మా అమ్మ హా బాగున్నా రూప అంటూ రూప ను చూస్తూ వాడింకా రెడీ అవుతున్నాడంట అంది. దానికి రూప నవ్వి పర్లేదు ఆంటీ, నేను వెయిట్ చేస్థాలే మీరు వెళ్ళండి అంది. మా అమ్మ సరే నీ ఇష్టం అంటూ రూప దగ్గరికి వస్తూ ఇంకా మీ మధ్య గొడవలు చల్లారలేదా ? అంది. దానికి రూప నవ్వుతూ ఎక్కడ ఆంటీ వాడేమో పిల్లోడు అయిపోయాడు, మెచ్యూరిటీ లేదు, ఎక్కడ చెప్పండి ? ఏది చెప్పినా టైం తీసుకుంటాడు అర్దం చేసుకోవడానికి అంటూ అయినా ఇది మాకు మామూలే గా ఆంటీ అంది. అలా అనగానే మా అమ్మ నవ్వుతూ రూప తల మీద నిమిరి నువ్వేనే వాడిని సరిగ్గా అర్దం చేసుకునేది అంది. రూప నవ్వి సరిగ్గా చెప్పారు ఆంటీ కానీ ఏం చేస్తాం కొందరికి అది అర్దం కాదు అంటూ నా రూం వంక చూసింది. మా అమ్మ నవ్వుతూ సరే కింద వుంటా అంటూ వెళ్ళిపోతూ అవునూ, తిన్నావా ? అంది. రూప లేదాంటి కొంచెం అర్జెంట్ పని ఉంది ఇద్దరం తరువాత కలిసి తింటాం లే బయట అంది. దాంతో మా అమ్మ వాడు తినలేదు అని నీకు ఎలా తెలుసు అంది. రూప నవ్వుతూ ఆంటీ వాడు నా ఫ్రెండు, నాకు తెలీదా వాడు ఎప్పుడు తింటాడో ఎప్పుడు పడుకుంటాడో అని అంది. మా అమ్మ సరే లే అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోగానే అక్కడే రూం ఇవతల వైపు డోర్ దగ్గరే నిల్చుని వాళ్ళ మాటలు వింటున్న నేను ఇది ఇప్పుడు ఏం చేస్తుందో అని అనుకున్నా. అలా అనుకుంటూ వుండగానే రూప తలుపు దగ్గరికి వచ్చి చిన్నగా డోర్ మీద కొడుతూ మెల్లగా నాకు మాత్రమే వినపడేలా విన్నూ, నీ బంగారాన్ని, నీ పెళ్లాన్ని వచ్చారా తలుపు తీయి అంది. అంతే తనలా అనేసరికి నాకు ఒక్కసారిగా కోపం వచ్చి వెంటనే వెళ్ళి తలుపు తీసా తనని తిడదాం అని. తను నవ్వుతూ కనిపించింది. నేను కోపంగా తనని లోపలికి లాగుతూ వాళ్ళకి వినిపిస్తే పరిస్థితి ఎంటో ఆలోచించావా ? అన్నా. తను నా బెడ్ మీదకు వెళ్ళి కూర్చుంటూ కంగారు పడకు విన్నూ, అలా చెప్తే కానీ వెంటనే తలుపు తీయవ్ అని అలా చెప్పా అంతే అంది. నేను కోపంగా తనని చూసి నీతో కొంచెం మాట్లాడాలి అన్నా. తను అవునా అంటూ నా వంక చూసి వెంటనే టైం వంక చూసింది. అలా చూస్తూ మళ్ళీ తిరిగి నాతో లేదురా బంగారూ టైం అయ్యింది త్వరగా వెళ్ళాలి మనం, అంటూ నన్ను చూసి సాయంత్రం ఎంచక్కా మాట్లాడుకుందాం సరేనా అంది. నేను వెంటనే తను నా మాట వినదు లే అని అనుకుని ఫాస్ట్ గా రెడీ అయిపోయా. సారి రెడీ అయినట్లు నటించా..
Dinni sex storie antara close ceyandi
Velli vaani madda kudu
“>
Nice story super
Super story bro waiting for part 3 pls post quickly
Good story keep going
Bro sex content lekuda enduku bro
Kudirithe add chey lekapotge close chey