రియా – part 4 56

“నిజంగా రియా నిజంగా పెడతాను….”అన్నాడు అభి బెదిరిస్తూ

“పెట్టమనే గా నేనూ చెబుతుంది…”అంది కొంటెగా

“నిజంగా పెడతాను….చెబుతున్నా….”అన్నాడు అభి

“ఉష్…పెట్టు….”అంది రియా

“పెట్టెస్తున్నా……”అన్నాడు అభి….మరునిమిషం అభి బుగ్గ పై గట్టిగా ఒక ముద్దిచ్చింది రియా

షాక్ అయ్యి చూస్తుండిపోయాడు అభి….”ఏంటి అలా పెట్టెసావ్….?”నమ్మలేనట్టుగా అడిగాడు అభి

“నువ్వు ఇవ్వట్లేదు గా…అందుకె….సరే ఇంక పో….”అని రూం లోంచి అభి ని బయటకి తోసింది….

ఆ రోజు సాయంత్రం……

అప్పటికే రియా కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు……ఇంతలో రియా రానే వచ్చింది….దివి నుంచి దిగి వచ్చిన తారక లా……ఆమెని చూస్తుంటే అందమే అసూయ పడుతుందేమో అన్నట్లుంది…..అందరి సమక్షంలో కన్నుల పండుగగా వాళ్ళిద్దరి నిశ్చితార్థం జరిగింది……..

వారం తర్వాత…..అభి యూ ఎస్ కి వెళ్ళె టైం రానే వచ్చింది…అతని ఫ్లైట్ రాత్రికి అనగా……ఆ రోజు వుదయం….

ఎవరో తన భుజం తట్టి లేపడం తో ఉలిక్కి పడి నిద్ర లేచాడు అభి….ఎదురుగా రియా

“హే…నువ్వేంటిక్కడ…అదీ ఈ టైం….లో….?”అని గడియారం 4:30 గంటలు చూసి అడిగాడు అభి

“నువ్వు ముందు రా….”అని చెయ్యి పట్టి బాల్కని లోకి తీసుకెళ్ళింది రియా

“దిగు…..”అని నిచ్చెన చూపించింది….”బయటకి వెళ్ళాలి అంటే ఇలానే వెళ్ళాలా…?డోర్ నుంచి వెళ్ళొచ్చు కదా…?”చలికి వణుకుతూ అడిగాడు అభి

“నువ్వు దిగుతావా…?లేక నన్నేల్లి పోమంటావా…?”కన్నెర్ర చేస్తూ అడిగింది రియా

“సారీ…పద వెళ్దాం…”అని నిచ్చెన దిగి ఆ తర్వాత రియా ని అనుసరించి కార్ ఎక్కాడు అభి….

“ఎక్కడికి వెళ్తున్నాము….అదీ ఇంత పొద్దున్నే…?”అడిగాడు అభి

“కాసేపు నోరు మూస్కో….”అంది రియా సీరియస్ గా…మూతి ముడుచుకుని కూర్చున్నాడు అభి

“అభి…..అలా కాదు రా…”అంది బుజ్జగిస్తూ రియా

అభి ఏం మాట్లాడలేదు…….కార్ సడన్ గా ఆపి…….అభి చెయ్యి పట్టుకుంది రియా….రియా కళ్ళలోకి చూశాడు అభి….

“అభి…..”ఆగింది రియా

“ఏంటి…?”అన్నాడు అభి….

“అది……అది”అంది రియా

“ఏంటది…?”అడిగాడు అభి

తన సీట్ బెల్ట్ తీస్తూ…..అభి ముఖన్ని తన చేతుల్లోకి తీస్కుంది రియా…..అనుమానంగా చూశాడు అభి….ముందుకు వంగి….అభి ని గట్టిగా హగ్ చేస్కుంటూ…చెవిలో మెల్లగా “ఐ లవ్ యూ….”చెప్పి బుగ్గ పై ఒక ముద్దిచ్చింది రియా…..ఒక 2 నిమిషాల కౌగిలి తర్వాత……వెనక్కి తగ్గి…అభి కళ్ళ లోకి సూటిగా చూస్తూ….”రా….”అని డోర్ తీసి బయటకి నడిచింది…తనని అనుసరించాడు అభి…..

బయటకి వస్తూనే అభి చేతిని తన చేతిలోకి తీస్కొని….అతని భుజం మీద తల వాల్చి…..అప్పుడె వస్తున్న సూర్యుడ్ని చూస్తూ……మళ్ళి…అభి ని గట్టిగా కౌగిలించుకుంది…..”ఈ క్షణం ఇలా గడిచిపోతే…ఎంత బాగుండొ….”అని మురిసిపోయింది…..

2 గంటలు మాటలు లేని మౌనం లో….మనసులతో మమేక మైపోయిన పిమ్మట….ఇద్దరు తిరిగి ఇళ్ళకి వెళ్ళిపోయారు….ఆ సాయంత్రం…..మనసు సహరించకున్న విమానం ఎక్కేసి యూ ఎస్ వెళ్ళిపోయాడు అభి….

Updated: August 21, 2021 — 3:07 am

3 Comments

  1. Band chey anna lowda laagundi stories

  2. పరమ బోర్

  3. Anna ramulu autograph continue cheyandi plz,ramu jareena tho ramu anitha tho affairs,ramu anjali deepikalato Pragathi to syamala tho dengudu rayandi plz ramu manasa jareena pregnancy encounters rayandi plz

Comments are closed.