జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 10 65

లోపలికి వెళదాము అన్నట్లు లాగగా అత్తయ్య బాధపడుతుంది అన్నట్లు ఆగిపోగా , బావ నా కోసం లోపలికి రా అని దీనంగా చెప్పగా , పిల్లలు కూడా చేతులను పట్టుకొని లాగగా , లోపలికి వెళ్ళి మత్తువలన పడుకున్న అత్తయ్య బెడ్ పక్కనే కుర్చీలో కూర్చొని కట్టు కట్టిన చేతిని చూడగానే నాకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళు కారుతూనే ఉండగా స్పర్శించడానికి ప్రయత్నిస్తూ ఆగిపోయి అత్తయ్య ముఖాన్ని ఆరాధనగా చూడసాగాను.

బావ టీ చేసుకొని వస్తాను అని కిందకు వచ్చి వంటింట్లోకి వెళ్లగా , ఒక దుప్పటి తీసుకొని చేతికి తగలకుండా అత్తయ్య నడుము వరకు కప్పి వర్షిని శబ్దం చెయ్యకుండా అమ్మను చూస్తూ ఉండండి ఇప్పుడే వస్తాను అని చెప్పి, బయటికి వెళ్లి అందరికి తినడానికి తీసుకు వచ్చి , మహి దగ్గరికి వెళ్లగా టీ చేస్తుండగా పక్కనే నిలబడి పిల్లలకు పెట్టివ్వు అని చెప్పి, మహి ఎలా జరిగింది అని బాధగా అడుగగా, బావ అని ఏడుస్తూ నన్ను గట్టిగా కౌగిలించుకొని అంతా నా వల్లే జరిగింది అని ఉదయం జరిగిందంతా పూసగుచ్చినట్లు మొత్తం వివరించి , నేను గ్లాస్ లో నీళ్లు తీసుకొని అమ్మకు ఇద్దామని తిరగగా, నేను చాలా పెద్ద తప్పు చేశాను , నాకు శిక్ష పడాల్సిందే అని” నన్ను క్షమించు బుజ్జి” అని ఒక్కసారిగా మంటపై చేతిని పెట్టేసింది ,

నేను వెంటనే గ్లాస్ కిందపడేసి అమ్మ చెయ్యిని తియ్యడానికి ప్రయత్నించగా మరోచేతితో ఆపుతుండగా , నా బలం అంతా ఉపయోగించి చేతిని పక్కకు తీసి గ్యాస్ ఆపు చేసి చేతిని నీళ్లల్లో పెట్టి వెంటనే నీకు కాల్ చేశాను బావ , తప్పంతా నాదే నాదే అని పదే పదే చెప్పి భాధపడుతుండగా, తప్పంతా నాది మహి , అత్తయ్యను సంతోషంగా ప్రేమగా చేసుకోవాలన్న ప్రతిసారి ఏదో ఒకటి అడ్డుపడుతోంది అని కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారి మహి చెంపపై పడగా , మహి నా కళ్లల్లో కారుతున్న కన్నీళ్లను తుడవగా , నా చేతులతో మహి కళ్ళల్లో నుండి కారుతున్న నీటిని తుడిచి గ్యాస్ ఆపు చేసి అత్తయ్య ఉన్న రూమ్ కు వెళ్ళాము.

పడుకున్న అత్తయ్య బెడ్ పై పక్కనే కూర్చుని అత్తయ్య చెంపపై ప్రేమగా నిమారాలని కొద్దిగా వొంగగా అక్కడి వరకు తీసుకొని వెళ్లి ఆగిపోగా ఒక చుక్క కన్నీరు అత్తయ్య నుదిటి పై పడగా వెనక్కు వచ్చి కూర్చోగా, ఆ వెచ్చటి కన్నీటి చుక్కను అత్తయ్యకు కొద్దిగా మెలకువ వచ్చి కళ్ళు కొద్దిగా తెరుచుకోగా , అత్తయ్య గమనిస్తోందని తెలియక,.”అత్తయ్య దీనికి అంతటికీ కారణం నేనే, నన్ను ఆ దేవుడు కూడా క్షమించారాదు. ఈ బాధకు కారణమైన నాకు ఎంత పెద్ద శిక్ష విధించినా సంతోషంగా అనుభవిస్తాను.

4 Comments

    1. Hi Jyothi this is RASHID. 26 age with 9 inch modda staying alone in Hyderabad

  1. Sir all parts update cheyandi

Comments are closed.