పెళ్లి తరువాత..పెళ్లి ముందు.. 149

ఎంటి అంకుల్ కులాసాయేనా ? అంది రూప. దానికి మా నాన్న హా కులాసాయే అమ్మా, ఒకవేళ కాకపోయినా నిన్ను చూశాను కదా కచ్చితంగా అయ్యి తీరాల్సిందే అని అంటూ నవ్వాడు. రూప కూడా నవ్వుతూ సినిమా డైలాగ్ లు బాగా చెప్తారు అంకుల్ మీరు అంది. నిజానికి మా నాన్నకు రూప కు చాలా మంచి అనుబంధం ఉంది. మా నాన్న కు రూప ఎంత చెప్తే అంత అన్నట్లు. తన నడవడిక, సిన్సియారిటి, క్యారెక్టర్ అంటే మా నాన్నకు చాలా ఇష్టం. అలాంటి పిల్ల నీకు పుట్టినందుకు చాలా అదృష్టమంతుడివి రా నువ్వు అని దేవేంద్ర అంకుల్ ను ఎప్పుడూ పొగుడుతూ ఉంటాడు. ఈవెన్ మా నాన్నకు అంత అనుభవం ఉన్నా కూడా రూప ను వెళ్ళి సలహాలు అడుగుతూ ఉంటాడు. రూప గ్లాస్ లో డ్రింక్ తీసుకుని తాగుతూ ఎంటి అంకుల్ మీ అబ్బాయి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంది తన ప్లాన్ ను అమలు పరుస్తూ..
మా నాన్న రూప అలా అడగగానే కొంచెం డల్ అయ్యి, ఎంటో అమ్మా మా వాడు అంతా చిత్రమైన పనులు చేస్తున్నాడు అన్నాడు. రూప ఏమైంది అంకుల్ అని అంది. దానికి మా నాన్న నీకు తెలీదా అమ్మా అంటూ నేను ఇలా ఒక కంపెనీ నా సొంతంగా నేనే మొదలు పెడదాం అని అనుకుంటున్నా అన్న విశయం తనకి చెప్పాడు. రూప మనసులో నవ్వుకుంటూ అయ్యో అవునా అంటూ తన మొదటి అస్త్రం ప్రయోగించింది. సొంత కంపెనా ? మన వినయా ? అంది పెట్టగలడా అన్నట్లుగా చూస్తూ. తనలా చూసే సరికి మా నాన్నకు అంతవరకు నా మీద కాస్తో కూస్తో ఉన్న నమ్మకం కూడా ఆ చూపు చూడగానే పోయింది. అలా నమ్మకం కోల్పోయి ఎంటమ్మా వీడు దానికి పనికి రాడు అంటావా అన్నాడు కాస్త మెల్లగా. రూప తెలివి గలది, తను ఏమైనా అనింది అంటే దాంట్లో ఎదో ఉండే ఉంటుంది అని మా నాన్న నమ్మకం అందుకే మా వాడు దానికి పనికి వస్తాడా రాడా అని రూపను అడిగాడు. రూప నవ్వుతూ నన్ను తక్కువ చేయకుండా అయ్యో అలా అంటారు ఏంటి అంకుల్ అతను మంచి పట్టుదల వున్నవాడు పనికి రాడా అని అడుగుతారు ఎంటి ? కచ్చితంగా కంపెనీ పెట్టి అనుకున్నది సాధిస్తాడు అని అంది అలా అనగానే మా నాన్న ముఖం సంతోషంగా వెలిగిపోయింది. అలా వెలిగిపోతూ ఉండగా రూప మనసులో నవ్వుకుంటూ తన ఇంకో అస్త్రాన్ని ప్రయోగించింది. కానీ ఒక్కటే సమస్య అంది. వెంటనే మా నాన్న ఏంటి అది అన్నట్లుగా చూసాడు. వెంటనే రూప కొంచెం సీరియస్ గా చెప్తున్నట్లుగా ఫేస్ పెడుతూ వినయ్ కు పట్టుదల అయితే ఉంది కానీ సరైన గైడెన్స్ఏ లేదు అదే ప్రాబ్లెమ్ అంది. మా నాన్న అర్దం కానట్లు చూసాడు. రూప తనని చూస్తూ వినయ్ ని చిన్నప్పటి నుండి చూస్తున్నా కదా తనకు ఇలాంటి వాటి మీద పెద్దగా పట్టు లేదు, తను ఆల్రెడీ ఉన్న వాటిని మెయింటైన్ చేయగలడు ఏమో కానీ ఇప్పుడు తనకున్న టాలెంట్ కు కంపెనీ స్టార్ట్ చేసి డెవలప్ చేయడం అంటే కష్టం అంది. దానికి మా నాన్న కాస్త ఢీలా పడిపోయి అయితే ఏం చేస్తే బాగుంటుందమ్మ అన్నాడు. రూప చిన్నగా నవ్వి తనని ముందు మీ కంపెనీ లోకి తీసుకోండి అంకుల్, అసలు కంపెనీని ఎలా నడిపించాలి ఎంత స్ట్రెస్ ఉంటుంది లాస్ ఎలా కవర్ చేయాలి ఇంకా తెలుసుగా కంపెనీ లో ఎలా ఉంటుందో అవ్వన్నీ ఎలా మేనేజ్ చేసుకోవాలో ప్రాక్టికల్ లా చుయించండి. ఒకవేళ మీరు డైరెక్ట్ గా వోదిలేసినా ఇవ్వన్నీ సొంత అనుభవం మీద తెలుసుకుంటాడు కానీ ఏం లాభం అంటూ అటు ఇటు చూసి ఇప్పటికే ఒక కంపెనీ లాస్ లో ఉంది ఇంకో లాస్ అవసరమా ? అంది. మా నాన్న అవును నిజమే అన్నట్లుగా చూసాడు. అందుకే అంకుల్ చెప్తున్నా తెలుసుకోవడం అయితే తెలుసుకుంటాడు సొంత అనుభవం మీద కానీ లాస్ వచ్చాక అది ఎవరు కవర్ చేస్తారు.

6 Comments

  1. Vijayraj Nuthalapati

    Lady don

  2. అసలు ఏమి రాయాలని అనుకున్నారో అర్థం కాలేదు. Continuation కూడా లేదు ఈ కథకు. అప్డేట్ చెయ్యండి

  3. Emi rasthunnavu sex anede ledu vest..

    1. Hi na mail msg me

Comments are closed.