పెళ్లి తరువాత..పెళ్లి ముందు..2 106

నేను ఎక్కడికి వెళ్ళినా వాడు లేకుండా వెళ్ళే దాన్ని కాదు, నాకు ఏ ఎమోషన్ వచ్చినా వాడితోనే షేర్ చేసుకునే దాన్ని, ఎక్కడికి వెళ్ళినా నాకు వాడు ఒక తోక లా వస్తాడు అని అందరూ అనేవాళ్ళు. కానీ నేను గానీ వాడు గానీ అవేం పట్టించు కునే వాళ్ళం కాదు. ఎప్పుడైనా వాడు కోపం తెప్పిస్తే డైరెక్ట్ గా వాడ్ని కొట్టేసే దాన్ని, అయినా సరే పాపం వాడు నన్ను ఏం అనేవాడు కాదు, బాధ అనిపిస్తే వెళ్ళి వాడి రూమ్ లో ఏడ్చుకుంటూ కూర్చునే వాడు. అంతేగానీ నాకు ఎదురు చెప్పే వాడు కాదు, ఏడ్చిన వెంటనే మళ్ళీ నా దగ్గరికే తిరిగి వచ్చి రూపా రూపా అంటూ తిరిగే వాడు. నాకు అది బాగా సంతోషాన్ని ఇచ్చేది. నేను వాడ్ని కొట్టినా కూడా ఆ తరువాత అంతకంటే బాగా వాడిని కేర్ చేస్తా అని వాడికి తెలుసు అందుకే వాడు నన్ను ఎప్పుడూ పూర్తిగా ద్వేషించే వాడు కాదు. ఒకరోజు వాళ్ళింట్లో వాళ్ళ అమ్మ తిట్టింది అని అర్థ రాత్రి ఇంట్లో నుండి ఎవ్వరికీ చెప్పకుండా బయటకు వచ్చేసి మా ఇంటికి వచ్చాడు. అది కూడా దొంగతనంగా మిద్దె పై నుండి వచ్చాడు. అలా రావడానికి నేను కూడా సహాయం చేసాను అనుకోండి. పొద్దున చూస్తే ఇంట్లో వాడు కనిపిస్తలేడు అని వాళ్ళ అమ్మ ఏడ్వడం మొదలు పెట్టింది. వాడు నాతో నేను ఇక్కడ ఉన్నా అని చెప్పకు అన్నాడు. నేను సరే అని వాళ్లకు కూడా విశయం చెప్పలేదు. వాళ్ళు ఇంట్లో నుండి నేను పారిపోయాను అని అనుకున్నారు. అలా అనుకుని టెన్షన్ పడుతూ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం వరకు వెళ్లారు. కానీ అంతలోనే నేను ఇక మరీ ఎక్కువ చేస్తే బాగోదు అని అనుకుని వాళ్లకు విశయం చెప్పేశా. అది విన్న మా పేరెంట్స్ మా ఇద్దరినీ చెడా మడా తిట్టారు. విన్ను గాడ్ని అయితే వాళ్ళ అమ్మ ఇంటికి తీసుకు పోయి ఫుట్ బాల్ ఆడుకుంది. తరువాత రోజు వాడు మళ్ళీ అదే చేసాడు. ఈ సారి దొంగతనంగా కాకుండా డైరెక్ట్ గా మా ఇంట్లోకి వచ్చి మా అమ్మతో నేను రూపా తోనే పడుకుంటా అని అన్నాడు. మా అమ్మ వాడి అమ్మకు ఫోన్ చేసింది. వాడి అమ్మ వచ్చి వాడికి ఇంకో రెండు తగిలించి వాళ్ళ ఇంటికి తీసుకు పోయింది. కానీ వాడు అక్కడితో ఆగలేదు బెడ్ రూం లో కూర్చుని రూపా రూపా అని గట్టిగా అరవడం మొదలు పెట్టాడు. వాళ్ళ అమ్మ వచ్చి ఇంకోసారి రూపా అన్నాఓ కాళ్ళు చేతులు విరగ్గొడతా అని బెదిరించింది. కానీ వీడు తగ్గలేదు. ఇంకా గట్టిగా రూపా రూపా అని అరిచాడు. అదంతా చూస్తున్న వాళ్ళ నాన్న ఎందుకే వాడిని అరిపిస్తావ్ అని అంటూ పోరా పోయి దానితోనే పడుకో పో అని అన్నాడు.

6 Comments

  1. Dinni sex storie antara close ceyandi

    1. Velli vaani madda kudu
      “>

  2. Vijayraj Nuthalapati

    Nice story super

  3. Super story bro waiting for part 3 pls post quickly

  4. Bro sex content lekuda enduku bro
    Kudirithe add chey lekapotge close chey

Comments are closed.