పెళ్లి తరువాత..పెళ్లి ముందు..2 106

కానీ కాదు, నిజంగా చెప్తున్నా అంటూ తనని చూస్తూ నాకు నిజంగా నీపై ఎప్పుడూ కూడా అలాంటి ఫీలింగ్సే కలగలేదు, అలాంటప్పుడు నేనెలా నిన్ను ప్రేమిస్తా చెప్పు అన్నా. అలా అంటూ, బహుశా బాడీ పరంగా నిన్ను చూసి అప్పుడప్పుడు అట్రాక్ట్ అయ్యనేమో అంతే కానీ నిజంగా నీ మీద పెళ్లి చేసుకోవాలి, నీతో బెడ్ షేర్ చేసుకోవాలి అన్న ఫీలింగ్స్ అయితే అస్సలు లేవు అన్నా. తను కొంచెం కోపంగా తల పక్కకు తిప్పుకుంది. నేను తన భుజం మీద చెయ్యి వేస్తూ తనని నా వంక తిప్పుకున్నా. తను నన్ను చూసింది. నేను తన కళ్ళలోకి చూస్తూ ఒకవేళ చిన్నప్పటి నుండి నేను నిన్ను చూస్తూ పెరగకపోవడం, ఇంకా నువ్వు నన్ను ఇలా ఒక తమ్ముడిలా కేర్ చేస్తూ ఉండక పోవడం ఉండడం జరిగి ఉన్నింటే బహుశా నిన్ను చూసిన మొదటి చూపు లోనే నీతో లవ్ లో పడే వాన్నేమో, కానీ ఇప్పుడు నాకు అలా లేదు, నేను నిజంగా నిన్ను ఆ ఉద్దేశం తో చూడలేక పోతున్నా అన్నా.

గ్రాడ్యుయేషన్ చేస్తున్న రోజులు..
ఏంటి ఆంటీ విన్ను గాడు ఎక్కడ అని అడిగా చీర సరిగ్గా కట్టుకుంటూ. వినయ్ వాళ్ళ అమ్మ ఏమోనే తెలీదు, ఇంట్లోనే ఉన్నాడేమో ఇంకా అంది. నేను అవునా మధ్యాహ్నం నా డాన్స్ ప్రోగ్రాం పెట్టుకుని ఏమైంది వాడికి ఇంకా రాలేదు అని అంటూ చీర కట్టేసుకున్నా. వినయ్ అమ్మ ఇంకా మా అమ్మ ఇద్దరూ నన్ను చూసి ఎంత చక్కగా ఉన్నావే అని కాసేపు పొగిడారు. నేను వాళ్ళ పొగడ్తలు పెద్దగా పట్టించుకునే స్థితి లో లేను. ఎందుకు అంటే వినయ్ గాడు నిన్న మధ్యాహ్నం నుండి సరిగ్గా మాట్లాడడం లేదు. ఆ విషయమే నన్ను తొలిచేస్తూ ఉంది. కాసేపు ఉండండి ఇప్పుడే వస్తా అని మా అమ్మ ఇంకా వినయ్ అమ్మ కు చెప్పేసి రూం బయటకు వచ్చి వినయ్ గాడికి కాల్ చేశా. రింగ్ అయినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నేను ఛా వెధవ ఏం చేస్తున్నాడో అని అనుకుంటూ కాసేపు వెయిట్ చేసి మళ్ళీ కాల్ చేశా. ఈ సారి కూడా లిఫ్ట్ చేయలేదు. అంతలో నా క్లాస్ మేట్ వచ్చాడు నన్ను చూసి వావ్ రూపా, ఏంజెల్ లా ఉన్నావ్ తెలుసా అన్నాడు. నేను లేని నవ్వు ఒకటి తెచ్చుకుని చిన్నగా నవ్వా. వాడు తిరిగి నవ్వుతూ ఇంకో టూ హవర్సే ఉంది అంతా ఒకే కదా అన్నాడు డాన్స్ ప్రోగ్రాం ను గుర్తు చేస్తూ. నేను హా అంతా ఓకే అని చెప్పా. దాంతో వాడు సరే మళ్ళీ వస్తా అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. కాసేపట్లో వాడితోనే నేను కలిసి డాన్స్ వేయబోతున్నా. నిన్న ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వాడు డాన్స్ లో భాగంగా నా నడుము పట్టుకున్నాడు. అది చాలా కామన్ అని నాకు తెలుసు కానీ వినయ్ గాడికి అది నచ్చలేదు. నేను అలా వేరే మగాడితో ఉండడం వాడికి పెద్దగా నచ్చదు. ఆ విశయం నాకు తెలిసినా కూడా వాడిని నేనే ప్రాక్టీస్ చేసే చోటికి తీసుకు వచ్చా. నా ఉద్దేశం లో డాన్స్ పార్టనర్ నడుము టచ్ చేయడం పెద్ద విశయం కాదు కానీ వాడికి అది పెద్ద విశయం అవుతుంది అని నేను అప్పుడు ఊహించలేదు. ఎంతకీ ఫోన్ తీయక పోయే సరికి నేనే ఆటో లో వాడి ఇంటికి వెళ్ళాను. కాలింగ్ బెల్ కొడితే వచ్చి తలుపు తెరిచాడు.

6 Comments

  1. Dinni sex storie antara close ceyandi

    1. Velli vaani madda kudu
      “>

  2. Vijayraj Nuthalapati

    Nice story super

  3. Super story bro waiting for part 3 pls post quickly

  4. Bro sex content lekuda enduku bro
    Kudirithe add chey lekapotge close chey

Comments are closed.