పెళ్లి తరువాత.. 89

రమేష్ : హా, తెలుసు తెలుసు ఈ ప్రేమ లు అన్నీ నాటకాలే అని బాగా తెలుసు.
నేను : రేయ్ నిజం రా నేను చెప్తుంది వాళ్ళు నిజంగా సిన్సియర్ లవర్సే.
రమేష్ : బాగా చెప్పావ్ రా, నిజంగా అంత ప్రేమ ఉన్నొడే అయితే ఈ అందం ఆస్తి ఉన్న స్వప్న నే లవ్ చేయాలా ? ఇంకెవరు దొరకరా ? అదే వీడి కంటే తక్కువ ఉన్న అమ్మాయిని వీడు లవ్ చేయమను అప్పుడు నమ్ముతా..
నేను : అప్పటికైనా నువ్వు నమ్ముతావ్ అని నాకు నమ్మకం లేదు లేరా, నీ గురించి నాకు తెలీదా ?
రమేష్ : మరి తెలుసుగా ఎందుకు ఈ అనోసరమైన చర్చలు
నేను : అనోసరం అనకు, ఒకటి చెప్తా విను, నీ సర్కిల్ లో రోజూ నీతో తిరుగుతూ, నీతో ఉంటూ అన్నీ షేర్ చేసుకుంటూ ఉన్న వాళ్ళ మీద నీకు లవ్ పుడుతుందా ? లేక ఎవరో తెలీని వాళ్ళ మీద నీకు లవ్ పుడుతుందా చెప్పు ? నువ్వు రోజూ కలిసి తిరుగుతూ, అన్ని షేర్ చేసుకుంటూ ఉన్న వాళ్ళ మీద కలుగుతుంది అది సహజం. దీనిని పట్టుకుని వాడు అందం ఆస్తి ఉన్న స్వప్న నే ఎందుకు లవ్ చేసాడు వేరే ఎవరినో చేయొచ్చు గా అంటే ఎలా ? వాడికి ఉన్న సర్కిల్ లో తనే వాడికి బెస్ట్ ఫ్రెండ్ అదలా ముందుకు పోయి ప్రేమగా మారింది. దాన్ని పట్టుకుని నువ్వు అనోసరంగ అదీ ఇదీ అంటూ..
అయినా ఒకవేళ వాడి కంటే తక్కువ అమ్మాయిని వాడు రోజు వారీగా కలుస్తూ ఉంటే అప్పుడు వాడికి నిజంగా ఆమె మీదే ప్రేమ రావొచ్చు ఏమో ఎవరికి తెలుసు ?
రమేష్ : ఇప్పుడేంటి ? నేను పోయి వాడికి స్వప్న కు పెళ్లి చేయాలా ఎంటి ?
నేను : నేను అలా అనట్లేదు అయినా నువ్వు అలా చేస్తే చాలా సంతోషిస్తా.
రమేష్ : ఆపుతావా, అయినా నీకు నా గురించి బాగా తెలుసు ఈవెన్ నువ్వు ప్రేమించినా కూడా నేను ఇలాగే మాట్లాడతా ఇంకా చెప్పాలంటే మిమ్మల్ని కూడా విడగొడతా అంతే కానీ లవ్ అంటే మాత్రం ఒప్పుకునేదే లేదు ఎవ్వరైనా సరే..
నేను : అబ్బో, ఒకటి అడుగుతా నిజం చెప్పురా, నీ పెళ్లాన్ని అయినా లవ్ చేస్తున్నావా లేక ఇలాగే తన ముందు కూడా మాట్లాడుతూ ఉన్నావా ?
రమేష్ : రేయ్ మాకు పెళ్లి అయ్యింది రా, ఇది వేరు అది వేరు
నేను : డ్రామాలు చేయకు రా, నీకు నిజంగా లవ్ అంటే ఎంటో తెలీదు, కానీ దాని గురించి మాట్లాడుతున్నావ్ ఒకసారి నువ్వు కూడా లవ్ లో పడింటే అప్పుడు తెలిసేది నీకు..
రమేష్ : (వెక్కిరింపుగా) అవును తెలిసేది, అయినా అది పక్కన పెట్టూ, నువ్వేంటి లవ్ గురించి అంత చెప్తున్నావ్, నువ్వేమైనా లవ్ లో పడ్డావా ఎంటి ? (అనుమానంగా)
నేను : నీకన్నీ అనుమానాలేనారా ? అలాంటిదేం లేదులే బాధ పడకు
రమేష్ : జాగ్రత్త, దానికి ఎంత దూరం ఉంటే అంత మంచింది. అయినా నువ్వు ఆ వూబిలో పడిపోయినా నేను ఉన్నాలే నిన్ను పైకి తీసుకు రావడానికి, అస్సలు కనికరం లేకుండా నిన్ను ఆ ఊబి లో నుండి లాగేస్తా, అర్దం అయ్యిందా ?
