గోపీ 1775

ఊహూ ఎటువంటి ఇబ్బందులూ రాకుండా నేను చూసుకొంటానక్కా ..అసలు వారు మనకిచ్చినట్లుగా గుర్తు కూడా ఉండదు. ఉదయం చూసావుగా దర్శిణి కి తన వీడియో చూపించేతవరకూ తనకే తెలీలేదు.
నిజమేరా అంటూ తల పంకించి తన బ్యాచ్ లో డబ్బు మదంతొ కొట్టుకొంటున్న వారిని గుర్తు చేసుకొంది.
ఎటునుండి ఆలోచించినా దర్శిణీనే పాయంటులోనొకొస్తోంది. తనకున్న డబ్బు మదంతోనే అది ఎవరినీ లెఖ్ఖ చేయదు. దాని దెబ్బకు తాము మాత్రమే కాదు అబ్బాయిలు ప్రొఫెసర్లు ఇలా అందరూ బలయిన వారే దాని కున్న అధికారం డబ్బు అవీ చూసే ఎవరూ నోరు విప్పరు. దానితో స్నేహం నటిస్తారు అంతే… అలా దర్శిణి ఐతే కరెక్ట్ అనుకొని
అదే విశయాన్ని చెప్పింది.
రోగి కోరుకొన్నది వైద్యుడు ఇచ్చింది ఒకటే నన్నట్లుగా గోపీ రొట్టె నేతిలో పడినట్లయ్యింది.
ఐతే అక్కా ఊరికే ఆకర్శణ చేయడం వేరు డబ్బు తెప్పించుకోవడం వేరు ఎందుకంటే వారు తమకు తాముగా మనకి ఇచ్చినట్లుగా ఉండాలే కాని దోచుకొన్నట్లుగా ఉండకూడదు కదా..అందుకే ఆ సమయంలో వారు ఏమి అడుగుతారో అది మనం నెరవేర్చాల్సి ఉంటుంది. అందుకే నీ సహకారం కావాలన్నది అంటూ ఆగాడు.

ఎటువంటి కోరికలు కోరవచ్చురా
పెద్దగా ఏమీ ఉండవక్కా ..ఆ సమయంలో వారి మీద ఆ శక్తులు పని చేస్తూ ఉంటం వల్ల ఏదైనా తినడానికి అడగవచ్చు అంతే..ఐనా నాకూ మొదటి సారే కదక్కా చూద్దాం
ఇంటి పరిస్థితి తనకు తెలుసు నాన్న తెచ్చే బొట బొటీ సంపాదనతో అమ్మ ఎలా సంసారాన్ని లాక్కొస్త్తున్నదీ ఇతరుల దృష్టిలో తాను చులకన కాకుండా ఎంత ఇబ్బంది పడుతున్నదీ ఖనిజకు బాగా తెలుసు అందుకే ఓ రాయి వేసి చూద్దమనుకొని సరే లేరా ఎప్పుడు మొదలెడతావు అంది.
ఈ అర్దరాత్రే మొదలు పెడతానక్కా ఎందుకంటే ఉదయం పూజకు తెచ్చిన సామానులు అలానే ఉన్నాయి అదీ గాక దర్శిణి మీద మంత్ర ప్రభావం పూర్తిగా తొలగిపోయి ఉండదు.
సరే ప్రయత్నించు అంది
గోపీ మంత్ర పఠాలాన్ని రచించి దర్శిణి ఆవాహన చేయసాగాడు. అర్దరాత్రి పైగా వీరిగది ఇంటి పైన ఉంటం వల్ల పెద్దగా సద్దు చేయకౌండా సాధన చేయడం వల్ల క్రిందవరికి అనుమానమొచ్చే అవకాశం తక్కువ ..
అక్కడ దర్శిని తన విలాసవంతమైన గదిలో పడుకొని ఉదయం గోపీ దగ్గర షూట్ చేసిన వీడియోని చూస్తూ ఉంది .అందులో తన ప్రవర్తన తనకే నమ్మకం కలగడంలేదు . ఎందుకు తాను పదే పదే తల విదిలిస్తూ ఉలిక్కిపడినట్లు కదిలుతూ ఉందో అర్థం కాలేదు. దానికన్నా తాను తన వొంటిమీదున్న బట్టలు అలా తీసి విసిరివేసి గోపీ వెనుక కూచొని హత్తుకుపోవడం ఏమిటో అస్సలు అర్థం కావట్లేదు. ఇందులో అనుమానించడానికి ఏమీ లేదు. తానే ముందుగా చాలెంజి చేసింది. ఛీ అలా చాలెంజి చేయకుండా ఉండాల్సింది కాదు.వాడు సామాన్యుడు కాదు.వాడిలో ఏదో శక్తి ఉంది ..ఇలా అలోచిస్తూ ఉన్న దర్శిణి కి ఎవరో పిలిచినట్లయ్యింది.ఉలిక్కిపడి లేచి చుట్టూ చూసింది.
చురుకైంది కనుక వెంటనే ఖనిజకు ఫోను చేసి ఉదయం జరిగినట్లుగానే ఎవరో పిలుస్తున్నట్టనిపించిందని చెప్పింది.ఖనిజ గోపీ దగ్గే ఉంది కాబట్టి అతడి సలహాతో తామే అక్కడికొస్తామని చెప్పింది. అప్పటికే బెదరిపోయి ఉన్న దర్శిణి ఇంటిలో తాను ఒక్కత్తే ఉంది కాబట్టి వెంటనే ఇద్దరినీ రమ్మంది.