జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 10 65

అందరూ మాట్లాడుకుని ఒకరి ఇంటి దగ్గరకు చేరి 8 మంది 4 స్కూటీ లలో నవ్వుకుంటూ వస్తూ స్కూటీ లను పార్కింగ్ ప్లేస్ లో పెట్టి ఫాషన్ షో మోడల్స్ లాగా నలుగురు టైట్ జీన్స్ మరియు టైట్ టీ షర్ట్స్ మరియు మిగతావాళ్ళు స్కర్ట్స్ వేసుకొని క్యాట్ వాక్ చేస్తున్నట్లుగా వయ్యారంగా నడుస్తుండగా కృష్ణ గాడు వాళ్ళను చూడకుండా డల్ గా ఉండగా నా కళ్ళు మాత్రం వాళ్లనే నోరు పూర్తిగా తెరిచి చూస్తుండగా నన్ను చూసి నవ్వుకుంటూ వచ్చి నా నోరు చేతులతో మూస్తూ ఈగలు దూరతాయి అని పగలబడి నవ్వుకుంటూ నన్ను దాటి లోపలికి వెళుతుండగా వారి వారి పెర్ఫ్యూమ్ వాసనకు మత్తు ఆవహిస్తూ పిచ్చెక్కిపోసాగింది.

చి చి అలా ఆలోచించకూడదు నేను ఒక్కసారి పిలవగానే చాలా దూరం వచ్చి సహాయం చేసారు అని నా తలపై ఒక దెబ్బ వేసుకొని లోపలికి వెళ్ళి పెద్ద టేబుల్ దగ్గరకు పిలుచుకొని వెళ్లగా మాట నిలబెట్టుకున్నావు మహేష్ నువ్వు చాలా గ్రేట్ అని సంధ్య అనగా అందరూ చప్పట్లు కొడుతూ వంత పాడారు.

వెయిటర్ వచ్చి అందరికి మెనూ కార్డ్ ఇవ్వగా కుర్చీలో నుండి పైకి లేచి ఇవ్వాళ మీరు ఎంత తింటారో ,ఏమి తింటారో మీ ఇష్టం వచ్చినవి ఆర్డర్ చెయ్యండి అని పూర్తి భరోసా ఇవ్వగా ఆనందంగా ఒకరినొకరు చర్చించుకుంటూ రోజు వారీ తినేవి కాకుండా చైనీస్, ఆసియన్ మరియు తమకు ఇష్టమైన ఇండియన్ ఫుడ్ అందరూ అరుస్తూ చెబుతుండగా ఒక వెయిటర్ వల్ల చేతకాక పోవటంతో మరో ఇద్దరు వెయిటర్ లు వచ్చి మేడం యెస్ , ఆ మేడం ok అని మొత్తం రాసుకొని 15 నిమిషాల తరువాత నీళ్ల బాటిల్ తో సహా కొన్ని కొన్ని ఐటమ్స్ తెచ్చి తిప్పి ఉన్న ప్లేట్ లను సరిగ్గా పెట్టి వస్తున్న అన్ని వడ్డించి మిగిలిన వాటిని మధ్యలో ఉంచసాగారు.

మా ఫ్రెండ్స్ వేసుకున్న డ్రెస్ లకు వారు తింటున్న పద్ధతికి అసలు పొంతనే కుదరక వెయిటర్ లు వింతగా చూస్తుండగా నాకు నవ్వు కంట్రోల్ తప్పి దగ్గుతూ నవ్వసాగాను , మా ఫ్రెండ్స్ దానిని చూసి దిష్టి పెట్టకు మహేష్ అని మళ్ళీ బుక్కుతుండగా చెప్పానుగా ఇవ్వాళ మీ ఇష్టం అని ఎవారు అడ్డు రారు అని నాలో నేను నవ్వుతూ కృష్ణ వైపు చూడగా తల దించుకొని తినాలి వద్దా అని తింటున్నాడు.

4 Comments

    1. Hi Jyothi this is RASHID. 26 age with 9 inch modda staying alone in Hyderabad

  1. Sir all parts update cheyandi

Comments are closed.