నేను : హ్మ్మ్ హ్మ్మ్ అర్దం అయ్యింది లే, అయినా అలాంటిది ఏమీ జరగదులే కానీ..
(రూప గుర్తొచ్చి) నాకో డౌట్ రా..
రమేష్ : ఎంటి ?
నేను : ఇప్పుడు నీ చెల్లి ఉందిగా,
రమేష్ : హా
నేను : ఒకవేల అది ఎవరినైనా లవ్ చేసిందే అనుకో..
(వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో అనుకుంటూ)
అప్పుడు ఏం చేస్తావ్ ? చెప్పు..
పెళ్లి చేస్తావా ? లేక విడగొడతావా ?
రమేష్ : రేయ్, మైండ్ దొబ్బిందా ? అయినా నా చెల్లి మీద పడ్డావ్ ఏంట్రా ? దానికి ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయితేనూ..
(ఇక్కడ ఇంకో విశయం చెప్పాలి, దేవేంద్ర, మా నాన్న ఇంకా రమణ ముగ్గురు మంచి స్నేహితులు. వాళ్ళు ఒకసారి ఫ్యామిలీ తో పిక్నిక్ కు పోయి తిరిగి వచ్చే టప్పుడు దేవేంద్ర వద్దన్నా మందు తాగేసి డ్రైవ్ చేయడం మొదలు పెట్టాడు. అతను కంట్రోల్ లో లేడు మీరు నడపండి అని రమణ వైఫ్ చెప్పింది. రమణ కూడా అవును దేవేంద్ర నువ్వు కంట్రోల్ లో లేవు అని అంటూ దేవేంద్ర కు కార్ ఆపమని చెప్పాడు. అది విని ఎంటి నా కంట్రోల్ మీద మీకు డౌటు ఉందా అంటూ కార్ ఆపకుండా చూడండి నా డ్రైవింగ్ ఎలా చేస్తానో అని అంటూ కార్ ను ఇంకా ఫాస్ట్ గా పోనించాడు. వద్దన్నా అలాగే నడుపుతూ ఉన్న దేవేంద్ర కు చిన్నగా మత్తు కమ్ముకోసాగింది. అంతే రమణ వైఫ్ భయపడి నట్లుగానే ఆ మత్తు లో దేవేంద్ర ఆక్సిడెంట్ చేసాడు. చూస్తే రమణ వైఫ్ చనిపోయింది. అప్పుడు దేవేంద్ర గిల్టీ తో చాలా బాధ పడ్డాడు. రమణని చూడలేక తను చేసిన తప్పుకు ఏం చెప్పాలో తెలీక దేవేంద్ర చాలా మదన పడ్డాడు. రమణ కూడా ఫ్రెండ్ కాబట్టి దేవేంద్ర ను ఏం అనలేక పోయాడు. వాళ్లిద్దరూ అలా ఉండడం చూసి ఇలా అయితే కష్టం అని మా నాన్నే ఇద్దరినీ పిలిచి సర్ది చెప్తూ జరిగింది మార్చలేం ఇప్పుడు ఏం చేసినా తనని తీసుకు రాలేం, కాబట్టి జరగాల్సింది చూద్దాం అంటూ రూపను రమణ ఇంటి కోడలిగా చేసుకోమన్నాడు. అది విని దేవేంద్ర రమణ ఇద్దరూ సంతోషించారు. కానీ రమణ కొడుకు నేను సొంతంగా సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకుంటాను అని టైం తీసుకున్నాడు. ఇంకో వన్ ఇయర్ లో వాడు తిరిగి రావొచ్చు ఫారిన్ నుండి. ఇలా రూప కు చాలా కాలం క్రితమే పెళ్లి నిర్చయం అయ్యింది)
ఫోన్ లో రమేష్ మాట్లాడుతూ..
రమేష్ : కొంపదీసి అది ఎవరినైనా లవ్ చేస్తున్నట్లు గానీ నీతో చెప్పిందా ఎంటి ?
నేను : ఛ ఛా, అలా ఏం లేదు లేరా, అందరి విశయాల్లో కోపంగా రియక్ట్ అవుతావ్ గా, అదే నీ చెల్లి విశయం లో ఎలా చేస్తావో అని డౌట్ వచ్చి అడిగా..