పెళ్లి తరువాత..పెళ్లి ముందు.. 149

టైం పొద్దున మూడు అవుతుంది. గది అంతా నిశబ్దంగా ఉంది. కిటికీ లో నుండి గాలి చల్లగా వీస్తూ ఉంది. నా భార్య రూప నా తొడల మీద తల పెట్టి హాయిగా నిద్రపోతోంది. తనలా నిద్రపోతూ ఉంటే నేను అలాగే మేలుకుని తననే చూస్తూ ఉన్నా. ఎందుకో తెలీదు తనని ఎంత సేపు చూసినా అలాగే తనని చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది. తన రూపం తన మాటలు తన నడవడిక నాకు ఎప్పుడూ కొత్తగానే అనిపిస్తాయి.
తను నా తొడలపై పడుకుని ఇప్పటికి ఆరు గంటలు అయినా కూడా నేను తనని కదపకుండా అలాగే పడుకోబెట్టుకొని తననే చూస్తూ ఉన్నానంటే అర్దం చేసుకోండి నాకు తన్ని చూస్తూ ఉండడం అంటే ఎంత ఇష్టమో. పెళ్ళై ఇన్నాల్లైనా, తనని రోజూ చూస్తూ ఉన్నా, నాకు ఇంకా ఎందుకో తనని ఇలాగే ఇలాగే చూస్తూ ఉండిపోవాలి అని అనిపిస్తుంది. తనంటే నాకు అంత ఇష్టం. ఒకవేళ ఇష్టపడక పోయినా తను ఇష్ట పడేలా ఆకర్షిస్తుంది. నన్నే కాదు తన చుట్టూ ఎవరు ఉన్నా కూడా వాళ్ళని ఇట్టే ఆకర్షిస్తుంది. అదే తనలో నాకు బాగా నచ్చిన విశయం.
నిజానికి తను నా ఫ్రెండ్ చెల్లి. నా ఫ్రెండ్ కు ప్రేమ వివాహాలు అంటే అస్సలు నచ్చదు. కానీ నేను వాడి చెల్లి నే లవ్ మ్యారేజ్ చేసుకున్నా. నిజానికి నేను చేసుకున్నా అని అనడం కంటే తనే నన్ను చేసుకుంది అనడం కరెక్ట్ ఏమో. ఏంటి నేను ఇలా అంటున్నా అని అనుకుంటున్నారా ? పదండి నా గతం లోకి వెళ్దాం మీకే తెలుస్తుంది నేను ఎందుకు అలా అన్నానో అని..
నా పేరు వినయ్. మాది కొంచెం రిచ్ ఫ్యామిలీ అనే చెప్పాలి. నిజానికి చాలా రిచ్ ఫ్యామిలీనే కానీ మా నాన్నకు నమ్మకమైన బిజినెస్ పార్ట్ నర్స్ లేక చాలా ఆస్తినే కోల్పోయాడు. ఇప్పుడు కేవలం ఒక చిన్న పాటి కంపెనీని నడిపిస్తూ నన్ను కూడా అదే కంపెనీ లో వర్క్ చేయమని ప్రోస్తహిస్తు ఉన్నాడు. కానీ నాకేమో ఆ కంపెనీ లో వర్క్ చేయడం అంతగా ఇష్టం లేదు. అందుకే సొంతంగా నేనే పని నేర్చుకుని కొత్తగా ఏదైనా కంపెనీ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నా. మా నాన్నకు ఒక ప్రాణ మిత్రుడు ఉన్నాడు. అతనే దేవేంద్ర.

6 Comments

  1. Vijayraj Nuthalapati

    Lady don

  2. అసలు ఏమి రాయాలని అనుకున్నారో అర్థం కాలేదు. Continuation కూడా లేదు ఈ కథకు. అప్డేట్ చెయ్యండి

  3. Emi rasthunnavu sex anede ledu vest..

    1. Hi na mail msg me

Comments are closed.