పెళ్లి తరువాత..పెళ్లి ముందు.. 149

నాకు తనని ఏం అనాలో అర్దం కాలేదు మౌనంగా కాసేపు ఉండిపోయా. నేను ఏం అంటానో అన్నట్లుగా తను నన్నే చూస్తూ ఉంది. నేను కాసేపటికి నోరు విప్పుతూ లేదులే రూప, సారి అన్నా. రూప నా వంక కోపంగా చూసింది. నేను తనని కూడా అలాగే చూస్తూ ఏంటి అలా చూస్తున్నావ్ ? చేసిందే వెధవ పని మళ్ళీ చూస్తున్నావ్ అంటూ కోపంగా తల తిప్పుకుని బెడ్ దగ్గరకు వెళ్ళా. నేను అలా వెళ్ళగానే వెనుక నుండి రూప పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను తన వైపుకు తిప్పుకుంది. నేను తనని ఏంటి అని చుసేలోగా తన పెదాలతో నా పెదాల మీద ముద్దు పెట్టింది. నేను కోపంగా తనని విడిపించుకుని లాగి చెంప మీద కొట్టా. తను నేను కొట్టిన దెబ్బకు షాక్ గా చూస్తూ నిల్చుని ఉండిపోయింది. నేను అనోసరంగా చెయ్ చేసుకున్నా కదా అని అనుకుంటూ బెడ్ మీద కూర్చుని తల పట్టుకున్నా. రూప అలాగే నా ముందు నిల్చుని ఉంది. తన ముఖం కోపంగా ఉంది. కళ్ళలో నీళ్ళు వస్తూ ఉంటే కనీసం తుడుచు కాకుండా అలాగే నా ముందు నిల్చుని నన్నే చూస్తూ ఉండిపోయింది. నేను తనలా చూస్తూ ఉండడం చూసి నా తప్పెంటో అర్దం చేసుకుని తన చేతిని పట్టుకుని నా దగ్గరికి లాక్కుంటూ సారి అన్నా. తను ఏం అనకుండా అలాగే నిల్చుంది. నేను తన కళ్ళలో నీళ్ళు తుడుస్తూ ప్లీస్ రా ఏం అనుకోకు అని అన్నా తనని కూల్ చేయడానికి. తను మాత్రం ఏం పలక కుండా నన్నే కోపంగా చూస్తూ ఉంది. నేను చిన్నగా పైకి లేచి తనని చూస్తూ నేను చెప్పేది విను అన్నా. తను పలకలేదు. తను కోపంగా ఉంది అని అర్దం చేసుకుని చెప్పేది అర్దం చేసుకో రూప నేను ఎప్పుడూ నిన్ను అలా చూడలేదు అంటూ తనని చూసా. రూప నా వంక చూసింది మామూలుగా, కానీ నాకు అది కోపంగా చూస్తున్నట్లు అనిపించింది. నేను తన చేతులు పట్టుకుని తన కళ్ళలోకి చూస్తూ నిజంగా నీపై నాకు అలాంటి అభిప్రాయాలు ఏమీ లేవు, నాకు నువ్వు ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా అంతే ఇంకా చెప్పాలంటే నువ్వు నాకు ఒక అక్క లా అని అన్నా. అంతే అలా అన్నానో లేదో రూప ఒక్కసారిగా నా చెంప చెళ్లమనిపిస్తూ అక్కా గిక్కా అన్నవంటే పళ్ళు రాలగొడతా అంది. నేను షాక్ గా చూసా. తను ఆ మాటకు బాగా హర్ట్ అయ్యింది అనుకుంటా నన్ను కోపంగా చూస్తూ ఇంకోసారి అక్కా అన్నవో అంటూ కోపంగా నన్ను చూసి అక్కడ ఉన్న బాగ్ తీసుకుంటూ వెళ్ళిపోయింది. కాసేపటికి ఎదో మెసేజ్ వస్తే చూసా. నీకిష్టం ఉన్నా లేకున్నా నాకనోసరం, నిన్నైతే విడిచిపెట్టను గుర్తు పెట్టుకో అని ఉంది అందులో. నేను ఉఫ్ అనుకుంటూ ఎలా చెప్తే అర్దం అవుతుంది దీనికి అనుకుంటూ అలాగే బెడ్ మీద పడ్డాను. ఎప్పుడు నిద్ర వచ్చిందో తెలీదు లేచి చూస్తే పొద్దున అయ్యింది. తన నుండి చాలా మెసేజ్ లు వచ్చాయి. నేను వాటిని చూస్తూ దీనికి ఇలా చెప్తే అర్దం కాదు అని అనుకుని తనకి తిరిగి మెసేజ్ చేస్తూ ఇంకోసారి ప్రేమా అన్నావంటే విశయం మీ అన్న దగ్గరికి వెళ్తుంది జాగ్రత్తా అని పెట్టా.
అంతే అప్పటి నుండి ఈరోజు వరకు మెసేజ్ లు లేవు, మాటలు లేవు బహుశా తన అన్నకు భయపడింది అనుకుంటా. కానీ అది భయం కాదు అని నాకు ఇవ్వాళే తెలిసింది. ఇవ్వాళ జరిగింది చూసాక తనకి ఇంకా భయం కలగలేదు అని అర్దం అయ్యింది.
అలా అర్దం కాగానే నేను ఒకసారి పార్టీ లో అందరితో నవ్వుకుంటూ మాట్లాడుతున్న రూప ను చూసా. తనకు అస్సలు ఏ మాత్రం భయం లేదు అని తన ముఖం చూస్తేనే అర్ధం అవుతుంది. నేను తనకు ఇలా చెప్తే అర్దం కాదు అని తన అన్న దగ్గరికే వెళ్ళి ఒకసారి చెప్తే అప్పుడు కానీ బుద్ది రాదు అనుకున్నా. అలా అనుకున్నదే తడువుగా వెంటనే రూప అన్న ఎక్కడ ఉన్నాడో చూసా. అతను ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాడు. నేను అది చూసి వెంటనే పైకి లేచా. అలా లేవడం తో అప్పటి వరకు నేను ఎక్కడ ఉన్నానో అని దొంగ చూపులు చూస్తున్న రూప కు నేను కనపడ్డ. నేను కనపడడం తో నా వంక చూసి నవ్వింది. నేను కోపంగా తల తిప్పి అటు చూడు అన్నట్లుగా చూసా. అక్కడ వాళ్ళ అన్న కనిపించాడు. అది చూసి అయితే అన్నట్లుగా చూసింది. నేను తనని చూసి చిన్న వెకిలి నవ్వు నవ్వి వెళ్ళి చెప్పనా అన్నట్లుగా చూసా.

6 Comments

  1. Vijayraj Nuthalapati

    Lady don

  2. అసలు ఏమి రాయాలని అనుకున్నారో అర్థం కాలేదు. Continuation కూడా లేదు ఈ కథకు. అప్డేట్ చెయ్యండి

  3. Emi rasthunnavu sex anede ledu vest..

    1. Hi na mail msg me

Comments are closed.