రమేష్ : నీ డౌటు తగలయ్య, ఒక్క క్షణం భయపెట్టేసావ్ కదరా, ముందే దానికి రమణ అంకుల్ కొడుకు కు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ చేశారు అంటూ నా ప్రశ్నకు సమాధానం చెప్తూ అయినా అది ఆణిముత్యం రా, దానికి నేను అన్నా, మా నాన్న అన్నా ప్రాణం, అలాంటిది నేను ఎంటో తెలిసి కూడా అది ఇలాంటి పనులు చేస్తుంది అనుకున్నావా ?
నేను : సరేసర్లే రా నీ ఆణిముత్యం గురించి తెలీక మాట్లాడా క్షమించు అంటూ మనసులో చిన్నగా నవ్వుకున్నా. పాపం వీడు ఏమో దాన్ని ఆణిముత్యం అంటున్నాడు అదేమో మొన్న వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్పింది. అది తెలిస్తే వీడు ఏం అయిపోతాడో అని అనుకుంటూ సరే సరే లేరా కొంచెం పని ఉంది మళ్ళీ చెస్తాలే అన్నా. దానికి వాడు కూడా సరే సరేలే ఇక్కడ కూడా నాకు కొంచెం పని పడింది, ఇప్పుడే ఆ స్వప్న లవర్ గాడు లేచాడు ఇంకో రౌండ్ వేసి వస్తా బాయ్ అంటూ ఫోన్ పెట్టేసాడు. వాడలా పెట్టేయగానే రూప నాకు ఐ లవ్ యూ చెప్పింది అని తెలిస్తే వీడు నన్ను కూడా స్వప్న లవర్ ను తీసుకు పోయినట్లే గో డౌన్ కు తీసుకు పోతాడా ఏంటి ? అని అనుకున్నా. అలా అనుకుని అంతలోనే ఛ ఛా అలా జరగదు లే, అయినా నేను రూప ను ఆక్సెప్ట్ చేస్తే కదా అదంతా అని అనుకుంటూ సెల్ జోబిలో పెట్టుకున్నా.
ఇంట్లో ఆ పని ఈ పని అంటూ కాసేపు టైం పాస్ చేశాక భోజనానికి రూప వాళ్ళ అమ్మ పిలిచింది. నేను వస్తున్నా అని చెప్పేసి హాండ్స్ వాష్ చేసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాను. అలా వెళ్తుంటే అప్పుడే కనిపించింది మెట్ల పై నుండి రూప కిందికి దిగుతూ. తనని పై నుండి కిందకు చూసా. ఘాగ్రా చోలి వేసుకుని స్టైల్ గా దిగుతూ వచ్చింది. నేను తననే దొంగ చూపులు చూస్తూ మళ్ళీ తను గమనిస్తే బాగోదు అనుకుంటూ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నా. తినే టైం లో ఒక ఐదారు సార్లు కోపంగా నా వంక చూసి చూసింది తను. కానీ నేనే పట్టించు కోకుండా మామూలుగా తినేసి చెయ్ కడుక్కుని లేచా. మా ఇద్దరి ప్రవర్తన చూస్తున్న మా అమ్మ ఏంటి ? రెండు జీవాలు మూగబోయి కూర్చున్నాయి ? మళ్ళీ గొడవా ? అంది నవ్వుతూ. అది విన్న రూప నా వంక చూసింది. నేను అమ్మతో అదేం లేదమ్మ అని చెప్తూ ఉండగా రూప వాళ్ళ అమ్మ వస్తూ ఏం లేదంటావ్ ఎంటి ? అది చూడు ఎలా చూస్తుందో అంటూ రూపను చూస్తూ అంది. (అంతవరకు నన్నే సూటిగా చూస్తున్న రూప వెంటనే తల దించుకుని తినడం మొదలెట్టింది) దాన్ని చూస్తుంటే అర్దం అవ్వట్లేదా, వీళ్ళు మళ్ళీ గొడవ పడ్డారు అని అంటూ అమ్మ వంక చూసి ఒకవేళ మామూలుగా ఉంటే ఇలా ఉంటారా ? చెవులు చిల్లులు పడేలా మాట్లాడుకుంటూనే ఉంటారు అంతే కదా అంది. మా అమ్మ నవ్వుతూ సరిగ్గా చెప్పావే అంది. నేను రూప ను ఒకసారి చూసి అక్కడ నుండి బయటకు వచ్చేశా. నిజానికి నేను రూప చాలా క్లోజ్, అది మా ఇంట్లో వాళ్ళింట్లో అందరికీ తెలుసు, ఒకవేళ తను నా ఏజ్ కంటే మూడేళ్లు పెద్దది కాక పోయి ఉంటే కచ్చితంగా మా ఇద్దరిని లవర్స్ అని అనేవాళ్ళు అలా ఉంటాం మేమిద్దరం క్లోజ్ గా. కానీ ఏజ్ గాప్ వళ్ళ మా ఇంట్లో కానీ తన ఇంట్లో కానీ ఎప్పుడూ మేము లవర్స్ లాగా ఉన్నాం అన్న టాపిక్ రాలేదు. పైగా వాళ్ళు మమ్మల్ని ఒక అక్కా తమ్ముడు లా చూస్తారు. కానీ వాళ్లకేం తెలుసు తననే నేను పెళ్లి చేసుకుంటాను ఫ్యూచర్ లో అని.
