గోపీ 1775

తేలుకుట్టిన దొంగలా తనవెనకున్న గోపీని లోపలకు తీసుకెళ్ళి తన గదిలో కూచొబెట్టి ఏరా తమ్ముడూ అమ్మా నాన్నలతో ఇలా ఎంతకాలమని తిట్లు తింటావు.రేప్రొద్దున నాకూ పెళ్లైయి వెళ్ళిపోతే నీకు దిక్కెవరు చెప్పూ అంటూ లాలనగా అడిగింది ఖనిజ.
ఏం మాట్లాడకుండా నేల చూపులు చూస్తున్న గోపీని ఇంకేం మాట్లాడలేక పోయింది ఖనిజ .
రాత్రికి బెడ్ మీద పడుకొని సీలింగ్ వైపు చూస్తూ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు గోపీనాథ్. నాన్నాగారిలా సాంప్రదాయంగా సింపల్ గా బ్రతికేయడం తనకిష్టం లేదు.చచ్చీ చెడీ ఆయన ఇదరక్కల పెళ్ళిళ్ళు చేసాడు. ఇక ఖనిజకు పెళ్ళి చేసి పంపేస్తే ఈయనతో ఎలా వేగాలో? తనకా చదువు మీద ఇష్టం లేదు ఆయన బలవంతం మీద డిగ్రీ దాకా వచ్చాడు గాని తన దృష్టంతా ఏమైనా చేసి గొప్పగా బ్రకాలనే ఐతే ఏం చేయాలో మాత్రం తెలియడం లేదు.ప్చ్ అనుకొంటూ కళ్ళుమూసుకొన్నాడు.
ఇంతలో ఖనిజ వచ్చింది రేయ్ తమ్ముడూ పడుకొన్నావా అంటూ …
ఆ ఇప్పుడే కళ్ళు మూసుకొన్నా ఏంటీ
నాకు తెలిసిన వారిదగ్గర ఏదో పోస్టు ఖాళీ ఉందంట ఉదయాన్నే వెళ్ళి ప్రయత్నించరాదూ… నాన్నగారి గోల తప్పుతుంది నీకూ కాస్త ఊరటగా ఉంటుందీ..అంది
ఒద్దక్కా… ఇలా చిన్న చిన్న పనులు చేసుకొని నాన్నగారిలా ఇలా చిన్న జీవితానికే పరిమితవ్వడం నాకు ఇష్టం లేదు.
మరి ఏం చేయాలనుకొన్నావ్ రా ఏదైనా మాయలూ మంత్రాలూ నేర్చుకొని సంపాదిస్తావా … ముందు దీనిలో చేరు తరువాత మిగతావన్నీ అలోచించ వచ్చు.అంది
చూద్దాం అక్కా అంటూ ముసుగు పెట్టేసాడు.
ఒరేయ్ నువ్వుగాని ఉదయాన్నే అక్కడికెళ్ళక పోయావో నా మీద ఒట్టే అంటూ లేచి తనగదిలోనికెళ్ళిపోయింది.

ఖనిజ వెళ్ళిపోగానే ఆమె అన్న మాటలు మళ్ళీ ఒకసారి గుర్తుకు తెచ్చుకొన్నాడు.మాయలు మంత్రాలు చేసి సంపాదిస్తావా అన్న దగ్గర నిలిచిపోయింది తన ఆలోచనంతా ..ఈ దారిలో ఎందుకు ప్రయత్నించరాదు.ఎంతోమంది దొంగ స్వాములు బాబాలు చేస్తున్నది అదేగా అనుకొన్నదే తడవుగా లేచి ఖనిజ దగ్గరెళ్ళాడు.ఖనిజ పారా నార్మల్ సైన్సెస్ లో రేసెర్చ్ స్కాలర్ గనుక తన దగ్గర కచ్చితంగా ఏదైనా విశయం దొరకొచ్చనే ఊహతో
గోడకు కొట్టిన బంతిలా తనవెనుకే వచ్చిన గోపీని చూసి ఏంట్రా వచ్చావు అంది.
అక్కా నాకు చిన్న ఇన్ ఫార్మేషను కావాలే అంటూ దగ్గరగా కూచొన్నాడు.
ఊ చెప్పూ అంది ఖనిజ
ఈ మాయలూ మంత్రాలు తంత్రాలవల్ల నిజంగా డబ్బు సంపాదించవచ్చా ?
ఖనిజ ఫక్కున నవ్వేసి హారి పిడుగా… ఈ కాలంలో అటువంటివి ఎవరు పట్టించుకొంటార్రా…ఐనా ఏదైనా పనిచేసుకొని డబ్బు సంపాదిస్తే బాగుంటుంది గాని ఇలా తేరగా డబ్బు సంపాదించలంటే ఎలా రా?
అక్కా ఆ సంగతి నాకు తెలుసు గాని నీకేమైనా విశయం తెలిస్తే చెప్పు లేదా తెలీదను అంతే గాని నాన్నగారిలా క్లాసు పీకొద్దు అన్నాడు నిష్టూరంగా