పెళ్లి తరువాత..పెళ్లి ముందు.. 149

అది విన్న రూప నా వంక చూసింది. నేను అమ్మతో అదేం లేదమ్మ అని చెప్తూ ఉండగా రూప వాళ్ళ అమ్మ వస్తూ ఏం లేదంటావ్ ఎంటి ? అది చూడు ఎలా చూస్తుందో అంటూ రూపను చూస్తూ అంది. (అంతవరకు నన్నే సూటిగా చూస్తున్న రూప వెంటనే తల దించుకుని తినడం మొదలెట్టింది) దాన్ని చూస్తుంటే అర్దం అవ్వట్లేదా, వీళ్ళు మళ్ళీ గొడవ పడ్డారు అని అంటూ అమ్మ వంక చూసి ఒకవేళ మామూలుగా ఉంటే ఇలా ఉంటారా ? చెవులు చిల్లులు పడేలా మాట్లాడుకుంటూనే ఉంటారు అంతే కదా అంది. మా అమ్మ నవ్వుతూ సరిగ్గా చెప్పావే అంది. నేను రూప ను ఒకసారి చూసి అక్కడ నుండి బయటకు వచ్చేశా. నిజానికి నేను రూప చాలా క్లోజ్, అది మా ఇంట్లో వాళ్ళింట్లో అందరికీ తెలుసు, ఒకవేళ తను నా ఏజ్ కంటే మూడేళ్లు పెద్దది కాక పోయి ఉంటే కచ్చితంగా మా ఇద్దరిని లవర్స్ అని అనేవాళ్ళు అలా ఉంటాం మేమిద్దరం క్లోజ్ గా. కానీ ఏజ్ గాప్ వళ్ళ మా ఇంట్లో కానీ తన ఇంట్లో కానీ ఎప్పుడూ మేము లవర్స్ లాగా ఉన్నాం అన్న టాపిక్ రాలేదు. పైగా వాళ్ళు మమ్మల్ని ఒక అక్కా తమ్ముడు లా చూస్తారు. కానీ వాళ్లకేం తెలుసు తననే నేను పెళ్లి చేసుకుంటాను ఫ్యూచర్ లో అని.
సాయంత్రం కావడం తో చిన్నగా పార్టీ స్టార్ట్ అయ్యింది. ఇంటి పక్కనే ఉన్న గార్డెన్ లో పార్టీ పెట్టుకున్నాం. నేను అక్కడ ఏమేమి ఉండాలో దగ్గరుండి అన్నీ సెట్ చేయిస్తున్నా. నేను అలా పనిలో ఉండగా అంతలో ఎదో మెసేజ్ వచ్చింది. తీసి చూస్తే రూప నుండి వచ్చింది అది. నేను వెంటనే తలెత్తి బాల్కనీ వైపు చూసా. (తను ఎక్కువగా అక్కడే నిలబడి ఉంటుంది) తను అక్కడే నిలబడి ఉంది, చేతులు కట్టుకుని నన్నే సీరియస్ గా చూస్తూ ఉంది. తన చేతిలో సెల్ కూడా ఉంది. నేను వెంటనే తనని అలాగే చూస్తూ మెసేజ్ ఓపెన్ చేశా. తల దించి ఏం పంపించిందో చూసా. అక్కడ వదిలేసాననుకోకు అని ఉంది. అది చూసి వెంటనే తలెత్తి తన వంక చూసా. తను ఒక చూపు చూసి లోపలికి వెళ్ళిపోయింది. నేను ఉఫ్ అని అనుకున్నా. తరువాత మళ్ళీ పనులలో పడిపోయి బిజీ అయిపోయా. రాత్రి కావొస్తుండగా పార్టీకి అందరూ వచ్చేశారు. అందరూ రావడం తో రూప కూడా మంచిగా చీర కట్టుకుని బయటకు వచ్చింది. తను రాగానే అందరూ క్లాప్స్ కొడుతూ ఆహ్వానించారు. తను ఆ చీరలో చాలా అందంగా ఉంది.
మీరు కానీ తనని ఇలా చూసి ఉంటే నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా గంట సేపు తిట్టేవారు. ఇంత ఏంజెల్ లాంటి ఫిగర్ ఐ లవ్ యూ చెప్తే నువ్వు వద్దంటావా అని..
అలా ఉంటుంది తను. నిజమే తను చాలా బాగుంటుంది. కానీ ఎందుకో తనంటే నాకు ఆ ఫీలింగ్ లేదు. ఆ ఫీలింగ్ అంటే పెళ్లి చేసుకోవడం అని. తనతో ఉండడం తనతో అన్నీ షేర్ చేసుకోవడం తనతో గొడవ పడడం ఇవ్వన్నీ నాకు నచ్చుతాయి కానీ ఎందుకో పెళ్లి అంటేనే, అవసరమా అన్నట్లుగా అనిపిస్తుంది. అలా అనిపించడానికి కారణం లేక పోలేదు. మొదటి కారణం వాళ్ళ నాన్న ఇచ్చిన మాట అయితే రెండో కారణం వాళ్ళ అన్న. ఇక మూడో కారణం చెప్పాలంటే అసలు నాకు తన మీద ఆ ఫీలింగ్ ఏ లేదు. ఎందుకో తనని చూస్తే అరే నాకు తను అమ్మ లాగ కదా తనతో బెడ్ షేర్ చేసుకోవడం ఏంటి అని ఒక ఫీలింగ్ వస్తుంది.

6 Comments

  1. Vijayraj Nuthalapati

    Lady don

  2. అసలు ఏమి రాయాలని అనుకున్నారో అర్థం కాలేదు. Continuation కూడా లేదు ఈ కథకు. అప్డేట్ చెయ్యండి

  3. Emi rasthunnavu sex anede ledu vest..

    1. Hi na mail msg me

Comments are closed.