గోపీ 1775

ఒరేయ్ భడవా అవన్నీ సాదించాలంటే గురువు ద్వార తప్పితే పుస్తకాలవల్ల వాళ్ళూ చెప్పినవాటివల్ల ఉపయోగం లేదు అంది ఖనిజా
ఒకరాయి వేసి చూస్తానక్కా పోయెదేముంది నీవు మాత్రం వాటి గురించి ఏదైనా విశయం తెలిస్తే చెప్పవా ప్లీజ్ అంటూ ఖనిజ చుబుకం పట్టుకొన్నాడు.
సరే గాని నా థీసీస్ ప్రకారం వాటివాల్ల అటువంటి విద్యల వల్ల లాభమెంతో నష్టం కూడా అంతే ఉంటుంది ఒక్కోసారి విపరీత పరిణామాలు జరగొచ్చు. అందుకే నేను ఆ వివరాలు ఇవ్వట్లేదు.కాని నీకో సహాయం చేయగలను … కేరళలో నాకు తెలిసిన ప్రొఫెస్సర్ నాగరాజన్ అని ఒకాయన ఉన్నాడు.ఆయన వీటిల్లో నిష్ణాతుడు. ఆయనను మంచి చేసుకోగలిగితే ఏదైనా ప్రయోజనం ఉండవచ్చు. అని ప్రొ.నాగరాజు కాంటాక్ట్ నెంబరు అడ్రస్సు వివరాలిచ్చింది.

ఉదయాన్నే అమ్మనూ అక్కను వాళ్ళనీ వీళ్ళనీ కాకాపట్టి ఆ రోజు రాత్రికె కేరళలోని త్రిష్యూర్ కు బయలు దేరి ఉదయాన్నే ప్రొ.నాగరాజింటికెళ్ళాడు.పరిచయాలయ్యాక మధ్యవయస్సులో ఉన్న నాగరాజు సాయంత్రం దాకా రెస్ట్ తీసుకొమ్మని చెప్పి కాలేజీకెళ్ళిపోయాడు.
బడలిపోయన శరీరంతో ఉన్న గోపీ ఆయన అటెళ్ళగానే తన గదిలో నడుంవాల్చాడు. మాంచి నిదురలో ఉండగా ఎవరో పిలిచినట్లయ్యి భారంగా కళ్ళు తెరిచి ఎవరూ అన్నాడు. ఎవరూ అనైతే అన్నాడు గాని తాను పలికింది తెలుగేనా అన్న అనుమానం వచ్చింది.తనకు తెలుయకుండానే చాతీని గోక్కుంటూ లేచి కూచొన్నాడు.తలవిదుల్చుకొని చూసాడు ఎవరూ లేదు సరేలే అనునుకొంటూ వెనక్కి వాలిపోబోతుండగా ఏఅయ్ అని పిలిచినట్లయ్యింది.
ఛీ ఈ చోటులో నిదుర రావట్లేదు.ఏదో భ్రమ కలుగుతోందని తలగడ మార్చి పడుకొన్నాడు. మత్తుగా పడుకొనేసాడు.కలలో తన అక్క ఖనిజ అమ్మా మిగతా ఇద్దరు పెద్దక్కలూ ఇంకా ఎవరెవరో ఏదో నదిప్రక్కనుండి పిచ్చిగా అరుచుకొంటూ ఒకరినొకరు హింసించుకొంటూ పారిపోతున్నట్టుగా కనీంచింది.ఉలిక్కిపడి లేచాడు. ఎదురుగా నాగరాజన్ గారు కూచొని పేపరు చదువుకొంటూ ఉన్నారు.
ఏదైనా కలొచ్చిందా అని అడిగారాయన అవునన్నట్లుగా తలూపి ఆశ్చర్యంగా ఆయన వైపు చూశాడు గోపి
తరువాత సంభాషణలో చూడు గోపీ డబ్బు కోసమైతే నీవు ఇంతదాకా రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఆచారంలో వైదికాచారానికి వ్యతిరేకంగా కొన్ని నియమాలుంటాయి.వాటిని పవిత్రమైన మనస్సుతో ఆచరించగలిగితేనే అవి సత్ఫలితాలొస్తాయి లేదంటే నీతో పాటు నీవు నీ కుటుంబం మొత్తం ఇబ్బందుల పాలవుతారు. ఆలోచించుకో అని చెప్పి లేచి వెళ్ళిపోబోయారాయన.
గోపీ అడ్డుకొంటూ గురువు గారూ నేను అన్న్నింటికీ సిద్దపడే వచ్చాను.నన్ను కనికరించండి.అంటూ ప్రాదేయపడ్డాడు.సరే ఐతే ప్రస్తుతానికి చిన్న చిన్న తంత్ర విద్యల్ని నేర్పుతా నీ యోగ్యతను బట్టి మళ్ళీ వేరే విద్యలను నేర్పుతా అని నియమానుసారంగా ఓ పక్షం రోజుల్లో గోపీకి కొన్ని వశీకరణ ఆవాహన అంజనాది విద్యలను నేర్పాడు.అవి నేర్చుకొన్న గోఫీ వినమ్రంగా ఆయనకు నమస్కరించి ఊరికొచ్చేసాడు.
వింత తేజస్సుతో మొహం వెలిగి పోతుండగా ఇంటికొచ్చిన గోపీని భీంసేన్ రావు శారద ఖనిజ ముగ్గురూ ఆశ్చర్యంగా చూసారు. అతడి నడవడిలో నిండుతనం కొట్టొచ్చినట్లుగా ఉంది.భోజనాల్లో కూడా అతడి తీరు చాలా మార్పు కొట్టిచ్చినట్లుగా తెలుస్తోంది.