గోపీ 1774

కుముద్వతిని కలిసే రోజు రానే వచ్చింది.పెద్దమ్మ ఆమె తన స్థాయికి తగ్గట్టుగా హుందాగా తయారయ్యి వచ్చింది.అందరూ కలిసి తన కారులోనే కుముద్వతిని కలవడానికెళ్ళారు.అక్కడ విలాసవంతమైన భవంతిలో చుట్టూ పకడ్బందీగా ఉన్న సెక్యూరిటీ మధ్య కుముద్వతి అతి ఖరీదైన సోఫాలో కూచొని ఉంది.దాదాపు ఆరు అడుగుల పొడవు కోల మొహం ఎత్తి చెక్కిపెట్టినట్లున్న అవయవ సంపదతో నిండుగా ఆరోగ్యంగా కనిపిస్తోందామె.
ఆమెతో తమ పెద్దమ్మ తన భర్త కేంద్ర ప్రభుత్వంలో ఉన్నతోద్యోగని తన రిటైర్ మెంట్ తరువాత స్థిరపడడానికి ఐర్లాండ్లో సిటిజన్ షిప్ తీస్కొన్నామని కాని అక్కడ ఆస్తుల కొనుగోలులో ఇబ్బందులు తలెత్తున్నాయని తన సహాయం కావాలని చెప్పి అభ్యర్థించింది. ఆమె సానుకూలంగా తన అంగీకారం తెలిపి వీరి వంక చూసింది. సించనను ఖనిజను రీసెర్చి స్కాలర్స్ గా పరిచయం చేసింది. చిన్నగా నవ్వుతూ తలేగరేసింది. గోపీని పరిచయం చేసింది. గోపీ అప్పటికే తన చేటక విధిని పాటిస్తూ ఉంటం వల్ల తన చెవిలో కుముద్వతి గురించిన విశయాలు తెలుసుకోగలుగుతున్నాడు. ఆ రాత్రికి ఆమె ఏర్పాటు చేసుకొన్న పార్టీలో ఆమెకు కలిగే ఇబ్బంది గూర్చి తెలియజేసింది చేటక శక్తి.గోపీ కళ్ళలోని మెరుపును వింతగా చూసి అతడిని పైనుండి కిందకు తేరిపారా చూసి కూచొమ్మని చెప్పింది.ఏం చేస్తుంటావని అడిగింది. తన పెద్దమ్మ ఏదో చెప్పేంతలో ఆస్ట్రాలజిస్టని చెప్పుకొన్నాడు.
ఆమెకు ఇటువంటిమీద నమ్మకం లేదు. అందునా ఇండియాలో గల్లీకొకరు కనిపించే స్వామీజీల మీద ఇక్కడి మూఢ భక్తులపై చిన్నచూపు మరీ ఎక్కువ. అందుకే హేళనగా ఆహా అంది..

గోపీకి కావాల్సింది అదే ..ఉక్రోషపడుతున్నట్టుగా .. కావాలంటే పరీక్ష చేసుకోవచ్చు అన్నాడు.
నేను పరీక్ష చేయడం కాదు మిస్టర్.. ఈరోజు సాయంత్రం చిన్న పార్టీ ఉంది ..వచ్చిన వాళ్ళ గురించి నాకు తెలియ జేయి ..నిజమనిపిస్తే నీవు జీవితంలో చూడనంత సంపద నీ సొంతమవుతుంది..లేదంటే నీ తల ఎగిరిపోతుంది. ఏమంటావ్.. ఆలోచించుకొని చెప్పు. లేదంటే అందరూ టీ తాగి బయలు దేరండి అంది.
నేను సిద్దం అన్నాడు గోపీ
కుముద్వతి ఏదో చెప్పబోతున్న తన పెద్దమ్మను వారిస్తూ…. మీరూ సాయంత్రం పార్టీలో ఉండి వెళ్లవచ్చని చెప్పి లోపలకి వెళ్ళిపోయింది.అలా వాళ్లకు ఆ రోజు సాయంకాలం వరకూ కుముద్వతి ఇంటిలో ఉండే అవకాశం దొరికింది.
సాయంత్రం పార్టీ ప్రారంభం కాగానే ఊళ్ళో ఉన్న పెద్ద పెద్ద తలకాయలంతా ఒకరొకరే రాసాగారు. అందులో దర్శిణి వాళ్ళ ఫామిలీ కూడా ఉంటం చూసి వీరు ఆశ్చర్య పడ్డారు.ఊళ్ళో తాము నిత్యం చూస్తున్న చాలామంది, ఇంకా చుట్టుప్రక్కల ఊళ్ళనుండి సుమారు ఓ యాభైమంది దాకా వచ్చారు. అందులో సుమారు నలభై మంది దాకా తమడబ్బును వైట్ చేసి ఇమ్మని కొంతమంది ఫారెXలో పెట్టి ఇమ్మని ఇలా రక రకాలుగా అడిగి సాయం కోసం వచ్చినవారే… అందరినీ చిరునవ్వుతో తోనె హ్యాండిల్ చేసి పంపేసింది.కుముద్వతి.
చివరకు ఓ పదిమంది ఆడామగా మిగిలిపోయారు. అందరికీ బ్రహ్మాండమైన భోజనాలు వేరేగా ఏర్పాటు చేసి ఉన్నాయి.వారితో పాటూ గోపీ వాళ్ళను కూడా లోనికి తీసుకెళ్ళింది. కుముద్వతి. వారిలో ఒక్క జంటను చూస్తూనే గోపీకి చేటక శక్తి వికటంగా ఏదో చెప్పింది.
వెంటనే గోపీ కుముద్వతిని హెచ్చరించాడు.
ఆమె తేలిగ్గా కొట్టిపారేస్తూ వారు తన దగ్గర బందువులని ఇక్కడే ఓ ఆశ్రమం నడుపుతున్నరని చెప్పి …పార్టీలో జాయిన్ కమ్మంది. అప్పటికే పార్టీ వాతావరణంవేడెక్కి ఉంది. ఆడా మగా తుళ్ళుతూ ఒకరి మీద ఒకరి పడుతూ లేస్తూ కుముద్వతి ని చూస్తూ కేరింతలు కొడుతున్నారు.