పెళ్లి తరువాత..పెళ్లి ముందు.. 149

తన మొహం లో నవ్వు మాయమయి పోయింది. సీరియస్ గా నా వంక చూసింది. నేను కావాలనే తనని ఇంకా భయపెడదాం అని వాళ్ళ అన్నను చూస్తూ అతని దగ్గరికి వెళ్ళా. అది చూసిన రూప అలాగే నిలబడి నేను ఏం చేస్తానోనని చూస్తోంది. నేను కోపంగా తన వంక లుక్స్ ఇస్తూ వాళ్ళ అన్న దగ్గరికి చేరుకున్నా. అక్కడ వాళ్ళ అన్న అవతల వైపుకు తిరిగి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. నేను చివరి సారి రూప వంక చూసా చెప్పమంటావా అన్నట్లు. రూప నన్ను సీరియస్ గా చూసింది. నేను కూడా అలాగే తనని చూసా. ఏమనుకుందో ఏమో కానీ వెంటనే నాకు ఫోన్ చేసింది. నేను కూడా వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తూ తనేం చెప్తుందో అని చూసా.. అవతల నుండి రూప కోపంగా మాట్లాడుతూ చెప్పాలని ఉంటే చెప్పేసేయి, నేనేం భయపడను, ఎప్పుడైనా చెప్పాల్సిందే, కొంచెం ముందు చెప్తున్నావ్ అంతే, నీకంత దైర్యం ఉంటే చెప్పు, చూస్తా ఇక్కడే కూర్చుని అంటూ కోపంగా ఫోన్ పెట్టేసి అక్కడే కూర్చుంది. తనలా చేయగానే నేను కోపంగా తన వంక చూసా. తను నా వంక చెప్పుకో చూస్తా అన్నట్లుగా చూసింది. నేను తన వంక ఇంకా వాళ్ళ అన్న వంక కొద్దిసేపు మార్చి మార్చి చూస్తూ ఎందుకులే గొడవ పెద్దది చేయడం అనుకుని గట్టిగా నా కాలుని నేల ను కొడుతూ అక్కడ నుండి పక్కకు వచ్చేశా. రూప ఎదో జయించిన దానిలా నవ్వడం కనిపించింది. ఆ క్షణం లో నేను రమేష్ కు విశయం చెప్పొచ్చు, కానీ నాకు అది ఇష్టం లేదు ఎందుకు అంటే ఈ విశయం తెలిస్తే కచ్చితంగా రమేష్ ఊరుకోడు, విశయం రూప వాళ్ళ నాన్న దగ్గరికి కచ్చితంగా వెళ్తుంది. అతని దగ్గరకు వెళ్ళాక
మా ఇద్దరి కుటుంబాలలో మనస్పర్థలు రాకుండా ఉండవు. దీనివల్ల నా కంటే రూపే ఎక్కువ బాధ పడుతుంది పైగా ఇదంతా మొదలైంది నా వల్లనే కాబట్టి నాకు ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది అందుకే నేను ఈ విశయం బయటకు చెప్పలేను. ఆ విశయం రూప కు కూడా బాగా తెలుసు అందుకే తను అంత దైర్యంగా ఉంది.
తల పట్టేసి నట్లు ఉంటే పార్టీ నుండి వచ్చేశా. ఇంటికి వచ్చి స్నానానికి వెళ్ళా. ఒక పదైదు నిమిషాలు నీటి కిందే అలాగే ఉండిపోయా. ఆ షవర్ లో నుండి వస్తున్న నీటికి నా మెదడు కూల్ అవుతున్నట్లు అనిపించింది. చాలా సేపు అలా స్నానం చేసి తుడుచుకొని బయటకు వచ్చా. అలా వచ్చి షర్ట్ వేసుకుంటూ ఉండగా అప్పుడే వెనుక నుండి ఎదో వాయిస్ వినిపించింది.
మా అన్నకు చెప్తే భయపడతాననుకున్నావా ? అంటూ..
నేను వెంటనే తల తిప్పి చూసా. అక్కడ డోర్ దగ్గర స్టైల్ గా నిలబడి ఉంది రూప. నేను తనని కోపంగా చూసా. తను నన్ను చూస్తూ ఎంటి ? ఏమనుకుంటున్నావ్ నువ్వు ? మా అన్నకు చెప్తే నిన్ను వదిలేస్తాననుకున్నావా ? నిజంగానే ?? అంటూ నన్ను చూసి వెకిలిగా నవ్వూతూ అంది నేను మౌనంగా చూస్తూ ఊరుకున్నా. తను అలాగే వెకిలిగా నవ్వుతూ అంతలోనే కాస్త సీరియస్ గా ఫేస్ పెట్టి నా దగ్గరికి వచ్చింది. అలా వచ్చి నన్నే చూస్తూ ఎందుకు చెప్పలేదు అంది. నేను ఊపిరి గట్టిగా పీల్చుకుని వదులుతూ, తల పక్కకి తిప్పేసుకున్నా తనని కేర్ చేయనట్లుగా.
నేను అలా తల తిప్పుకోగానే నా తల ను తన వైపుకు తిప్పుకుంటూ ఏంటి ? పోగరా అంది. నేను కోపంగా చూసా. తను కూడా అలాగే చూస్తూ ఏంటి చెప్తావా ? ఎవరిని భయపెట్టిస్తున్నావ్ ? అంది. అలా అంటూ పో చెప్పు పో, ఇప్పుడే పో, వెల్లు అంటూ నన్ను వెనక్కి దొబ్బింది అలా దొబ్బగానే నేను వెనుక గోడకు దగ్గరగా వెళ్ళా. తను ముందుకు వస్తూ నా ఛాతీ మీద ఇంకోసారి దొబ్బుతు చెప్పుపో రా, అంది. అప్పటికే నేను గోడకు దగ్గరగా వచ్చేయడం తో కాస్త వెనుకకి వెళ్ళి గోడకు అనుకున్నా. అలా ఆనుకోగానే తను నా దగ్గరికి వచ్చి నా తలకు రెండు వైపులా చేతులు పెడుతూ వాటిని గోడకు ఆనించి నన్ను చూసింది.

6 Comments

  1. Vijayraj Nuthalapati

    Lady don

  2. అసలు ఏమి రాయాలని అనుకున్నారో అర్థం కాలేదు. Continuation కూడా లేదు ఈ కథకు. అప్డేట్ చెయ్యండి

  3. Emi rasthunnavu sex anede ledu vest..

    1. Hi na mail msg me

Comments are closed.