పెళ్లి తరువాత..పెళ్లి ముందు.. 149

అతను కూడా మా నాన్న లాగే చాలా బిజినెస్ లు చేసాడు. ఎన్నో అపజయాలను ఎదుర్కున్నాడు కానీ ఎప్పుడూ వెనక్కి అడుగు వేయలేదు. ఇప్పుడు అతనికి రెండు కంపెనీలు ఉన్నాయ్. సిటీ లో చాలా పేరు ఉంది అతనికి. అతనంటే మా నాన్నకు మా నాన్న అంటే అతనికి చాలా అంటే చాలా ఇష్టం. ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే మా రెండు కుటుంబాలు కచ్చితంగా కలవాల్సిందే. అదలా అలవాటు అయిపొయింది మాకు. ఆరోజు కూడా వాళ్ళ కంపెనీ ఆనువల్ టర్న్ ఓవర్ పెరగడం తో ఒక చిన్న పార్టీ ఆరెంజ్ చేశారు. ఎప్పటి లాగే మా ఫ్యామిలీ నే వాళ్లకు మొదటి గెస్ట్. కాబట్టి ఆరోజు మధ్యాహ్నం లోపు మా అమ్మా నాన్నా, మా అక్క బావ, నేను అందరం వాళ్ళ ఇంటికి చేరుకున్నాం. అన్నట్లు చెప్పడం మరిచి పోయాను. మా అక్క పేరు భాను తనకి పెళ్లి అయ్యింది. మా నాన్న పట్టు పట్టి మరీ ఇల్లరికం వచ్చే అల్లుడిని చూసి పెళ్లి చేశారు. మా బావ బాగా ఇంటెలిజెంట్, తను వేరే కంపెనీ లో వర్క్ చేస్తూనే మా కంపెనీ వర్క్స్ కూడా చూసుకుంటూ ఉంటాడు. మా నాన్నకు అతనంటే గౌరవం. బాగా సిన్సియర్ అని. అందుకేనేమో కూతురిని కూడా ఇచ్చి చేసాడు. ఇక విశయానికి వస్తే, మేము దేవేంద్ర అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఇంటి లోపలికి వెళ్తూ వుండగానే దేవేంద్ర అంకుల్ బార్య ఎదురొచ్చి మాకు ఆహ్వానం పలికింది.
దేవేంద్ర బార్య : ఎంటే పొద్దున రమ్మంటే ఇప్పుడా వచ్చేది ?
మా అమ్మ : అదేం లేదే వీడే కాస్త లేట్ చేసాడు ఆ పని ఈ పని అనుకుంటూ అంటూ నా వంక చూసింది.
ఆంటీ నా వైపు చూసి ఏరా ఇక్కడకు రావడం కంటే నీకు ముఖ్యమైన పని ఉందా అని అంది. నేను అమ్మ నా మీదకి చెప్పేసరికి తనని చూస్తూ ఆంటీ నన్ను అంటారేంటి, మా ఇల్లు పక్కనే కదా నేను లేట్ చేస్తే ఏమీ ? వాళ్ళు ముందే రావొచ్చుగా అన్నా. ఆ లాజిక్ కరెక్టే అని అనిపించడం తో ఆంటీ అమ్మ వైపు చూస్తూ నిజమే కదనే, వాడంటే లేట్ చేశాడు పక్కింట్లో ఉండి నీకు రావడానికి ఎంటే అడ్డం ? అంది. దానికి నేను నవ్వుతూ అలా అడగండి ఆంటీ అంటూ అమ్మ అక్క వంక చూసి కొంచెం వెక్కిరింపుగా రెండు గంటలు చేశారు ఆంటీ సింగారించడానికి మళ్ళీ ఇప్పుడు ఎదో నా మీద సాకులు చెప్తున్నారు అన్నా.

6 Comments

  1. Vijayraj Nuthalapati

    Lady don

  2. అసలు ఏమి రాయాలని అనుకున్నారో అర్థం కాలేదు. Continuation కూడా లేదు ఈ కథకు. అప్డేట్ చెయ్యండి

  3. Emi rasthunnavu sex anede ledu vest..

    1. Hi na mail msg me

Comments are closed.