గోపీ 1776

నేరుగా పాయంటుకొచ్చి తన సహాయం కోరింది.సించన అప్పటికే గోపీ శక్తి గురించి తెలుసుకొన్నది కబట్టి ఖనిజ దగ్గరున్న లిస్టులోనుండి ఓ పేరుని సెలెక్ట్ చేసింది.అది కుముద్వతి.ఐరిష్ సిటిజన్ అక్కడ చీకటి వ్యాపారాల్లో …ఎదురులేని మహారాౙ్ఞి …ఇండియాకొచ్చి మనశ్శాంతిని వెదుక్కొంటోంది. ప్రతీ ఆరు నెలలొకసారి అక్కడికెళ్ళి అక్కడ పనులను చక్కబెట్టి మళ్ళీ ఇండియాకొచ్చి కాలం గడుపుతోంది. పెద్ద పెద్ద వారితో లింకులుండి కను సన్నలలో పనులు జరిపేస్తుంది.తనని ఒక్కసారి తమ వైపు తిప్పుకోగలిగితే దేశంలో ఉన్న పెద్ద చేపలంతా తమ వలలో పడుతారు.
ఖనిజ ఆమెను గోపీ ఆకర్షణ విద్య ద్వారా పిలిపించుకొంటే తన చుట్టూ ఉన్న వారికి అనుమానం వొస్తుంది.పైగా ఆమెకు సెక్యూరిటీ చాలా ఎక్కువ అందుకని వేరే దారులు వెదక సాగింది.అప్పుడు సించనే ఐడియా ఇచ్చింది. మీ పెద్దమ్మ కూడా ఐరిష్ సిటిజనే కదా …అక్కడ తనకు ఏదో పనులు జరగడం లేదని చెప్పి అపాయంట్ మెంట్ తీసుకొంటే సరిపోతుంది కదా అని సలహా ఇచ్చింది.
నిజమే మరి పెద్దమ్మ అంత సులభంగా మన మాటలు ఎలా నమ్ముతుందీ…పైగా ఆమెకు టెక్కెక్కువ అన్నాడు గోపీ
సించన తేలిగ్గా నవ్వేసి అదంతా మీ అక్క చూసుకొంటుంది గాని మీ లాభాల్లో నన్ను మరవ వద్దు.అంటూ ఖనిజ ను పక్కకి తీసుకెళ్ళి గుస గుసగా ఏదో చెప్పింది.
గోపీని వెంటబెట్టుకొని సించన వాళ్ళింటికెళ్ళింది.సించన వాళ్ళని చూడగానే మొహం చిట్లించి ఏం విశయం అన్నట్టుగా చూసింది.
నేరుగా పాయంటుకొచ్చి తన సహాయం కోరింది.సించన అప్పటికే గోపీ శక్తి గురించి తెలుసుకొన్నది కాబట్టి ఖనిజ దగ్గరున్న లిస్టులోనుండి ఓ పేరుని సెలెక్ట్ చేసింది.అది కుముద్వతి.ఐరిష్ సిటిజన్ అక్కడ చీకటి వ్యాపారాల్లో ఎదురులేని మహారాౙ్ఞి …ఇండియాకొచ్చి మనశ్శాంతిని వెదుక్కొంటోంది. ప్రతీ ఆరు నెలలొకసారి అక్కడికెళ్ళి అక్కడ పనులను చక్కబెట్టి మళ్ళీ ఇండియాకొచ్చి కాలం గడుపుతోంది. పెద్ద పెద్ద వారితో లింకులుండి కను సన్నలలో పనులు జరిపేస్తుంది.
తనని ఒక్కసారి తమ వైపు తిప్పుకోగలిగితే దేశంలో ఉన్న పెద్ద చేపలంతా తమ వలలో పడుతారు.
ఖనిజ ఆమెను గోపీ ఆకర్షణ విద్య ద్వారా పిలిపించుకొంటే తన చుట్టూ ఉన్న వారికి అనుమానం వొస్తుంది.పైగా ఆమెకు సెక్యూరిటీ చాలా ఎక్కువ అందుకని వేరే దారులు వెదక సాగింది.అప్పుడు సించనే ఐడియా ఇచ్చింది. మీ పెద్దమ్మ కూడా ఐరిష్ సిటిజనే కదా …అక్కడ తనకు ఏదో పనులు జరగడం లేదని చెప్పి అపాయంట్ మెంట్ తీసుకొంటే సరిపోతుంది కదా అని సలహా ఇచ్చింది.
నిజమే మరి పెద్దమ్మ అంత సులభంగా మన మాటలు ఎలా నమ్ముతుందీ…పైగా ఆమెకు టెక్కెక్కువ అన్నాడు గోపీ
సించన తేలిగ్గా నవ్వేసి అదంతా మీ అక్క చూసుకొంటుంది గాని మీ లాభాల్లో నన్ను మరవ వద్దు.అంటూ ఖనిజ ను పక్కకి తీసుకెళ్ళి గుస గుసగా ఏదో చెప్పింది.
సించన సలహా ఇచ్చినట్టుగా పెద్దమ్మను తన మాట వినాలంటే ఐర్లాండ్ లో తన పారా నార్మల్ సబ్జెక్ట్ కు సంబందించిన కాంఫెరన్స్ కు తనని అధ్యక్ష్యత వహించాల్సిందిగా అభ్యర్థిస్తే తప్పకుండా తన మాట వింటుంది…ఒక్క సారి కుముద్వతి తన ట్రాప్ లో పడితే ఒక్క ఐర్లాండ్ ఏం ఖర్మ మొత్తం ప్రపంచాన్నే చుట్టెయ్యవచ్చు…ఆ పనికి సించన నే పురమాయించింది.
గోపీని కుముద్వతితో ఇంటరాక్షనుకు సిద్దం కమ్మని చెప్పింది.
గోపీ ఒక్క క్షణం భయపడ్డాడు. ఇలాంటి వాటి మీద నమ్మకం ఉండి పూర్తి స్థాయిలో విశ్వసించినప్పుడే అవి పూర్తి ఫలితాలిస్తాయి.అది కూడా తాత్కాలికంగానే… ఏదో చొటా మోటా బాబాల లాగ పబ్బం జరిపి లయిఫ్ లో సెటిల్ అవుదామనుకొంటే అక్క పెద్ద తిమింగలాలకే గాలం వేస్తోంది. అదీ ఇంటర్ నేషనల్ స్థాయిలో ఉండే వారితో…ఏం జరుగుతుందో ఏమో…అనుకొని గురువు మీద భారం వేసి గమ్మునుండిపోయాడు.
ఓ పది రోజులలోగా సించన ద్వారా పెద్దమ్మని కాకా పట్టి కుముద్వతితో తనకూ సించనకూ గోపీకి పెద్దమ్మకు నలుగురికీ అపాయంటు మెంటు తీసుకొనేలా చేసింది.ఈ లోగా గోపీ కర్ణదుర్గా చేటక విధానాన్ని అధ్యనం చేసి గురువు గారి సలహా మేరకు సాధన విధిని పూర్తి చేసుకొన్నాడు.