జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 22 53

థాంక్స్ ఇందు అంటూ తాళాలు అందించి వెనుక కూర్చొనగా , అమ్మలిద్దరూ ముందు కూర్చొంటూ అమ్మ ముందుగా ఎక్కడికి వెళ్ళాలి అని అమ్మమ్మను అడుగగా , నీ కొడుకుని నువ్వు ఎక్కేక్కడికి తీసుకు వెళ్ళాలి అని అనుకుంటున్నావో అక్కడికి వెల్లు బేను మాత్రం నా మనవడితో ప్రశాంతంగా మాట్లాడుకుంటూ వస్తాను అనగా , సరే అమ్మ అంటూ ముందుకు పోనివ్వగా , అమ్మమ్మ అమితమైన సంతోషంతో నా మీద ప్రేమతో ఆతృతగా ఏదేదో మాట్లాడుతూ బంగారు చిన్నప్పుడు స్కూల్ , ఇంటి దగ్గర జరిగినవి ఏవైనా చెప్పు హాయిగా వింటాను అని ఆశగా అడుగగా , సరే అమ్మమ్మ ఈ రోజు నీ కోరిక తీర్చడమే నా మొదటి కర్తవ్యం అంటూ జరిగిన ఆనంద సంఘటనలను పంచుకొంటుండగా ,

ముందు ఇందు అమ్మ డ్రైవ్ చేస్తూ అక్కయ్య మన బేబీ కి ఇష్టమైన వాళ్ళందరి గురించి తెలుసుకోవాలని ఉంది అని అమ్మను అడుగగా , వైజాగ్ వస్తున్నావు కాబట్టి అక్కడి పరిస్థితులన్నీ కచ్చితంగా తెలుసుకోవాలి అంటూ నా చిన్నప్పటి నుండి జరిగిన విషయాలు అమ్మమ్మకు చెబుతున్నప్పుడల్లా అమ్మ అందుకొని ఆ సందర్భంలో ఉన్న స్నేహితులు మరియు బంధువుల గురించి ఇందు అమ్మకు వివరిస్తూ ,కృష్ణ గాడి గురించి, అత్తయ్య మరియు మహి ఫామిలీ , దివ్యక్క ఫామిలీ మరియు ఇందుమతి గారి ఫామిలీ ……….ఇలా వివరిస్తూ ఉండగా , “అక్కయ్య మహి నాతో అత్తయ్య త్వరలోనే అందరూ కచ్చితంగా కలిసిపోతాము అన్న మాట వల్లే నేను మిమ్మల్ని చేరుకున్నాను” అంటూ ఉద్వేగంగా మాట్లాడుతూ డ్రైవ్ చేస్తుండగా ,

అవును చెల్లి అది ఎక్కడ ఉంటే అక్కడ ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది అంటూ ఒంగుతూ ఇందు అమ్మ తలపై ముద్దు పెడుతూ ఆప్యాయంగా నిమురుతుండగా , దానిని చూసి అమ్మమ్మ కళ్ళల్లో ఆనంద భాస్పాలు కారగా , అందరిని చూస్తూ నా హృదయం సంతోషంతో పులకించిపోయింది అంతలో కారు ఆగగా బయటకు చూడగా “HANGING GARDENS” కనపడగా బయట వాతావరణం కూడా రొమాంటిక్ గా ఉండగా , అమ్మ బ్యూటిఫుల్ అంటూ కారు దిగుతూ అవతలి వైపుకు వెళ్లి డోర్ తెరిచి అమ్మమ్మ చెయ్యి అందుకొని ధింపుతూ టికెట్స్ తీసుకొనగా అమ్మలిద్దరూ ఒకరి చేతిలో చెయ్యి పట్టుకొని ఉద్వేగంగా మాట్లాడుతూ నడువగా , అమ్మమ్మతో మాట్లాడుతూ గంట పాటు ఆ ప్రదేశమంతా చూసి ,

అక్కడి నుండి “CHHOTA KASHMIR” కు వెళ్లి లేక్ లో బోటింగ్ చేసి సాయంత్రం 7 గంటలకల్లా ఇందు అమ్మ కారును ముంబై షాపింగ్ phoenix సెంటర్ దగ్గర ఆపగా , లోపలికి వెళ్ళగా అమ్మ కారులో చెప్పిన ప్రతి ఒక్కరికీ పిల్లలకు సహా అందరికీ బట్టలు , గిఫ్ట్స్ తీసుకొనగా , మా మంచి చెల్లి అంటూ మొత్తం ప్యాక్ చేయించి గంటలో అడ్రస్ లో డెలివరీ ఇవ్వాలని చెప్పి బయటకు వస్తుండగా , అమ్మమ్మ అమ్మలిద్దరిని ఆపుతూ నగల షాప్ లోకి పిలుచుకు వెళ్లగా , అమ్మ ఇప్పుడెందుకు అని అడుగగా నా సంతోషం కోసం అంటూ costliest రెండు డైమండ్ హారాలను అమ్మలిద్దరికి కొనగా , అమ్మమ్మ అద్భుతంగా ఉన్నాయి అంటూ సమయం చూడగా 9 అవుతుండగా అక్కడే భోజనం చేసేసి ఇంటికి చేరుకునేసరికి రాత్రి 11 గంటలు అవ్వగా అందరూ అలసిపోయి వెళ్లి సోఫాలో వాలిపోగా ,

