పెళ్లి తరువాత.. 89

కాసేపటికి రూప మాట్లాడుతూ వినయ్ నీ ప్రాబ్లెమ్ ఎంటి చెప్పు అంటూ నన్ను చూసింది. నేను మౌనంగా తనని చూసా. దాంతో తను నన్ను చూస్తూ నీ ప్రాబ్లెమ్ ఎంటి ? మా నాన్న మాటను నేను ఎదిరిస్తున్నా, మా అన్న కు ఇష్టం లేకుండా ప్రేమిస్తున్నా అంతే కదా అంది. నేనేం పలకలేదు. తను నన్ను చూసి నేను వాళ్ళని హ్యాండిల్ చేసుకోగలుగతాను వినయ్ నువ్వు దీనికే ఇంత భయపడాల్సిన అవసరం లేదు అంది. తను అలా అనగానే తన వంక చూసా. తను నన్ను చూసి ఇంకా చెప్తూ నేను వాళ్ళని కన్విన్స్ చేసుకోగలుగుతా వినయ్, నన్ను నమ్ము, నీకు నా సైడ్ నుండి ఎటువంటి ప్రాబ్లెమ్ రాకుండా నేను చూసుకుంటాను అంది. అది విని నేను ఏమీ చెప్పలేక ఊరుకుండి పోయా..
నేను అలా ఏమీ అనకపోయే సరికి తను నాకు కొంచెం దగ్గరగా వచ్చింది. నేను ఏమీ అనలేదు తను నా బుజం మీద చెయ్ వేస్తూ నన్ను చూసి, అనోసరంగా వాటి గురించి అలోచించి మనసు పాడు చేసుకోకు వినయ్ వాళ్ళ గురించి నేను చూసుకుంటాను. అనోసరంగా వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తావ్ ? చెప్పు అంటూ నీకు మాత్రం నన్ను ప్రేమించాలి అని లేదా ఎందుకు మనసులో దాచుకుంటావ్ ? అంది నన్ను ప్రేమగా చూస్తూ.
తను అలా అనగానే నేను తనని చూస్తూ నేను మనసులో దాచుకున్నా అని నీకు చెప్పనా రూపా అన్నా. దానికి తను కొద్దిగా సీరియస్ గా చూసింది. నేను తల పైకి ఎత్తుతూ తనని చూస్తూ రూపా నేను నిన్ను ప్రేమిస్తున్నా అని అనుకోకు, నిజంగా నాకు అలాంటి ఉద్దేశం లేదు అన్నా. అలా అంటూ నేను నిన్ను ప్రేమించాలి అని కూడా అనుకోవడం లేదు అన్నా. ఆ మాట అనగానే రూప మొహం కోపంగా మారిపోయింది. నేను అది చూసి ఇంకా చెప్తూ నువ్వు అనుకోవచ్చు నేను ఇదేదో కావాలని చెప్తున్నా అని. కానీ కాదు, నిజంగా చెప్తున్నా అంటూ తనని చూస్తూ నాకు నిజంగా నీపై ఎప్పుడూ కూడా అలాంటి ఫీలింగ్సే కలగలేదు, అలాంటప్పుడు నేనెలా నిన్ను ప్రేమిస్తా చెప్పు అన్నా. అలా అంటూ, బహుశా బాడీ పరంగా నిన్ను చూసి అప్పుడప్పుడు అట్రాక్ట్ అయ్యనేమో అంతే కానీ నిజంగా నీ మీద పెళ్లి చేసుకోవాలి, నీతో బెడ్ షేర్ చేసుకోవాలి అన్న ఫీలింగ్స్ అయితే అస్సలు లేవు అన్నా. తను కొంచెం కోపంగా తల పక్కకు తిప్పుకుంది. నేను తన భుజం మీద చెయ్యి వేస్తూ తనని నా వంక తిప్పుకున్నా. తను నన్ను చూసింది. నేను తన కళ్ళలోకి చూస్తూ ఒకవేళ చిన్నప్పటి నుండి నేను నిన్ను చూస్తూ పెరగకపోవడం, ఇంకా నువ్వు నన్ను ఇలా ఒక తమ్ముడిలా కేర్ చేస్తూ ఉండక పోవడం ఉండడం జరిగి ఉన్నింటే బహుశా నిన్ను చూసిన మొదటి చూపు లోనే నీతో లవ్ లో పడే వాన్నేమో, కానీ ఇప్పుడు నాకు అలా లేదు, నేను నిజంగా నిన్ను ఆ ఉద్దేశం తో చూడలేక పోతున్నా అన్నా.