జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 10 65

మహేష్ వెంటనే 180 డిగ్రీస్ లో కారును వెనక్కు తిప్పి వన్ వే లో కొద్దిదూరం హార్న్ కొట్టుకుంటూ వ్యతిరేకంగా వస్తూ 4 రోడ్ల సర్కిల్ లో సరైన దారిలోకి వచ్చి అనకాపల్లి వైపు వేగంగా పరుగులు పెట్టించసాగాను. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పటికీ 15 నిమిషాల్లో సిటీ బయటకు వచ్చి , హైవే పై పోనిస్తూ మహికి కాల్ చేస్తుండగా తను కూడా నాకు కాల్ చేస్తోందేమో బిజీ అని వినిపిస్తుండగా మొబైల్ ను పక్క సీట్ లోకి విసిరి 30 నిమిషాలలో అత్తయ్య ఇంటికి చేరుకొని బ్రేక్ వెయ్యగా కారు ముందుకు వెళ్లి ఆగిపోతుండగా ముందే దిగి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళాను.

కింద హాల్ లో ఎవరు లేకపోవడంతో పైన అత్తయ్య రూమ్ లో ఉన్నారేమో అని పరిగెత్తుకుంటూ మెట్లు ఎక్కగా రూమ్ బయట సెక్యురిటి అన్న ఉండగా ముందుకు వెళుతుండగా డాక్టర్ బయటకు వచ్చి ఇవి తీసుకొని రమ్మని సెక్యురిటి కి ఇస్తుండగా దానిని తీసుకొని పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి కారులో మెడికల్ స్టోర్ వెళ్లి 10 నిమిషాలలో తీసుకుని వచ్చి రూమ్ బయట ఉన్న డాక్టర్ కు ఇవ్వగా పిల్లలిద్దరూ ఏడుస్తూ వచ్చి నన్ను హత్తుకోగా చిన్నాను ఎత్తుకొని అమ్మకు ఏమి అవ్వదు అని కన్నీళ్లు కారుస్తూ చెబుతూ రూమ్ బయటే నిలబడ్డాను.

డాక్టర్ మొత్తం పరీక్షించి అర చేతికి కట్టు కట్టి ఇంజుక్షన్ వేసి బయటకు వచ్చి ఏమి పర్వాలేదు అర చెయ్యిపై చర్మం మందంగా ఉన్నందు వల్ల చర్మం మాత్రమే కాలింది కొన్ని నెలల్లో మాములు స్థితికి వచ్చేస్తుంది, నొప్పి ఉండకుండా ఇంజక్షన్ వేసాను గంట వరకు మత్తు ఉంటుంది, ఈ టాబ్లెట్ లను మూడు పూటలా వాడండి అని చెప్పి బయటకు నడుస్తుండగా చిన్నాను నెమ్మదిగా కిందకు దింపి ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పి డాక్టర్ వెంటే బయటకు వెళ్లి విడిచి వద్దామని అనుకుంటుండగా సెక్యురిటి వచ్చి మహేష్ నేను వెళ్తాను అని చెప్పగా డాక్టర్ కు ఫీస్ ఇచ్చేసి పైకి వెళ్లి రూమ్ బయట నిలబడగా , మహి నెమ్మదిగా వచ్చి నా గుండెలపై వాలిపోయి ఏడ్చి ఏడ్చి కళ్ళల్లో నీళ్ళు అయిపోయి , కళ్ళు ఎర్రగా అయ్యాయి.

4 Comments

    1. Hi Jyothi this is RASHID. 26 age with 9 inch modda staying alone in Hyderabad

  1. Sir all parts update cheyandi

Comments are closed.