అమ్మమ్మ ఆత్రంగా అటు ఇటు తిరుగుతూ ఒక సూట్కేస్ తీసుకువస్తూ తెరిచి పత్రాలు చూపిస్తూ , బంగారు ఇవన్నీ వైజాగ్ లో ఉన్న మన ఆస్తి తాలూకు పత్రాలు మరియు ఇది మీ తాత గారు స్వయానా రాసిన లెటర్ అంటూ సీల్ చేసిన కవర్ ఇవ్వగా ,సూట్ కేస్ కూడా సరిపోనన్ని పత్రాలు అదిమి పెట్టి ఉండగా అమ్మమ్మ ఇప్పుడే ఎందుకు అని వారించగా , ఇది నీ ఆస్తి నువ్వు ఏదైనా చేసుకో నా తృప్తి కోసం అంటూ ఆపుతూ అందిస్తూ కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి 2 గంటలకల్లా ఎయిర్పోర్ట్ కు బయలుదేరుదాము అని చెప్పగా , థాంక్స్ అమ్మమ్మ అంటూ గట్టిగా కౌగిలించుకుంటూ ,

అమ్మమ్మ ఒడిలో కిందకు జారుతూ అలాగే నిద్రపోగా ఆప్యాయంగా నా వీపు నిమురుతూ అమ్మలిద్దరిని కూడా లోపల రెస్ట్ తీసుకొమ్మని చెబుతూ నిద్రపుచ్చసాగింది. ఇంతలో ఇందు అమ్మ కొన్న వస్తువులు రాగా , నిశ్శబ్దన్గా పనిమనిషులను పిలిచి వాటిని సూట్ కేస్ తో పాటు పెద్ద వ్యాన్ లో పెట్టించమని చెబుతూ , ఆమె ఇచ్చిన టికెట్స్ పక్కన పెట్టేసి నిద్రపోకుండా నన్నే చూస్తూ జోకొడుతూ ఆనందించసాగింది.

ఒంటి గంటకు అమ్మలిద్దరూ స్నానం చేసి రెడి అయ్యి రాగా అమ్మమ్మకు చెరొక వైపున కూర్చొంటూ చేతుల చుట్టూ చేతులు వేసి చెరొక భుజం పై వాలి అమ్మ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వస్తాము అని భావోద్వేగంతో మాట్లాడుతుండగా , కొద్దిసేపటి తరువాత మెలకువ రాగా ఆనందంతో వెలిగిపోతున్నా ముగ్గురు దేవతల ముఖాలు చూసి పరవశించిపోతూ సమయం చూసి 10 నిమిషాలలో రెడి అయిపోతాను అంటూ పైకి పరిగెత్తగా ముగ్గురూ సంతోషంగా నవ్వుకోసాగారు.

రెడి అయ్యి కిందకు రాగా అమ్మమ్మ టికెట్స్ అందిస్తూ డ్రైవర్ వ్యాన్ ను రెడీగా ఉంచగా అమ్మమ్మ మరియు అమ్మమ్మకు సహాయంగా ఉండే ఆవిడతో పాటు ఉద్వేగంతో మాటలు రాక నిశ్శబ్దన్గా ఎయిర్పోర్ట్ కు చేరుకోగా సూట్ కేస్ తప్ప మిగిలినవన్నీ లగేజీ చెకింగ్ కు పంపించగా , అమ్మమ్మ కళ్ళల్లో బాధ కనిపిస్తుండగా మొదటగా అమ్మమ్మకు పక్కనే ఎల్లప్పుడూ జాగ్రత్తగా చూసుకొని ఆమె దగ్గరికి వెళ్లి రెండు చేతులతో నమస్కరిస్తూ అమ్మమ్మ జాగ్రత్త అని చెబుతుండగా , అమ్మమ్మ సంతోషం పట్టలేక గట్టిగా కౌగిలించుకుంటు , ఈ అమ్మమ్మ అంటే ఎంత ప్రేమ నా బంగారు కొండ అంటూ మురిసిపోతుండగా అమ్మలిద్దరూ కూడా కౌగిలించుకొని 10 నిమిషాల పాటు ఉద్వేగపూరితమైన వాతావరణం కనిపించగా ,

ఫ్లైట్ అనౌన్స్మెంట్ జరుగగా భారంగా విడివడి అమ్మమ్మ పాదాలకు నమస్కరించగా , సంతోషంగా ఉండమని ఆశీర్వదించగా నవ్వుతూ పైకి లేచి త్వరలో మళ్ళీ వస్తాను అమ్మమ్మ అని చెబుతూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని చెబుతూ అడుగులో అడుగు వేసుకుంటూ అమ్మలిద్దరి చేతులు పట్టుకొని లోపలికి నడిచాము.ఎయిర్ హోస్టెస్ మా ముందు ఉన్న వారి టికెట్స్ చూసి దారి చూపిస్తూ లోపలికి పంపిస్తుండగా , మా టికెట్స్ చూసి స్వాగతం పలుకుతూ తనే స్వయంగా ఫ్లైట్ ఫస్ట్ ఫ్లోర్ కు పిలుచుకొని వెలుతూ ఒక తలుపు తెరుస్తూ లోపలకు అంటూ స్వాగతిస్తూ a special cabin for you sir , medam , అంటూ చెప్పి వెళ్లిపోగా ,