పెళ్లి తరువాత..పెళ్లి ముందు.. 149

ఇక అసలు విశయం చెప్పాలంటే నేను తను చాలా క్లోజ్. తనకి నేనంటే నాకు తనంటే చాలా ఇష్టం. ఏ విశయాన్ని అయినా తనకి నేను తను నాకు షేర్ చేసుకోనిది అస్సలు ఉండం. కానీ మొన్న రీసెంట్ గా జరిగిన గొడవ వళ్ళ ఇద్దరం మాట్లాడుకోవడం మానేసాం. దాదాపు అది పెద్ద గొడవే అని చెప్పాలి ఎందుకు అంటే అది మా ఇద్దరి కుటుంబాల మధ్య చిచ్చు పెట్టగల అంశం. అందుకే ఇద్దరం మాట్లాడుకోవడం మానేశాం. నిజానికి ఇద్దరం అనే కంటే నేనే మాట్లాడడం మానేశా అనడం కరెక్ట్. అయినా ఇది మాకు మామూలే గొడవ పడడం మళ్ళీ కలవడం, కానీ ఈసారే కాస్త సీరియస్ గా ఉంది ఇష్యూ.
ఇప్పుడే స్నానం చేసినట్లు ఉంది. టవల్ తో తల తుడుచుకుంటూ ఉంది. నేను వచ్చిన పని చూసుకోవడం మానేసి తనని అలాగే నిల్చొని చూస్తూ ఉన్నా. అంతలో తను క్యాసువల్ గా తల తుడుచుకుంటూ ఇటు వైపుకు తిరిగింది. అంతే నేను ఇక్కడ బొమ్మలా నిలబడి తననే చూస్తూ ఉండడం తనకి కనిపించింది. వెంటనే తల తుడుచుకోవడం ఆపేసి నా వంక సీరియస్ గా చూసింది. నేను వెంటనే నేనేం నీతో మాట్లాడడానికి రాలేదు సెల్ సిగ్నల్స్ రాక వచ్చా అన్నట్లుగా తనని చూసా నా సెల్ తనకి చూపిస్తూ. తను నా వంక ఒకసారి ఎగా దిగా చూసి విసుగ్గా తల తిప్పేసుకుని మళ్ళీ తుడుచుకోవడం మొదలు పెట్టింది. ఇక్కడ ఉండి అనోసరంగా తనతో ఎందుకు లే అని అనుకుంటూ అక్కడ నుండి కిందికి వచ్చేశా.
అలా వస్తుండగా రమేష్ బార్య ఎదురు వచ్చింది. నన్ను చూసి పలకరింపుగా నవ్వుతూ ఏంటి వినయ్ ఎలా ఉన్నావ్ అంది. నేను నవ్వి బాగున్నా అని అన్నా. తను అంతలో ఎదో గుర్తు వచ్చినదానిలా అవునూ ఇందాక రమేష్ నీకు కాల్ చేస్తున్నా తగలలేదు అంట కదా ఎక్కడ పెట్టుకున్నావ్ ఫోన్ ను అంది. నేను చేతిలో ఫోన్ ను చూపిస్తూ నెట్వర్క్ రావట్లేదు అన్నా. అంతలో చేతిలో ఉన్న ఫోన్ మోగింది. చూస్తే రమేష్ చేస్తున్నాడు. వెంటనే అది తనకి చూపిస్తూ వాడే చేస్తున్నాడు అని అంటూ ఫోన్ లిఫ్ట్ చేశా. లిఫ్ట్ చేసి హెలో అంటూ హాల్ లోకి వచ్చా. అవతల నుండి రమేష్ గాడు..

6 Comments

  1. Vijayraj Nuthalapati

    Lady don

  2. అసలు ఏమి రాయాలని అనుకున్నారో అర్థం కాలేదు. Continuation కూడా లేదు ఈ కథకు. అప్డేట్ చెయ్యండి

  3. Emi rasthunnavu sex anede ledu vest..

    1. Hi na mail msg me

Comments are closed.