గోపీ 1765

గోపీ మీద తానుంచిన నమ్మకం వొమ్ముకాలేదు.కళ్ళెంబడి నీళ్ళు సుడులు తిరుగుతుండగా వాడిని దగ్గరికి తీసుకొని నుదురును ముద్దాడింది.గోపీ ఆమెను ఉద్వేగాన్ని చూసి తానకూ కళ్ళు చెమ్మగిల్లాయి. కళ్ళు తుడుచుకొంటూ అక్కా మిగతా నాలుగు లక్షలూ నీవే ఉంచుకో నీకు కావాల్సింది కొనుక్కో ఇంతకాలం నీవు ఎంత ఇబ్బంది పడ్డావో నాకు తెలుసు.ఇదే అంతం కాదక్కా ఆరంభం మాత్రమే ఇంకా డబ్బు వొస్తుంది . అంటూ ఆమెను వొదలి చేతికందిన ఓ నాలుగు చిల్ల డబ్బులను తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు.
సాయంత్రం ఇంటికొచ్చేటప్పటికి ఇంటిలో పరిస్థితి మొత్తం మారిపోయి ఉంది. శారద మొహం మొహం కళ కళ లాడుతూ ఉంది. ఇంటిలో పిండివంటలు ఘుమ ఘుమలాడుతూ ఉన్నాయి. భీంసేన్ రావు తీరిగా కూచొని ఉన్నాడు.
గోపీ రాంగానే వాడిని ఎగాదిగా చూసి …. దాన్ని ఐనా చూసి బుద్దితెచ్చుకో వెధవాయ్ ..అది చేస్తున్న రీసెర్చ్లో దాని ప్రతిభకు మెచ్చి ఆరు లక్షలు నగదు బహుమానం స్కాలర్ షిప్ కింద ఇచ్చారంట …ఒఖ్ఖ పైసా కూడా వాడుకోకుండా మొత్తం ఇంటికే ఇచ్చింది. అదే నీవైతే మొత్తం స్వాహా చేసి ఇంకా అప్పులు మా తల మీద వేసేవాడివి. ఫో… పోయి దాని కాళ్ళ క్రింద దూరు కాస్త బుద్దైనా వస్తుంది అంటూ యథాప్రకారం తిట్లదండకాన్ని అందుకొన్నాడు. పైగదిలో ఉన్న ఖనిజ ఒక్క ఉదుటున కిందకొచ్చి… నాన్నకు సర్ది చెప్పి గోపీని పైకి తీసుకెళ్ళింది.
అది తమిద్దరికీ మామూలేకనుక పైన గదిలో ఇద్దరూ పడీ పడీ నవ్వుకొన్నారు. ఖనిజ తన వాటాలో ఉన్న దాంట్లో కొంత తనకోసం ఉంచుకొని ఓ స్కూటరును కొనుక్కొంది.
కారే బుక్ చేయకపోయావా అక్కా …
ఇప్పుడే వొద్దురోయ్ అందరికీ అనుమాన వొస్తుంది. ఒకటొకటిగా మొదలు పెట్టాలి.అది సరే కాని నీతో మాటాడాలి తొందరగా భో ం చేయ్. అమ్మా నాన్నలు పడుకొన్నాక మాటాడుకొందాం అంటూ తొందర చేసింది.
ఆ ఆ సరే అంటూ స్నానాలు కానిచ్చి భోజనాలు కానిచ్చి తన గదిలోనికెళ్ళాడు.
గోపీ అలా కూచొన్నాడో లేదో ఖనిజ పరుగు పరుగున వచ్చింది.
ఏంటే ఏం అయ్యింది అలా గాభరా పడుతున్నావ్…
ఏమీ లేదు అంత డబ్బు ఒక్కసారిగా చేతికొచ్చేతప్పటికి ఏం చేయాలో తోచలేదు.అసలా ఆ ఐడియా నీకెలా వచ్చిందిరా …అంతే కాకుండా కేవలం ఈ పదిహేను రోజులలో నీవు ఇంత సాధిస్తావని అనుకోలేదు. ఎలారా …ఇదంతా అని అడిగింది.
గోపీ నవ్వేస్తూ దేని గురించక్కా నీవు అడిగేది? దర్శిణి ని లొంగ దీసుకోవడమా లేక తాను ఇచ్చిన డబ్బు గురించా ?
ఛీ …పోకిరోడా…. అంటూ సిగ్గుపడి దర్శిణి లొంగ దీసుకోవడమే కాదు ఆమె మీద మంత్ర ప్రయోగం చేసేంత సాధన ఎలా వచ్చిందా అని?