సాయంత్రం కావడం తో చిన్నగా పార్టీ స్టార్ట్ అయ్యింది. ఇంటి పక్కనే ఉన్న గార్డెన్ లో పార్టీ పెట్టుకున్నాం. నేను అక్కడ ఏమేమి ఉండాలో దగ్గరుండి అన్నీ సెట్ చేయిస్తున్నా. నేను అలా పనిలో ఉండగా అంతలో ఎదో మెసేజ్ వచ్చింది. తీసి చూస్తే రూప నుండి వచ్చింది అది. నేను వెంటనే తలెత్తి బాల్కనీ వైపు చూసా. (తను ఎక్కువగా అక్కడే నిలబడి ఉంటుంది) తను అక్కడే నిలబడి ఉంది, చేతులు కట్టుకుని నన్నే సీరియస్ గా చూస్తూ ఉంది. తన చేతిలో సెల్ కూడా ఉంది. నేను వెంటనే తనని అలాగే చూస్తూ మెసేజ్ ఓపెన్ చేశా. తల దించి ఏం పంపించిందో చూసా. అక్కడ వదిలేసాననుకోకు అని ఉంది. అది చూసి వెంటనే తలెత్తి తన వంక చూసా. తను ఒక చూపు చూసి లోపలికి వెళ్ళిపోయింది. నేను ఉఫ్ అని అనుకున్నా. తరువాత మళ్ళీ పనులలో పడిపోయి బిజీ అయిపోయా. రాత్రి కావొస్తుండగా పార్టీకి అందరూ వచ్చేశారు. అందరూ రావడం తో రూప కూడా మంచిగా చీర కట్టుకుని బయటకు వచ్చింది. తను రాగానే అందరూ క్లాప్స్ కొడుతూ ఆహ్వానించారు. తను ఆ చీరలో చాలా అందంగా ఉంది.
మీరు కానీ తనని ఇలా చూసి ఉంటే నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా గంట సేపు తిట్టేవారు. ఇంత ఏంజెల్ లాంటి ఫిగర్ ఐ లవ్ యూ చెప్తే నువ్వు వద్దంటావా అని..
అలా ఉంటుంది తను. నిజమే తను చాలా బాగుంటుంది. కానీ ఎందుకో తనంటే నాకు ఆ ఫీలింగ్ లేదు. ఆ ఫీలింగ్ అంటే పెళ్లి చేసుకోవడం అని. తనతో ఉండడం తనతో అన్నీ షేర్ చేసుకోవడం తనతో గొడవ పడడం ఇవ్వన్నీ నాకు నచ్చుతాయి కానీ ఎందుకో పెళ్లి అంటేనే, అవసరమా అన్నట్లుగా అనిపిస్తుంది. అలా అనిపించడానికి కారణం లేక పోలేదు. మొదటి కారణం వాళ్ళ నాన్న ఇచ్చిన మాట అయితే రెండో కారణం వాళ్ళ అన్న. ఇక మూడో కారణం చెప్పాలంటే అసలు నాకు తన మీద ఆ ఫీలింగ్ ఏ లేదు. ఎందుకో తనని చూస్తే అరే నాకు తను అమ్మ లాగ కదా తనతో బెడ్ షేర్ చేసుకోవడం ఏంటి అని ఒక ఫీలింగ్ వస్తుంది. నేను తనకు చాలా క్లోజే కానీ నాకు తన మీద అలాంటి ఫీలింగ్సే లేవు. ఎందుకు అంటే తను నన్నెప్పుడూ ఒక అమ్మలా కేర్ చేసేది. ఏదైనా తప్పు చేస్తే చాలు కోపంగా తిడుతుంది. కొన్ని సార్లు అయితే కొడుతుంది కూడా. తను అలా ఉండడమే నాకు బాగా నచ్చేది. పైగా తను నాకంటే పెద్ద, అదో కారణం కూడా ఉంది. బహుశా తను పెద్ద అవ్వడం వల్లనే నేమో మేము చిన్నప్పటి నుండి ఎంత క్లోజ్ గా ఉన్నా ఎవ్వరూ కూడా (ఇంట్లో వాళ్ళు) మమ్మల్ని లవర్స్ లా చూడలేదు. తను కూడా ఎప్పుడూ అలా ప్రవర్తించేది కాదు. చనువుగా ఏం చేసినా నాలుగు గోడల మధ్యే ఉండేది. తను అలా పెద్దరికం తో నన్ను పిల్లాడిలా కేర్ చేయడం వల్ల నేమో తన మీద నాకు సెక్సువల్ ఫీలింగ్స్ కానీ పెళ్లి చేసుకోవాలి అనే ఫీలింగ్ కానీ రాలేదు, తను ఐ లవ్ యూ చెప్పినప్పుడు కూడా ఇదే చెప్పాను తనకు.
