పెళ్లి తరువాత..పెళ్లి ముందు.. 149

అలా డోర్ క్లోజ్ చేసి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి మా ఇంటి ముందు నిలబడి తన తల మీద తనే కొట్టుకుంటూ ఛా, ఏమైందే నీకివ్వాల ? ఆ మాత్రం చెప్పలేవా వాడికి అనుకుంటూ అక్కడే తచ్చాడుతూ చెప్పేయవే రూపా చెప్పెయి ఏం కాదూ.. అని తనకు తనే దైర్యం చెప్పుకుంటూ అక్కడే మా ఇంటి ముందు అటు ఇటూ తిరుగుతూ ఉంది. అలా తిరుగుతూ తనని తనే ప్రిపేర్ చేసుకుంటూ ఏముందీ డైరెక్ట్ గా వెళ్ళి ఐ లవ్ యూ వినయ్ అని చెప్పి వచ్చేయి తరువాత ఏమైతే అది అయ్యింది అని బయటికే చిన్నగా మాట్లాడుకుంటూ చెప్పేయవే రూపా చేప్పేయి అని దైర్యం తెచ్చుకుంటూ కళ్ళు మూసుకుని నాలుగైదు సార్లు ఊపిరి తీసుకుని వదిలింది. అలా వోదులుతూ ఏమైతే అది అయ్యింది చెప్పెద్దాం అని దైర్యంగా అనుకుంటూ ఒకసారి మా ఇంటి పై ఫ్లోర్ లో ఉన్న నా రూం విండో వంక చూసింది. అంతే తనకు వెంటనే షాక్ కొట్టినట్లు అయ్యింది. అక్కడ నేను తననే చూస్తూ నిలబడి ఉన్నా. అది చూసి అయ్యో చుసేసాడే అని మనసులో అనుకుంటూ ఇలా అడ్డంగా దొరికి పోయానేంటి అని వెంటనే నా ముందు ఉండలేక తల దించుకుంటూ బుద్దిగా అక్కడ నుండి నడుచుకుంటూ తనింటి వైపుకు వెళ్ళింది. నేను అలా నడుస్తూ వెళ్తున్న తనని చూస్తూ ఏమైంది దీనికి అని అనుకుంటూ వెంటనే తనకి ఫోన్ చేశా. తను ఫోన్ రావడం చూసి తల తిప్పి నేను ఉన్న విండో వైపు చూసింది. నేను ఫోన్లో పైకి రా అని చెప్పేసి పెట్టేసా. అలా పెట్టేసి బెడ్ మీద వచ్చి కూర్చున్నా. కాసేపటికి తలుపు తట్టిన సౌండ్ వచ్చింది. నేను డోర్ తీసా. తను సైలెంట్ గా తల దించుకుని లోపలికి వచ్చింది. నేను తన ముఖం లో చూస్తూన్నా ఏం చెప్తుందా అని. తను నేను చూస్తుండడం చూసి తల అలాగే వంచుకుని ఉంది. నేను ఉఫ్ అనుకుంటూ ఇప్పుడైనా చెప్తావా లేక అంటూ అనబోతూ ఉండగానే వెంటనే తను తలెత్తింది. తలెత్తి నా వంక చూస్తూ ఐ లవ్ యూ అంది. నేను ఒక్కనిమిషం అర్దం కానట్లుగా చూసా. తను నన్ను చూసి మళ్ళీ కన్ఫర్మ్ చేస్తూ ఐ లవ్ యూ అని అంటూ ఇదే అప్పటి నుండి చెప్పాలి అనుకుంటున్నది అంది. నేను తనని అర్దం కానట్లుగా చూస్తూ జోక్ చేస్తున్నావ్ కదా అన్నా. రూప నా వంక సూటిగా చూసింది. నేను తన చూపు చూసి ఏంటి నిజమా ? అన్నా. రూప నెమ్మదిగా తల వొంచుకుంది. నేను తనని చూసి ఏంటిది అంటూ అనబోతు ఉంటే రూప నన్ను ఆపుతూ నా వంక చూసి నా చేతిని పట్టుకుంటూ ఇప్పుడేం చెప్పకు, నెమ్మదిగా ఆలోచించు, ఇవ్వాళ నా బర్త్ డే, నన్ను డిస్ అపాయింట్ చేయకు, అదే నువ్వు నాకిచ్చి గిఫ్ట్ అంది. అలా అంటూ నెమ్మదిగా డోర్ దగ్గరకు వెళ్ళింది. అలా వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంటే ఆగు అన్నా. రూప నా వంక చూసింది. నేను తన దగ్గరికి వెళ్తూ నీకు ఆల్రెడీ రమణ అంకుల్ కొడుకు తో పెళ్ళి కుదిరింది అని గుర్తుందా అన్నా. రూప తల దించుకుని మౌనంగా ఉండిపోయింది. నేను ఇంట్లో వాళ్ళు సడెన్ ఎవరినైనా వస్తారేమో అని వెంటనే తలుపు వేసేస్తూ తన వంక చూసా. తను తల పైకెత్తి నన్ను చూస్తూ నాకు తెలుసు నువ్వు దాని గురించి అంటావ్ అని కానీ అంటూ ఇంకేదో చెప్పబోతూ ఉంటే నేను తనని ఆపుతూ అసలు ఎంటి ఇది ? ఇన్ని రోజులు బాగానే ఉన్నాం గా సడెన్ గా ఎందుకు ఇలా అంటున్నావ్ అన్నా. తను తలెత్తి నన్ను చూస్తూ వినయ్ ప్లీస్ నన్ను ఏమీ అడగకు, నాకు నువ్వంటే ఇష్టం అంతే ఇంకేం చెప్పలేను అంది. నేను తనని కోపంగా చూసా. తను తల దించుకుంది. కాసేపు ఇద్దరం అలాగే నిలబడ్డాం.

6 Comments

  1. Vijayraj Nuthalapati

    Lady don

  2. అసలు ఏమి రాయాలని అనుకున్నారో అర్థం కాలేదు. Continuation కూడా లేదు ఈ కథకు. అప్డేట్ చెయ్యండి

  3. Emi rasthunnavu sex anede ledu vest..

    1. Hi na mail msg me

Comments are closed.