రియా – part 4 56

“అభి నన్ను వదిలేసి వెళ్ళిపోతావా…?”మనసులో అనుకున్న మాట తెలియకుండానే రియా నోట్లోంచి వచ్చేసింది

అంతే సడన్ గా బండి ఆగింది….వెంటనే వెనక్కి తిరిగి ఆమె కళ్ళలోకి విస్మయంగా చూశాడు అభి

“వెళ్ళొద్దా రియా..?”ఆశగా అడిగాడు అభి

“అయ్యొ…అదేం లేదు…ఏదో ఆలోచిస్తూ అనేసాను అంతే….నువ్వెళ్ళకపోతే ఎలా అభి….”అంది రియా వెంటనే….

“నిజం చెప్పు రియా…..నిజంగా నీకు నేను వెళ్ళడం ఇష్టమా…?”అడిగాడు అభి

“వుండమని చెప్పలేను…అలా అని నువ్వెళ్తుంటే తట్టుకోలేను…”అని మనసులో అనుకుంది రియా

“నువ్వు వెళ్ళాలి అభి……”అంది రియా

మారు మాట్లాడకుండా బైక్ స్టార్ట్ చేసి ముందుకి పోనిచ్చాడు అభి…..ఇల్లు రాగానే బైక్ దిగిన రియా…..”బై….అభి”అంది భారంగా….

అభి అదేమి పట్టించుకోలేదు…కనీసం తన వైపు కన్నెత్తి కూడా చూడకపోయేసరికి….అభి చెయ్యి పట్టుకుని”ఏమయ్యింది రా…?ఎందుకలా వున్నావ్…?”అడిగింది రియా

తల అడ్డంగా వూపాడు అభి…..”అభి….నా ముఖం చూడు….”అంది రియా బాధగా….తన వైపు చూసిన అభి కళ్ళలో నీళ్ళు……

“నాకు తెల్సు అభి….నువ్వు నీ కలనైనా వదులుకుంటావేమో గానీ నన్ను వదులుకోవు అని…కాని ఏం చెయ్యను వుండమని నేను చెప్పలేను…”అని మనసులో అనుకోని…..అభి ముఖాన్ని తన రెండు చేతుల్లోకి తీస్కోని అతని నుదిటి మీద ముద్దు పెట్టింది రియా

***

ఉదయం 6:30

“రేయ్…లే రా…!”అని అభి వాళ్ళమ్మ నిద్ర లేపడం తో…”అబ్బా…ఏమయ్యిందమ్మా…పొద్దున్నే ఈ నస ఏంటి నాకు…?”అన్నాడు అభి చిరాకుగా

“రాత్రి కి నిశ్చితార్థం వుంది…నువ్వింకా డ్రెస్ తెచ్చుకోలేదు…లే లేచి రెడి అవ్వు….”అంది వాళ్ళమ్మ

Updated: August 21, 2021 — 3:07 am

3 Comments

  1. Band chey anna lowda laagundi stories

  2. పరమ బోర్

  3. Anna ramulu autograph continue cheyandi plz,ramu jareena tho ramu anitha tho affairs,ramu anjali deepikalato Pragathi to syamala tho dengudu rayandi plz ramu manasa jareena pregnancy encounters rayandi plz

Comments are closed.