తన కోసం 2 266

ఆకాంక్ష ఈ ప్రేమ పిచ్చి ప్రవర్తన కారణం లేక పోలేదు
పెళ్లి అయ్యి ఇంటికి వచ్చిన కొత్త కోడలిని
కోడలిగా కాకుండా సొంత కూతురుకి మళ్ళే చూసుకుంది అన్నపూర్ణమ్మ
పెళ్లి అయిన రెండు నెలల వరకు కోడలిని కిచెన్ వైపు కూడా రానివ్వలేదు కనీసం చీపురు కూడా ముట్టనీవ్వలేదు

కొడుకు కంటే ఎక్కువగా కోడలినే ప్రేమగా ప్రాణంగా చూసుకునేది ఎప్పుడూ ఆకాంక్ష తిన్నదా లేదా సంతోషంగా ఉందా లేదా తన భర్తతో గడుపుతుందా లేదా అనే ఉండేది అన్నపూర్ణమ్మకు

ఆకాంక్ష ఏదైనా పని చేస్తూ ఉంటే ముందు నువ్వు వెళ్ళి పడుకో మనో లేక టీవీ చూడమనో లేదంటే కోడుకుతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చో మనో చెప్పేది

ఆ విధంగా ఆకాంక్ష అత్త కాస్త అత్తమ్మా గా మారింది ఒక్కోసారి ఆవిడా ప్రేమ ఆప్యాయత చూసి ఆకాంక్ష కళ్ళలో నీళ్ళు తిరిగేవి

అన్నపూర్ణమ్మ సున్నితంగా మందలిస్తూ పిచ్చి పిల్ల
నేను ఎవరికోసం చేస్తున్నాను నాకంటూ ఎవరున్నారు చిన్న వయసులోనే భర్త పోయాడు
కోడుకు పెంచి పెద్ద చేసాను
నువ్వు వాడు సుఖంగా సంతోషంగా ఉంటే అదే చాలు అంటూ చిలిపిగా ఆట పటిస్తూ అనేది
నా కోసం అని తొందరగా పడకుండా మీకు ఓపిక ఉన్నంతవరకు సంతోషం గడిపి అప్పుడు నాకు ఒక పాపాయిని ఇవ్వండి చాలు అంటూ చిలిపిగా ఆట పట్టించేది

అన్నపూర్ణమ్మ పోయిన నెలరోజుల వరకు ఆకాంక్ష మామూలుగా రాలేక పోయింది
ఆకాష్ కూడా అంతే కానీ ఆకాంక్ష పరిస్థితి మరి దారుణంగా ఉండటంతో కాస్త ఆకాష్ ఆఫీస్ పని నలుగురితో కలుస్తూ మాట్లాడుతూ ఉండటం చేత అతను తొందరగానే కొలుకుని ఆకాంక్షను సముదాయించడం చేస్తున్నాడు

మారో నెల గడిచింది ఆకాష్ ఆఫీస్ లో పని వత్తిడి పెరిగింది ప్రమోషన్ కోసం వేరే నగరాలకు క్యాంపులు వెళ్ళడం మొదలుపెట్టాడు
ఈ రెండు నెలల కాలంలో ఆకాష్ ఆకాంక్ష అసలు శారీరకంగా కాపురం చేసింది లేదు

అలా ఆకాష్ ఒక రోజు రెండు రోజుల నుంచి పది రోజుల క్యాంప్ వేసే వరకు వచ్చాడు
అలా మొదటి సారి పది రోజుల క్యాంప్ వెలుతూ ఆకాంక్షకు జాగ్రత్త ఉండమని సమయానికి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలాని చెప్పి వెళ్ళాడు

ఇక్కడ ఆకాంక్ష గురించి చెప్పుకోవాలి
ఆకాంక్ష అత్తగారు అన్నపూర్ణమ్మ ఎలా అయితే నిద్రలోనే ప్రాణాలు వదిలారో అలాగే ఆకాంక్ష అమ్మా కూడా చనిపోయింది తండ్రి చనిపోయిన కొద్ది కాలానికే అప్పుడు చిన్న పిల్లగా ఉన్న ఆకాంక్ష ఇలాగే అమ్మను ఎంత లేపిన లేవలేదు తెలియని వయసులో పెద్ద దిగ్భ్రాంతికరమైన కష్టం చూసింది

