పెళ్లి తరువాత..పెళ్లి ముందు.. 149

నేను తనకు చాలా క్లోజే కానీ నాకు తన మీద అలాంటి ఫీలింగ్సే లేవు. ఎందుకు అంటే తను నన్నెప్పుడూ ఒక అమ్మలా కేర్ చేసేది. ఏదైనా తప్పు చేస్తే చాలు కోపంగా తిడుతుంది. కొన్ని సార్లు అయితే కొడుతుంది కూడా. తను అలా ఉండడమే నాకు బాగా నచ్చేది. పైగా తను నాకంటే పెద్ద, అదో కారణం కూడా ఉంది. బహుశా తను పెద్ద అవ్వడం వల్లనే నేమో మేము చిన్నప్పటి నుండి ఎంత క్లోజ్ గా ఉన్నా ఎవ్వరూ కూడా (ఇంట్లో వాళ్ళు) మమ్మల్ని లవర్స్ లా చూడలేదు. తను కూడా ఎప్పుడూ అలా ప్రవర్తించేది కాదు. చనువుగా ఏం చేసినా నాలుగు గోడల మధ్యే ఉండేది. తను అలా పెద్దరికం తో నన్ను పిల్లాడిలా కేర్ చేయడం వల్ల నేమో తన మీద నాకు సెక్సువల్ ఫీలింగ్స్ కానీ పెళ్లి చేసుకోవాలి అనే ఫీలింగ్ కానీ రాలేదు, తను ఐ లవ్ యూ చెప్పినప్పుడు కూడా ఇదే చెప్పాను తనకు. నాకు నిజంగా నీ మీద అలాంటి ఫీలింగ్స్ లేవు, నువ్వు నాకు ఒక అక్క లాగా అని చెప్పా. అంతే అలా అన్నందుకు నా చెంప మీద ఒకటిచ్చి ఇంకోసారి అక్కా గిక్కా అన్నవంటే పళ్ళు రాలగొడతాను అని కోపంగా వెళ్ళిపోయింది. అప్పటి నుండి నేను కనిపిస్తే చాలు కోపంగా చూడడం, నేను ఏం చేయాలన్నా దానికి కావాలనే అడ్డు పడిపోవడం లాంటివి చేస్తూ వచ్చింది. నేను కూడా దేవేంద్ర అంకుల్ రమణ అంకుల్ కు ఇచ్చిన మాటను, వాళ్ళ అన్నయ్యను, ఇంకా ముఖ్యంగా నా ఫీలింగ్స్ ను దృష్ఠిలో పెట్టుకుని తనతో ఈ విశయం లో కాంప్రమైజ్ కాకుండా ఉండడం మంచిదని తనతో మాట్లాడకుండా ఉండడం మొదలు పెట్టాను. అందుకే తను ఇందాక వోదిలేసాననుకోకు అని మెసేజ్ పెట్టింది. నాకు తెలుసు తను పట్టు పట్టింది అంటే అస్సలు వొదిలే రకం కాదు అని. కానీ ఎలా ప్రొసీడ్ అవుతుంది అనేదే డౌటు అంతే..

రూప రాగానే అందరూ కంగ్రాటులేషన్స్ చెప్పారు. తరువాత పార్టీ నెమ్మదిగా మొదలైంది. అందరూ చేతిలో డ్రింక్ పట్టుకుని తాగుతూ ఉన్నారు. మధ్య మధ్యలో రూప నా వంక చూస్తూ ఉంది. నేను కూడా తనని గమనిస్తూ ఉన్నా. తను నేను గమనించడం చూసి నెమ్మదిగా మా నాన్న దగ్గరికి వెళ్ళింది. అక్కడ మా నాన్న ఇంకా దేవేంద్ర కలిసి తాగుతూ ఉన్నారు. రూప అక్కడికి వెళ్లే సరికి దేవేంద్ర అంకుల్ ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రూప ఇంకా మా నాన్న ఇద్దరే ఉన్నారు వాళ్ళు ఏమీ మాట్లాడుకోవడం లేదు కానీ నాకు మాత్రం రూప మా నాన్నతో ఏం మాట్లాడబోతుందో అని ఆత్రుతగా ఉంది, కాబట్టి వెంటనే వాళ్లిద్దరూ నిలబడి ఉన్న గోడ దగ్గరికి అటు వైపు నుండి వెళ్ళా. వాళ్ళకి ఇప్పుడు నేను కనిపించను కానీ వాళ్ళ మాటలు నాకు బాగా వినిపిస్తాయి. అలా నేను నిలబడి ఉండగా కాసేపు ఇద్దరూ సైలెంట్ గా ఉండడం కనిపించింది. అక్కడ మ్యూజిక్ ప్లే చేస్తుంటే ఇద్దరూ వింటున్నారు. కాసేపటికి ఒకరిని ఒకరు చూసుకుని చిన్నగా నవ్వుకున్నారు.
మా నాన్నతో రూప సంభాషణ…

6 Comments

  1. Vijayraj Nuthalapati

    Lady don

  2. అసలు ఏమి రాయాలని అనుకున్నారో అర్థం కాలేదు. Continuation కూడా లేదు ఈ కథకు. అప్డేట్ చెయ్యండి

  3. Emi rasthunnavu sex anede ledu vest..

    1. Hi na mail msg me

Comments are closed.