పెళ్లి తరువాత..పెళ్లి ముందు..2 106

నేను : (సీరియస్ గా) ఆరోజు నువ్వు ఇంటెన్షణ్ గా వెళ్ళి మా అమ్మ నడుము గిల్లావ్. కానీ నేను ఇక్కడ వాడు నా నడుము మీద చెయ్యి వేసినా, నాకెలాంటి ఫీలింగ్స్ లేవు అదే పెద్ద తేడా, అర్దం అయ్యిందా.
వినయ్ : అవునవును ఏ ఫీలింగ్స్ లేవు, అయినా ఒక పన్నెండేళ్ళ కుర్రాడు యాభై ఏళ్ల ముసలి దాని నడుము గిల్లితే వాడికి ఆమె మీద ఫీలింగ్స్ ఉన్నాయ్ అని అనుకునే నీలాంటి దాని దగ్గర మాట్లాడాలి ఫీలింగ్స్ గురించి..
నేను : మా అమ్మ ఏం ముసల్ది కాదు
వినయ్ : టాపిక్ డైరెక్ట్ చేయకు
నేను : సరే ఇప్పుడేంటి అప్పుడు మా అమ్మను నువ్వు ఏ ఫీలింగ్స్ లేకుండా గిళ్ళావ్ ఇప్పుడు వాడు నా నడుము మీద చెయ్యి పెట్టినా నాకు ఏ ఫీలింగ్స్ లేవు ఇద్దరం బ్యాలన్స్ అయ్యం గా ఇంకేంటి ?
వినయ్ : ఏం లేదు, ఇక నువ్వు వెళ్తే నేను పడుకుంటా.
వాడు అలా అని బెడ్ మీదకు వెళ్ళి మళ్ళీ కార్టూన్స్ చూసుకుంటూ కూర్చున్నాడు. నేను అది చూసి జీవితాంతం అవే చూసుకుంటూ గడుపు అంటూ కోపంగా బయటకు వచ్చా. అక్కడ వినయ్ అమ్మ నన్ను చూసి కాసేపు మాటలు కలిపింది. నేను కూడా తనతో మాట్లాడుతూ కాసేపు టైం పాస్ చేశా. డిన్నర్ టైం అవ్వడం తో ఇక్కడే తిను అని అంది వినయ్ అమ్మ. నేను సరే అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నా. వినయ్ అమ్మ వినయ్ గాడిని పిలిచింది. వాడు ముఖం సీరియస్ గా పెట్టుకుని వచ్చాడు. నాకు ఎదురుగా కూర్చుని ప్లేట్ లో అన్నం పెట్టుకున్నాడు. నేను వాడ్ని మధ్య మధ్యలో గమనిస్తూ ఉన్నా. నేను అలా వాడ్ని చూస్తూ తింటూ ఉండగా అప్పుడే వినయ్ వాళ్ళ నాన్న ఇంకా మా నాన్న ఇద్దరూ ఇంట్లోకి వచ్చారు. మా నాన్న నేను ఇక్కడే ఉండడం చూసి ఇక్కడున్నవా అంటూ నా దగ్గరికి వచ్చి నీకో గుడ్ న్యూస్ అని అన్నాడు. నేను ఎంటి నాన్న అది అన్నా. మా నాన్న సంతోషంగా ఇవ్వాళ నువ్వు డాన్స్ చేసింది మన శ్రీకర్ అంకుల్ ఉన్నాడు గా అతని ఫ్రెండ్ కొరియో గ్రాఫర్ అంట అతను నీ డాన్స్ వీడియో ని చూసి నీ లుక్స్ డాన్స్ రెండూ బాగున్నాయ్ అని అన్నాడట. నీకిస్టం అయితే నీకు ట్రైనింగ్ కూడా ఇస్తా అన్నాడంట. ఇందాకే ఫోన్ లో చెప్పాడు అంటూ నన్ను చూసి చెప్పాడు. అది విన్న వినయ్ వాళ్ళ అమ్మ బంగారు తల్లి దీని డాన్స్ చూసి నేను అప్పుడే అనుకున్నా ఇలాంటి ఆఫర్ ఎదో ఒకటి వస్తుంది అని అంటూ నా తలను నిమిరింది.

6 Comments

  1. Dinni sex storie antara close ceyandi

    1. Velli vaani madda kudu
      “>

  2. Vijayraj Nuthalapati

    Nice story super

  3. Super story bro waiting for part 3 pls post quickly

  4. Bro sex content lekuda enduku bro
    Kudirithe add chey lekapotge close chey

Comments are closed.