పెళ్లి తరువాత..పెళ్లి ముందు..2 106

నేను ఇక మౌనంగా ఉండడం ఆపి తన వంక చూస్తూ అసలు నీకు ఏమైనా గుర్తు ఉందా నీకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయ్యిందని, మీ అన్నకు ప్రేమ పెళ్ళిళ్ళు అంటే ఇష్టం లేదు అని, నువ్వు నాకంటే వయసులో మూడేళ్లు పెద్దా అని కొంచెం అయినా గుర్తుందా అన్నా తన వంక కోపంగా చూస్తూ. తను నేను అలా అనగానే తలెత్తి చూసింది. నేను మామూలుగానే ఫేస్ పెట్టి మీ నాన్న ఇచ్చిన మాట గురించి కానీ, మీ అన్న గురించి కానీ, నువ్వనుకున్నట్లు జరిగితే వచ్చే ప్రాబ్లమ్స్ గురించి కానీ ఏమైనా కొంచెమైనా ఆలోచిస్తున్నావా నువ్వు ? అన్నా. తను సైలెంట్ గా చూసింది. నేను తనని చూసి అలాగే కంటిన్యూ చేస్తూ అయినా ఇన్నాళ్ల పరిచయం లో ఎన్నడూ లేనిది ఎందుకు నీకిప్పుడే ఇలా నాపై కోరిక కలిగింది ఎందుకు చెప్పు ? అన్నా. తను నా వంక అయ్యిందా అన్నట్లుగా చూసింది. నేను అది చూసి కొంచెం సీరియస్ గా ఇలా ఉంటే ఎలా రూప ? అన్నా. తను నన్ను చూసి ఎమైంది ఇప్పుడు కేవలం మా నాన్న ఇచ్చిన మాట తప్పుతున్నా, మా అన్నకు ఇష్టం లేకున్నా ప్రేమిస్తున్నా, నువ్వు నాకంటే చిన్న అయినా నిన్ను లవ్ చేస్తున్నా. అంతే కదా అంది ఇంకేమైనా ఉందా అన్నట్లుగా చూస్తూ..
నేను తన మాటలు విని ఆశ్చర్య పోతూ అంటే నీకు ఇవ్వన్నీ చేస్తున్నందుకు అస్సలు కొంచెం కూడా గిల్టీ లేదా అన్నా. తను లేదు అన్నట్లుగా చూసింది. నేను తనని చూసి ఒక్కసారి ఆలోచించు రూపా నువ్వు ఏం చేస్తున్నావో అంటూ తనని చూసి ఒకవేళ నువ్వు అనుకున్నదే చేస్తే మీ నాన్న ఏం కావాలి ? మీ అన్న ఏం కావాలి ? నిన్ను అంతలా ప్రేమించే నీ ఫ్యామిలీ పరువు ఏం కావాలి ? అసలు ఒక్కసారి అయినా ఆలోచించావా ? నువ్వు గానీ నన్ను పెళ్లి చేసుకుంటే మా నాన్న ఇంకా మీ నాన్న కనీసం రమణ అంకుల్ ముందు తలైనా ఎత్తుకోగలుతారా ? అని అన్నా. అది విన్న రూప కోపంగా ముఖం అటు వైపుకు తిప్పుకుంటూ ఒక్కసారి గాలి పీల్చి వోదులుతు నన్ను చూసి ఒక్కటి చెప్పు అంటూ నేను పుట్టాను అని వాళ్ళు మాట ఇచ్చారా ? లేక వాళ్ళు మాటిచ్చారు అని నేను పుట్టానా ? అంది. నేను అది విని ఉఫ్ అని అనుకుంటూ తల పక్కకు తిప్పుకున్నా. నేనెలా తల తిప్పుకోవడం చూసి రూప నన్ను చూస్తూ, నాకు కేవలం పెళ్ళి మాత్రమే ఫిక్స్ అయ్యింది వినయ్ పెళ్లైపోలేదు అంటూ నా వంక చూసింది. నేను తనని చూసి నీకు పెళ్లి కాలేదు అని నాకూ తెలుసు రూపా, కానీ నీకు అర్దం కావడం లేదు ఆ పెళ్లి వెనుక ఉన్న మాట గురించి అన్నా. అలా అనగానే రూప కోపంగా నన్ను చూస్తూ ఏంట్రా మాట మాట అంటూ ఒకటే అంటున్నావ్ ? నువ్వేమైనా ఇచ్చావా వాడికి మాట చెప్పు ? అంది కోపంగా. అంతే నేను వెంటనే సైలెంట్ అయిపోయా. తను కూడా వెంటనే నార్మల్ అవుతూ సైలెంట్ అయిపోయింది. కాసేపు ఇద్దరం మాట్లాడుకోలేదు. కాసేపటికి రూప నా బుజం మీద చెయ్ పెడుతూ నిజమే మా నాన్న మాట ఇచ్చాడు, మా అన్న కు ప్రేమ అంటే పడదు, నువ్వు నా కంటే చిన్న వాడివి, కానీ నాకు ఇవ్వన్నీ ప్రాబ్లమ్స్ లా కనిపించడం లేదు. నన్నేం చేయమంటావ్ చెప్పు అంది.

6 Comments

  1. Dinni sex storie antara close ceyandi

    1. Velli vaani madda kudu
      “>

  2. Vijayraj Nuthalapati

    Nice story super

  3. Super story bro waiting for part 3 pls post quickly

  4. Bro sex content lekuda enduku bro
    Kudirithe add chey lekapotge close chey

Comments are closed.