పెళ్లి తరువాత..పెళ్లి ముందు.. 149

దానికి మా నాన్న హా ఎంటమ్మా అన్నాడు. రూప ఏం లేదు, నా దగ్గర చేరమని మీ అబ్బాయికి డైరెక్ట్ గా చెప్పకండి, మళ్ళీ ఇదేదో ప్లాన్ అన్నట్లుగా వొద్దు అంటాడు, ముందు మీ కంపెనీ లో చేరమని చెప్పి ఆ తరువాత వొద్దు నేను చేరను అని అన్నాక, మరి ఏం చేద్దాం అనుకుంటున్నవ్ పోనీ, వర్క్ అయినా నేర్చుకో అని మెల్లగా నా దగ్గర చేరేలా లాక్కురాండి. అయినా వినకపోతే మీకు తెలుసుగా ఎలా చెప్పాలో అంటూ నవ్వుతూ పెళ్లి చేసెస్తా అని బ్లాక్ మెయిల్ చేయండి సరిపోతుంది అంది. ఆ మాట వినగానే నేను షాక్ అయ్యా. తను నిజంగా దీన్ని కూడా వాడుకుంటుంది అని అనుకోలేదు. నేను అప్పట్లో రూప తో నాకు పెళ్ళి అంటే ఇష్టం లేదు అని చెప్పినట్లు గుర్తు. అందుకే ఇప్పుడు దాన్ని కూడా అడ్డం పెట్టమని మా నాన్నతో చెప్తుంది. తనలా అంటుంది అని అనుకోలేదు. అంతలో మా నాన్న సరే అమ్మా నేను చూసుకుంటాలే మిగితాది అన్నాడు. అలా అని దేవేంద్ర ను చూసి తన దగ్గరికి వెళ్ళిపోయాడు.
అలా మా నాన్న వెళ్ళిపోగానే రూప చేతిలో ఉన్న డ్రింక్ మొత్తం తాగేసి, నేను ఉన్న గోడ దగ్గరకు రాబోయింది. తను రావడం చూసి నేను వెంటనే అక్కడ నుండి తనకు దొరక కుండా వెళ్ళబోయా. కానీ అంతలోనే రూప గోడ దగ్గరికి వచ్చేసి విన్నూ.. అని పిలిచింది. అంతే అక్కడ నుండి వెళ్ళిపోతున్న నేను ఆగిపోయి వెనక్కి తిరిగాను. తను కళ్ళెగరేస్తూ చూసింది. నేను ఎంటి అన్నట్లుగా ఫేస్ పెట్టా. రూప నా దగ్గరికి స్టైల్ గా నడుస్తూ వచ్చి ఏంటి వినాల్సింది అంతా విని ఇప్పుడు వెళ్లిపోతున్నావా ? అంది. నేను కొంచెం చిరాకు గా ఫేస్ పెడుతూ నేనేం వినలేదు అన్నా. రూప నా ఫేస్ చూసి నవ్వుతూ, ఆపుతావా ఆ చెత్త ఎక్స్ప్రెషన్ అని అంది. నేను తనని ఏంటి నీ బాధ అన్నట్లుగా చూసా. రూప నాకు కొంచెం దగ్గరికి వస్తూ ఇందాక విన్నావ్ గా ఏం చెప్పానో అర్దం అయ్యిందా అంది. నేను ఏం విన్నా అన్నట్లుగా చూసా. రూప నవ్వుతూ నాకు తెలుసులే నువ్వు విన్నది ఎక్కువ చేయకు, అంటూ అటు ఇటు చూసి ఎవ్వరూ తనని గమనించడం లేదు అని ఖరారు చేసుకుంటూ నన్ను చూసి మూసుకుని ఎల్లుండి నుండి ఆఫీస్ కు రా, నీకే మంచింది, లేదంటే తెలుసుగా నా గురించి అంది. నేను తనని చూడకుండా అవతల వైపుకు చూస్తూ తన మాటలు మాత్రమే వింటున్నా. అది చూసి రూప నా చెయ్యి పట్టుకుంది. అంతే వెంటనే నేను కంగారు పడి అటు ఇటు చూస్తూ ఎవరైనా చూస్తారు అని అంటూ చెయ్ విడిపించుకున్నా. నేను అలా అనేసరికి ఒక్కసారిగా గట్టిగా నవ్వింది రూప.
ఆడపిల్లవా నువ్వేం అయినా ? అంత భయపడుతున్నావ్..
అయినా ఇక్కడ అందరూ మనల్ని అక్కా తమ్ముడి లాగే చూస్తున్నారు లే, చెయ్యి పట్టుకున్ననంత మాత్రాన తప్పుగా అనుకోరు అంది. నేను తనని చూసి ఇక అయిపోయిందా అన్నట్లుగా ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టాను. తను అటు ఇటు చూసి పెదాలతో ఉమ్మ్ అంటూ ఫ్లయింగ్ కీస్ ఇచ్చింది. నేను తనని కోపంగా చూసా. నిజానికి తన లాంటి అందమైన అమ్మాయ్ ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది అంటే ఎవ్వడైనా ఎగిరి గంతేస్తారు. కానీ ఇక్కడ నా పరిస్థితి అలా లేదు. తను ఇంకా నన్ను చూస్తూ ఎందుకు అలా బిగుసుకు పోతున్నావ్ ఫ్రీ గా ఉండు అంది. నేను ఉఫ్ అని అనుకుంటూ నేను వెళ్ళాలి అన్నా. దానికి రూప అయ్యో నేనేం నిన్ను ఆపలేదే అంది. నేను వెంటనే తన వైపు ఒక లుక్ ఇచ్చి ముందుకు నడవబోయా. అలా ముందుకు వెళ్తుంటే అంతలోనే ఒక్క నిమిషం అంటూ రూప ఆపింది. నేను తల తిప్పి చూసా. రూప నాకు దగ్గరగా వస్తూ నా చేయి పట్టుకుంటూ నా కళ్ళలోకి చూసి నన్ను ఎక్కువ కష్టపెట్టకు, ఆఫిస్ కు వచ్చేయి కలిసి పని చేసుకుందాం సరేనా ? అంది. నేను తన చేయి విడిపించు కుంటూ ముందుకు వెళ్ళిపోయా కోపంగా..

6 Comments

  1. Vijayraj Nuthalapati

    Lady don

  2. అసలు ఏమి రాయాలని అనుకున్నారో అర్థం కాలేదు. Continuation కూడా లేదు ఈ కథకు. అప్డేట్ చెయ్యండి

  3. Emi rasthunnavu sex anede ledu vest..

    1. Hi na mail msg me

Comments are closed.