అన్నావ్ గా వస్తావా మరి ?
నేను : ఇప్పుడా ? ఇప్పుడంత మూడ్ లేదు లేరా తరువాత చూద్దాం
రమేష్ : సరే, నీ ఇష్టం
నేను : ఇంతకీ ఎక్కడున్నావ్ ?
రమేష్ : గో డౌన్ రా
నేను : (అక్కడ ఉన్నాడంటే ఎవరినో కొడుతూ ఉంటాడు కచ్చితంగా) అక్కడేం చేస్తున్నావ్ రా
రమేష్ : మన స్వప్న ఉంది కదరా (రమేష్ వాళ్ళ నాన్న ఫ్రెండ్ కూతురు)
నేను : హా
రమేష్ : ఆమెను ఒకడు లవ్ చేస్తే వాళ్ళ నాన్న వాడికి థంకి ఇవ్వమన్నాడు, అదే చేస్తున్నా
నేను : రేయ్ వాళ్ళు సిన్సియర్ లవర్స్ కదరా నీకు తెలీదా ?