పెళ్లి తరువాత..పెళ్లి ముందు.. 149

ఇప్పటికే ఉన్న కంపెనీ లాస్ లో ఉంది అది సరిపోదా మళ్ళీ కొత్తది ఎందుకు అంది. మా నాన్న అవునవును అని అంటూ రూప వంక చూసి మళ్ళీ ఎదో గుర్తొచ్చిన వాడిలా కానీ వాడు నా మాట వినడే, ఎలా చెప్పేది అన్నాడు. రూప ఎందుకు వినడు అంకుల్ మీ కంపెనీ నే కదా అది. దాంట్లో ఉండడానికి ఏం సమస్య అతనికి అంది. దానికి మా నాన్న అయ్యో నీకు తెలీదు అమ్మా వాడికి నా కంపెనీ అంటేనే నచ్చదు నాది కాకుండా వేరే ఏదైనా సరే చేస్తా అంటాడు ఏమో కానీ నా కంపెనీ పేరెట్టితేనే వాడికి చెడ్డ చిరాకు అన్నాడు. తను ఎప్పుడెప్పుడు ఈ మాట అంటాడు అని ఎదురుచూస్తున్న రూప టక్కున మా నాన్నతో అయితే ఒక పని చేయండి అంకుల్ అంది. మా నాన్న ఏంటి అన్నాడు. రూప మనసులో నవ్వుకుంటూ మా నాన్నను చూస్తూ నేను ఎలాగో ఇప్పుడు ఒక కంపెనీని చూసుకుంటున్నా కదా, తెలిసిన వాడే, మన వినాయే కాబట్టి నాకు పియే గా చేరమనండి, సొంతంగా నేర్చుకున్నట్లు ఉంటుంది, మీ కంపెనీ మీద ఆధార పడలేదు అన్నట్లూ ఉంటుంది ఏమంటారు ? పైగా నేను ఉన్నాగా వాడికి ఏం కావాలో ఏం నేర్పించాల్లో తెలిసిన దాన్ని అంది. అంతే మా నాన్న ముఖం లో 1000 వోల్టా వెలుగు వచ్చింది. వెంటనే రూప చేతులు పట్టుకుని ఎంటి నిజమా అమ్మా నీ కింద మా వాడ్ని చేర్పించు కుంటావా ? అన్నాడు. మా నాన్న ఉద్దేశం లో రూప చాలా తెలివి గలది అంత తెలివి ఉన్న ఆమె నా కొడుకుని పీయే గా పెట్టుకుంటుంది అంటే వాడికి ఎంతో కొంత నాలెడ్జ్ ఉందని, ఇంకా రూప తో పని చేస్తాడు కాబట్టి ఆమె వళ్ళ ఎంతో కొంతైనా నేర్చుకుంటాడు అని మా నాన్న ఉద్దేశం. అది రూప కు మా నాన్న కళ్ళలో కనిపిస్తుంది. మా నాన్న కు ఇచ్చిన బూస్ట్ సరిపోలేదు అన్నట్లుగా రూప ఇంకా చెప్తూ వినయ్ కొంచెం నేమ్మదిగా నేర్చుకుంటాడు అందుకే నేను అనుకోవడం ఏంటంటే, వాడ్ని ఒక వన్ ఇయర్ నాతోనే పెట్టుకుని కంపెనీ ని ఎలా నడిపించాలో ట్రైనింగ్ ఇస్తాను ప్రాక్టికల్ గా అప్పుడైతే వినయ్ బాగా పిక్ అప్ అవుతాడు ఏం అంటారు అంది. దానికి మా నాన్న ఏం చెప్పమంటావ్ అమ్మా, అసలు ఇంత హెల్ప్ చేస్తావ్ అని కలలో కూడా అనుకోలేదు, ఏమైనా నీకు చాలా థాంక్స్ అమ్మా అని అన్నాడు చాలా ఆనందం తో. రూప మా నాన్న సంతోషాన్ని చూస్తూ పర్లేదు అంకుల్ వినయ్ ఏం పరాయి వాడా (నాక్కబోయే వాడే గా అనుకుంటూ) నాతోనే తిరిగాడు నాతోనే అన్నీ షేర్ చేసుకుంటాడు నేను ఆ మాత్రం చేయక పోతే ఎలా అంకుల్ అంది. దానికి మా నాన్న పొంగిపోయి చాలా థాంక్స్ అమ్మా, అంటూ రూప ను చూస్తూ నిజంగా ఒకవేళ వాడికి అక్కే లేకుంటే ఆ లోటు మాత్రం నువ్వు కచ్చితంగా భర్తీ చేసే దానివమ్మా అన్నాడు. అంతే అంతవరకు నవ్వుతూ ఉన్న రూప ముఖం కొంచెం సీరియస్ గా మారిపోయింది. కాబోయే మొగుడని నేను అనుకుంటూ ఉంటే నువ్వేంటి నీ కొడుకు లాగే అక్కా బొక్కా అనుకుంటూ అని ఇంకేదో మనసులో తిట్టుకోవడానికి చూస్తూ అంతలోనే పోనీలే కాబోయే మామగారే కదా క్షమించి వొడిలెద్దాం అని అనుకుని ఇంకాసేపు ఇక్కడే ఉంటే మళ్ళీ ఎక్కడ అక్కా అంటాడేమో అని మా నాన్నను చూస్తూ సరే సరే అంకుల్ ఇక మీరు వెళ్ళండి అక్కడ పాపం మా నాన్న ఒక్కడే కష్టపడుతున్నాడు అని అంది దేవేంద్ర ఒక్కడే తాగడం చూసి. వెంటనే మా నాన్న అవును పాపం వాడు కంపెనీ లేకుండా తాగడం తక్కువ పోయి కంపెనీ ఇస్తా అంటూ వెళ్తుంటే రూప ఎదో గుర్తొచ్చిన దానిలా హా ఇంకో విశయం అంకుల్ అంది.

6 Comments

  1. Vijayraj Nuthalapati

    Lady don

  2. అసలు ఏమి రాయాలని అనుకున్నారో అర్థం కాలేదు. Continuation కూడా లేదు ఈ కథకు. అప్డేట్ చెయ్యండి

  3. Emi rasthunnavu sex anede ledu vest..

    1. Hi na mail msg me

Comments are closed.