తన కోసం 2 266

ఈ కొన్ని రోజుల పరిచయంలో అప్పుడప్పుడు అతను సరదాగా జోక్ వేసినప్పుడు ఆమెతో సెటైరికల్ గా మాట్లాడినప్పుడు ఆమె చనువుగా అతని భుజల మీద కొట్టేది
అతను కూడా ఆమె చేతులు మాత్రమే తాకి నట్లు అప్పుడప్పుడు ఆమెకు గుర్తు మొత్తానికి అతనిమీద అప్పటికి ఒక సాఫ్ట్ కార్నర్ తో కూడిన స్నేహం తాలుకు మంచి ఒపీనియన్ మొదలైంది ఆకాంక్షలో

రోజు ఈ టైం కి వచ్చే వాడు ఇంకా రాలేదు అని ఆకాంక్ష ఎదురుచూస్తు ఉంది మెల్లగా టైం గడిచిపోతూ ఆమెలో అసహనాన్ని పెంచింది అతని పట్ల
మధ్యాహ్నం అయింది
తనకి చెప్పకుండా అతను ఊరు వెళ్ళి పోయాడు అనుకుంది

కానీ రోజు అతని మాటలలో ఆమె పట్ల ఆరాధన
చూపులో ఆసక్తి అప్పుడప్పుడు ఆమెకు ఇచ్చే గౌరవ ప్రాధాన్యత ఆమె గమనించేది దాని వల్ల అతను ఆమెను చెప్పకుండా వెళ్ళి ఉండడు అనుకుంటుంది అదే సమయంలో అతని గురించి కాస్త ఎక్కువగానే ఆలోచిస్తున్నాను అనే ఆలోచన కూడా వచ్చింది

మళ్ళీ ఆమె మనసులో ఒంటరితనం తాలుకు నిరాశా భావాలు అలుముకోవడం మొదలైయ్యాయి అవి కాస్త ఇంద్రనీల్ మీద మెల్లిగా అధికారంతో కూడిన కోపంగా మారుతున్నాయి

దానికి కారణం కూడా ఇంద్రనీల్ తన శాయశక్తులా ఆమె అందాన్ని ఆమెను రోజు ఎంతగానో మెచ్చుకోవడం పొగడటం ప్రతి చిన్న పెద్ద విషయాలకు ఆమెను ఎక్కవ చేసి చెప్పడం
బాగా అలవాటు చేసాడు
ఒక రకంగా ఆమె అతని మాయ మాటలు అతని జీవితం పట్ల పొంతన లేని వివరాలు రోజు
వినకుండా ఉండలేదు అనేలా

సమయం గడుస్తూ ఉంది మధ్యాహ్నం దాటి సమయం సాయంత్రం వైపు పరుగులు తీస్తోంది
ఆమె ఆలోచనలు కూడా అతని మీద అజమాయిషీ చేస్తూ పరిగేడుతున్నాయి

కాలం నడుస్తూ ఉంది
మెల్లిగా చీకటి పడుతుంది చీకట్లో జరిగే తప్పుడు అనర్థాలకు సాక్షిగా కాలం మారబోతోంది
ఈ రోజు ఆమె అనవసరపు ఈ నిరీక్షణ కారణంగా

ఆకాంక్ష వంటింటి ఆరుబయట మెట్ల దగ్గర కూర్చుని ఉంది
ఇంద్రనీల్ ఒక సంచితో వచ్చాడు
గేట్ తీసిన శబ్దానికి ఆకాంక్ష అటువైపు చూస్తూ
అధికారిక స్వరంతో ఈ టైం లో ఎందుకు వచ్చాం
ముందు ఇక్కడినుండి వెళ్ళు అంది అదురుతున్న గొంతుకతో

ఇంద్రనీల్ కు ఆ ఒక్క మాటతో ఆమె ఉదయం నుంచి తన కోసం ఎదురు చూసిందని తన రాక ఆమెకు ఇష్టమైనవి అతనితో గడపడం ఇష్టపడుతుందనీ
అతను ఎదురు చూసిన సమయం ఇదేనని
ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చాడు
ఇంకా ఆమెను లోంగదీసుకుని మంచం మీద ఆమె అందాలను ఒక్కొకటిగా నలపడమే తరువాత అని నిర్ధారణ వచ్చాడు

ఆమె ఒంటరితనాన్ని అమాయకత్వాన్ని మానసిక ఒత్తిడి స్థితి సులువుగా అంచనా వేసి ఆమె ఇంటికి సంబంధం లేని ఒక వ్యక్తి కోసం ఎదురు చూసేలా చెయ్యడంలో అతను విజయం సాధించాడు

ఆకాంక్ష కూడా అప్పుడే అత్తగారు పోయి జీవితం అంటే ఇంతే పుట్టడం చావడం అనే సబ్ కాస్సేష్ మెదడు ఆలోచనలతో సతమతమవుతూ ఉండేది తన ముందు వెనుక జీవితంలో జరిగిన బాధాకర విషయాలు తన మెదడు నుండి ఎవరైనా డిలీట్
చేస్తే బాగుంటుంది అనే భావనలో బ్రతికేది
అలాంటి అయోమయ మానసిక ఒత్తిడి స్థితిలో ఉన్న ఆకాంక్షకు ఇంద్రనీల్ జీవితం పట్ల బాధ్యత లేని మాటలు ఉన్నంతలో సుఖంగా గడపాలి ఎంజాయ్ చేయాలి అనే ఆలోచనలు ఆమెలో నాటి ఆమెకు తెలియకుండానే అతన్ని ఆకర్షించేలా చేసాడు

ఆకాంక్ష ఉండే ఆ పరిస్థితుల్లో అతను కాక పోయినా(ఆడేన మగనా )మరేవరైన సరే వారికి వారికి చేరువైయ్యేది తన బాధ నుంచి బయటపడటానికి
తన ప్రయత్నంగా ఒంటరిగా ఉండే అమ్మాయి మనసు ఆకర్షించడం చాలా సులువు ఎవరికైనా
కానీ ఆడదాని శరీరం మాత్రమే చూసే ఇంద్రనీల్ పరిచయం కావడం ఆమె దురదృష్టమనే చెప్పాలి

ఇంద్రనీల్ తొందరగా నడిచి వచ్చి అతను తెచ్చిన బ్యాగ్ పక్కన పెట్టి
సారీ ఆకాంక్ష ఈ రోజు నా పుట్టిన రోజు అమ్మానాన్నతో ఇప్పటిదాకా గడిపి నీ కోసం మళ్ళీ ఇంతదూరం వచ్చాను అన్నాడు ప్రాధేయపూర్వకంగా ఆమె ముఖం చూస్తూ ఆమెకు మారో మాట మాట్లాడానికి అవకాశం లేకుండా అతని ఆటను మొదలు పెడుతూ
నిజంగా అతని పుట్టిన రోజు కాదు ఈ రోజు
అతను సంవత్సరానికి ఇలాంటి దొంగ పుట్టిన రోజులు చాలా ఉంటాయి

అప్పటిదాకా కోపంగా ఉన్న ఆకాంక్ష వెంటనే మెత్తబడింది
కానీ అంతలోనే కోపంగా నీ బర్త్ డే అయితే నాకెందుకు వేరే ఏ డై అయితే నాకెందుకు
నాకేమైనా చెప్పావా ఒక్కమాటేన అని అనిందే కానీ అది తెచ్చి పెట్టుకున్న కోపం అని ఇద్దరికీ బాగా తెలుసు