ఎలాగో మేనమామ గారి ఇంట్లో పెరిగి పెద్దదైంది
డిగ్రీ వరకు చదువుకుంది తరువాత ఆకాష్ తో పెళ్ళి ఆనందంగా సంతోషంగా సాగుతున్న ఆమె జీవితంలో అన్నపూర్ణమ్మ పోవడం ఆకాంక్షకు చాలా పెద్ద షాక్ తగిలిందనే చెప్పాలి

దాదాపు నాలుగు సంవత్సరాలు ఇద్దరూ మనుషులు చాలా సమయం కలిసి ఉండటం కష్టసుఖాలు మంచిచెడులు చెప్పుకోవడం
మూలన ఇద్దరి మధ్య అనుబంధం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు

అత్తగారు అన్నపూర్ణమ్మ పోయాక ఆకాంక్ష దాదాపు ఇంట్లో ఒంటరిగానే ఉండేది తరచూ ప్రతి సందర్భంలోనూ ప్రతి విషయంలోనూ ఆమెకు అత్తగారితో గడిపిన విషయాలు సంఘటనలు జ్ఞాపకం వచ్చేవి

అత్తగారు హాల్ లో కూర్చున్ని టీవీ చూస్తున్నట్లు
వంటగదిలో తన పక్కనే కూరగాయలు కట్
చేస్తూ తనకి సాయంగా పక్కన నిలుచునట్లు
అనిపించేది అత్తగారు పోయారు ఇంకా తిరిగి రారు అని తెలిసిన ఆకాంక్ష మనసు ఎందుకో ఆవిడా జ్ఞాపకాలతో సతమతమైపోతొండేది
రోజు మన పక్కనే ఉండి మన మంచి చెడులు చూసే వ్యక్తి సడెన్ గా ఇప్పుడు లేకుంటే ఇంకా రారు అని తెలిసి ఎలా ఉంటుందో ఇప్పుడు ఆకాంక్ష పరిస్థితి అలానే ఉంది
ఒక్కసారిగా ఒంటరితనం వచ్చినట్లు ఉంది
ఆకాష్ ఉన్నప్పుడు కాస్త ప్రర్వలేదు కానీ ఆకాష్
ఆఫీస్ కు వెళ్ళాకా ఆకాంక్ష మరింత ఒంటరితనానికి గురై బాధపడేది

ఎక్కువగా ఇంట్లో ఉంటే అత్తగారు అన్నపూర్ణమ్మ గుర్తుకు రావడంతో ఇంటి బయట ఖాళీ స్థలంలో మొక్కలు పూల చెట్లకు పళ్ళ చెట్లకు నీళ్ళు పెడుతూ వాటితో ఎక్కువగా
కాలం గడిపేది ఎందుకంటే అత్తగారు గుర్తుకు రాని
చోటు అది మాత్రమే తనకు చిన్నగా ఇంట్లో కంటే పెరట్లోనే సాధ్యమైనంత వరకు ఎక్కువగా ఆకాంక్ష గడపడం అలవాటు చేసుకుంటున్నా రోజులవి

అలా ఆకాష్ లాంగ్ క్యాంప్ వెళ్ళిన మొదటి సారి రెండో రోజు ఉదయం లేచిన ఆకాంక్ష తొందరగా తినడానికి ఎదో చేసుకుని ఇంటి చుట్టూ చిన్నగా నడుస్తూ అప్పుడప్పుడు చెట్ల ఎండిన ఆకులు గిల్లుతూ మట్టి కెలుకుతూ మొక్కలకు నీళ్ళు పెడుతూ తన మనసు ప్రశాంతంగా ఉంచుకోవాడానికి ప్రయత్నిస్తూ తన లోకంలో తాను ఉంది