“విజయ్…ఐ యాం సారి నా వల్ల నువ్వు…”
ఆపమన్నట్టు చెయ్యి చూపించాడు విజయ్….ఏం చెబుతాడా అని టెంషన్ తో విజయ్ వంక చూస్తుంది రియా…!
25.మోసం..
“ఏం మాట్లాడుతున్నావ్….రియా….నువ్వు చెప్పిందంతా అబద్దం అని చెప్పు…నేను కలగంటున్నానని చెప్పు….”అని తన భుజం పట్టుకుని కన్నీళ్ళు దిగమింగుకుంటూ అడిగాడు విజయ్
“ఐ యాం సారీ విజయ్…”అతి కష్టం మీద చెప్పింది రియా
ఆ మాట వినడం తోనే అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు విజయ్…..వెంటనే అతని వద్దకు పరుగుతీసింది రియా….”వద్దు నా దగ్గరికి రావొద్దు……”అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు…..వెనకనే అతన్ని అనుసరించింది రియా…
ఒక్క వుదుటున వెనక్కి తిరిగి…..”డోంట్ ఫాలో మి….”అని అన్న విజయ్…వడి వడి గా ముందుకు అడుగులు వేశాడు….
వెంటనే రియా అభి కి కాల్ చేసింది…”ద నెంబర్ యూ ఆర్ కాలింగ్ ఈస్ కరెంట్లి బిసి..ప్లీస్ ట్రై ఎగైన్ లేటర్…”అని రావడం తో…..వెంటనే ఒక మెసేజ్ పెట్టింది…”కాల్ మీ వెన్ యూ ఆర్ ఫ్రీ…”
షాలిని తో ఫోన్ మాట్లాడుతున్న అభి తన మెసేజ్ చూసినా కూడా పట్టించుకోలేదు…
గంట తర్వాత….ఫోన్ పెట్టెసిన అభి కాల్ చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు……ఇంతలో తన ఫోన్ రింగ్ అయ్యింది….
“నీతో మాట్లాడాలి,…మీ ఇంటి బయట వెయిట్ చేస్తున్నా…నువ్వు రా….”అని చెప్పి ఫోన్ కట్ చేసింది రియా
ఒక అరగంట గడిచాక కిందకి వెళ్ళాడు అభి…..చలిలో అక్కడున్న ఫుట్ పాత్ పైన కూర్చుని వుంది రియా….అభి రావడంతోనే…లేచి నిల్చుంది…..”
“ఏంటి…?”అడిగాడు అభి….అభి లేట్ గా వచ్చాడన్న కోపమున్నా…..తమాయించుకుని….”నేనొక పని చేశాను…దాని వల్ల ఏం జరుగుతుందో నాకర్థం కావట్లేదు…”అంది రియా ఆందోళనగా
“ఐతే నేనేం చెయ్యాలి…”చిరాకుగా ముఖం పెట్టి అడిగాడు అభి
Band chey anna lowda laagundi stories
పరమ బోర్
Anna ramulu autograph continue cheyandi plz,ramu jareena tho ramu anitha tho affairs,ramu anjali deepikalato Pragathi to syamala tho dengudu rayandi plz ramu manasa jareena pregnancy encounters rayandi plz