తన కోసం 2 266

సరే మీకు చెప్పడం ఇష్టం లేక పోతే వద్దులే

అబ్బా అదేం లేదు ఆకాంక్ష వదిలే మరి ఫీల్ అవుతావు ఏమో చెబితే

ఏం కాను కానీ చెప్పు పర్వాలేదు

కొప్పడకూడదు మరి

మరి నీ కంటికి అంతా రాక్షసిలా కనిపిస్తున్నానా

అయ్యో అలా ఏం లేదు అదే అందంగా కనిపిస్తున్నారు ఒక దేవతలా వెలిగిపోతూ

ఓ అలాగా ,,,, కొత్త వ్యక్తి మెచ్చుకోవడంతో ఆకాంక్ష మనసుకు హాయిగా ఉంది వాతావరణం ఆహ్లాదకరంగా మారింది

ఇంకా ,,,,
ఆకాంక్షకు ఇంకోకరు తనను ఇలా చెప్పడం కొత్తగా ఉంది మనసు చిత్ర విచిత్రంగా పోతూ ఉంది తొలిసరి ఇంకా ఏం చేబుతాడో అని ఎదురు చూస్తూ ఉంది

దీని కోసమే ఎదురు చూస్తున్నట్టు ఉన్న ఇంద్రనీల్
నిజంగా నువ్వు చాలా అందంగా ఉన్నాం ఆకాంక్ష
నీ అందమైన ముఖం చూస్తూ ఎంత సమయమైనా గడిపేయవచ్చు మీ వారు చాలా అదృష్టవంతుడు
అని ఆడవారిపై వేసే మొదటి వలపు బాణాలను చాలానే వదిలాడు

అమ్మో అయితే నువ్వు నన్ను చూడటానికే వస్తున్నావా రోజు
ఆకాంక్ష మనసు మొదటి సారి అతను అవును అని చెప్పుతాడనే అనుకుంటుంది ఇప్పుడు

నీల్ ……..లేదు లేదు…….

ఇప్పుడు ఆకాంక్ష కళ్ళలో కాస్త నీరాస అది గమనించిన నీల్
లేదు అని అబద్దం చెప్పాలని ఉంది కానీ ఎంజిల్ లాంటి నీకు అబద్దం చెప్పలేక పోతున్నా
సిగరెట్ తో అందమైన నిన్ను చూడ్డం డబుల్ కిక్ లా ఉంది నాకు దానికి తోడు నీ చేతి కాఫీ
చాలా అద్భుతం

వండర్ పుల్ పకృతి
వండర్ పుల్ కాఫీ
వండర్ పుల్ అమ్మాయితో
షేర్ చేసుకోవడం ఒక అనిర్వచనీయమైన అనుభూతి

అమ్మో చాలానే గమనించారు ఇంతకీ నేను అందంగా ఉన్నాను అంటారు అంతేగా
పొగడటం సూటిగానే చెప్పోంచుగా మీ అభిప్రాయం చెప్పడంలో తప్పు లేదు లే
థాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్

నీల్……..ఉమ్… అంతే మీ అందమైన ముఖాన్ని కళ్ళలో బంధించాను ఆ కొన్ని క్షణాలు

నా రూపాన్ని కళ్ళలో బంధించారు అంతటితో
ఆగితే చాలు
ఇంతకీ మీరు చేసే పనేంటో చెప్పలేదు

బిజినెస్ మా డాడీకి ఉంది ఆయనకు సహాయంగా ఉంటాను

ఓ అలాగా