తన కోసం 2 266

.
ఆ నేనేం పనిలేకుండా తిరగడం లేదులే
మా అంటీకి ఆరోగ్యం బాగా లేక పోతే చూడ్డానికి వచ్చాను మా అమ్మతో కలిసి అని నీల్ నమ్మబలుకుతూ చెప్పాడు ఫీల్ అవుతున్నట్లు నటిస్తూ

అయ్యో నేను ఎదో ఉరికే అడిగానులే బాబు
దానికి ఇలా ఫీల్ అవుతారా సరే నీ బాధ పోవడానికి ఈ రోజు మా ఇంట్లోనే భోజనం చేసి వెళ్ళేది ఓకే
అంటూ ఇంటి లోపలికి ఆహ్వానించింది
అనాలోచితంగా మోస పోతూ

ప్రతిగా వద్దు వద్దు అంటూనే ఇంద్రనీల్ ఆకాంక్ష ఇంట్లో ప్రవేశించి మొదటిసారి భోజనం చేసాడు
అలాగే సాయంత్రం దాకా ఆమెతో గడిపాడు

అలా ఆ రోజు నుండి ఇంట్లో కూడా తిరగడం మొదలు పెట్టినా అతడు చిన్నగా చనువుగా ఆకాంక్షను పొగుడుతూ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆమెతో గడపడం అతనికి వీలైనంత ఎక్కువగా ఆమెకు అతని సాహచర్యం
అలవాటు చేస్తున్నాడు

ఆకాంక్ష కూడా తనకు తెలియకుండానే అతని సాన్నిహిత్యం కోరుకోవడం మొదలు పెట్టింది
అలా నాలుగు రోజులు గడిచాక ఆకాష్ క్యాంప్ నుంచి వచ్చి రెండు రోజులు ఉండి వెళ్ళిపోయారు
మారో సారి క్యాంప్ కి

ఇంద్రనీల్ రోజు రావడం వచ్చే ముందు ఆమెకు ఫోన్ లో గుడ్ మార్నింగ్ మెసేజ్ చేయడం రాత్రి పడుకునే ముందు గుడ్ నైట్ చెప్పుకొని పడుకోవడం చిన్నగా ఏంజిల్ నుంచి బేబీ అని పిలవడం దాక వచ్చింది అతని ఫోన్ చాట్ లో
చాలా తక్కువ రోజుల్లోనే ఆకాంక్షకు దగ్గరయ్యాడనే చెప్పాలి

ఆకాంక్ష కూడా స్త్రీ సహజమైన హద్దు దాటకుండా
అతనితో చనువుగా ఉంటుంది కానీ
అతను మెల్లి మెల్లిగా ఆమె రోజు దినచర్యలో భాగంగా మారాడు అనేది తెలుసుకోలేక పోయింది
ఆమెకు తెలుసు మగవాడు ఆడదాని నుండి ఏం కోరుకుంటాడో కానీ అతని ఈజీ గోయింగ్ నైస్
ప్రతి విషయాన్ని చిన్నదిగా తీసుకోవడం
ఉన్న సమయంలో ఆనందంగా గడపాలనుకునే తీరు ఆమెకు నచ్చిందనే చెప్పాలి ఇక్కడ

ఒక సారి ఇద్దరి మాటలు మధ్య ఆకాంక్ష అత్తగారు పోయిన దానికి బాధ పడుతూ ఉంటే
పోయిన వారి కోసం బాధపడుతూ మనం సంతోషాన్ని వదులుకోకూడదు ఆకాంక్ష
ఆమె తన కొడుకును పెంచి పెద్ద చేసి ఒక ఇంటివాన్ని చేసింది ఎలాంటి రోగ బాధలు లేకుండా హాయిగా సునాయాసంగా వెళ్ళింది

జీవితం చాలా చిన్నది ఆకాంక్ష చదువుకోవడానికి ఇరవై ఏళ్ల ఆ తరువాత సంపాదన పెళ్లి పిల్లలు 35 ఏళ్ల కి ముసలితనం మొదలవడం ఆ తర్వాత చేయడానికి అనుభవించడానికి ఏమీ ఉండదు
ఏదో ఒక పదేళ్లు సుఖపడుతాం ఆ తరువాత అన్ని మామూలే అంటూ అతని అభిప్రాయాలను అతను చెబుతూ ఇంతకీ మీ వారు మళ్ళి క్యాంప్ వెళ్ళినట్లున్నారు కొంపదీసి రెండో ఇల్లు కాని పెట్టాడా అని గట్టిగా నవ్వాడు
దానికి ఉడుక్కుంటూ ఆకాంక్ష అతని మీద నాలుగు దెబ్బలు వేసింది
మరి నీ లాంటి దేవతను అప్సరసను వదిలి ఇన్ని రోజులు వెళ్ళాడం అంటే అదే అనుమానం వస్తుంది ఎవరికైనా అంటూ నేనైతేనా నా ఆస్తులు అమ్మి అప్పులా పాలు అయిన సరే నిన్ను వదిలి వెళ్లే వాడిని కాదు అన్నాడు చాలా ఈజీగా
కానీ ఆ మాటలు ఆమె గుండేల్లో తూటాల్లా తగిలాయి అనే చెప్పాలి
ఎందుకంటే ఇంట్లో అశుభం జరిగి ఇంటి పెద్ద ఆమెకు ఉన్న ఏకైక తోడు రోజులో చాలా ఆమెతో సమయం గడిపే అత్తగారు పోవడం బాధపడుతూ ఆకాంక్ష ఒకర్తే ఇంట్లో ఉంటుంది కధ అనే ఆలోచన కూడా లేకుండా ఆకాష్ ఇలా క్యాంప్ కి వెళ్లడం ఏం బాగోలేదు అనే విషపు ఆలోచన మొదలైందనే చెప్పాలి
అలా ఒక్కోకటిగా ఆకాంక్ష మదిలో అతని వైపు మొగ్గు చూపేలా ఆలోచనలను ప్రభావితం చేస్తున్నాడు ఇంద్రనీల్

ఆకాష్ క్యాంప్ వెళ్లిన వారం తర్వాత రోజు ఉదయం తొందరగా లేచిన ఆకాంక్ష రోజు లాగానే
ఇంద్రనీల్ రాక కోసం ఎదురు చూస్తూ ఉంది
అతని కలుపుగోలు మాటలు కాస్త హద్దు దాటుతున్నాయి అని ఆకాంక్షకు అనిపించినా
చెడుగా ఎప్పుడూ చూడలేదు అని ప్రవర్తించలేదు కధ అని తనకు తాను అనుకుంటుంది