భ్రాంతి 5 140

సూర్య భగవానుడు చిమ్మచీకటిలోనూ వింతకాంతితో మెరిసిపోతున్నాడు. అది చూసిన ఆ మనిషి మనసులో మొదటిసారిగా జంకు కలిగింది. వెనుతిరిగి వెళ్లిపో అని కిరీటి అరుస్తున్నాడు ఆ మనిషి మస్తిష్కంలో. తల విదిలించి మళ్ళీ ముందడుగేశాడా మనిషి. జాగ్రత్తగా మండపం వెనక్కు చేరి విగ్రహాన్ని చేతిలోకి తీసుకోబోయాడు. తాకీ తాకగానే కరెంట్ షాక్ తగిలినట్టు చేతిని వెనక్కు తీసుకున్నాడు. ఇప్పుడు నిజంగా భయం తాండవిస్తోంది అతని మదిలో. గట్టిగా ఊపిరి పీల్చి వదులుతూ మనసు ధృడపరుచుకొని ‘యు ఆర్ మైన్’ అంటూ మరొక్కసారి విగ్రహం నడుము చుట్టూతా చేతిని బిగించి పైకి లాగాడు.

విగ్రహం చేజిక్కింది అనుకున్నాడు ఒక సెకను. కానీ అతడి చెయ్యి విగ్రహానికి అంటుకుపోయింది. అప్పుడు అనుభవమైంది అతనికి అసలు హింస. చేతిలో మొదలైన నొప్పి నరనరాల్లోనూ పాకుతూ అంగాంగాన్నీ భస్మం చేస్తూ మెదడు దాకా చేరింది. తను మనిషో, మృగమో తెలియనట్టు బాధలో పొలికేకలు పెడుతున్నాడు. శరీరంలోని అవయవాలన్నీ ఏదో అదృశ్య హస్తం పిండేసినట్టు అనుభూతి చెంది రక్తం కక్కుకుంటున్నాడు. ఇదంతా ఓ ప్రేక్షకుడిలా చూస్తున్న కిరీటి గజగజా వణికిపోతున్నాడు. ఆ మనిషి చివరకు ‘క్షమ, క్షమ’ అంటూ గొణుగుతున్నాడు. విగ్రహం నుంచి చెయ్యి విడివడగానే గుళ్ళోంచి బయటకు పరుగెట్టాడు.

రాత్రంతా ఎవరికంటా పడకుండా ఎక్కడో తుప్పల్లో స్పృహలేకుండా పడున్నాడు. తెలతెలవారుతుండగా ఓ ఇంటి తలుపు తట్టాడు. కిరీటి తలుపు తెరిచాడు. ఆఖరుసారిగా తననుతాను చూసుకున్న కిరీటి కలలోంచి బయటకొచ్చి పడ్డాడు. అన్నాళ్ల క్రితం గుడిలో పడ్డ దొంగ ధనుంజయ్ అని రూఢి అయింది అతనికి. మనసు వికలమైపోయిన కిరీటి ‘ధనుంజయ్, సునయన’ అని రెండు పేర్లు పలికాడు. ముఖాన్ని చేతుల్లో కప్పుకుని వుండిపోయాడు.

సమయం చూస్తే రాత్రి ఒంటిగంటే అయింది. మళ్ళీ తెల్లవారుఝాము ఓ కోడి నిద్ర తీసేవరకూ తనకొచ్చిన కలగురించి ఆలోచిస్తూ వుండిపోయాడు. మెలకువ వచ్చేముందు వాడికి మళ్ళీ తను, సునయన ఓ జలపాతం ముందు వుండటం కనిపించింది. ఈసారి ఆమెను కలిసే సందర్భం కోసం అదివరకట్లా ఆతృతతో ఎదురుచూడట్లేదు వాడు.

ధనుంజయ్ గురించిన కల వచ్చిన రోజు నుంచీ కిరీటి చాలా మూడీగా వుంటున్నాడు. వాడలా ఎందుకు వున్నాడో తెలుసుకుందామంటే శైలుకి ఊళ్ళో వాడితో ఏకాంతంగా మాట్లాడటం కుదరట్లేదు. కాలేజీలో ఎన్నిసార్లు అడిగినా వాడు నోరువిప్పి ఇది విషయం అని చెప్పట్లేదు. చివరికి తన ప్రపంచం తల్లకిందులయ్యే ఒక విషయం శైలు చెప్పేసరికి వాడా మూడ్ లోంచి బయటకు వచ్చాడు.

ఆ వివరం తెలుసుకోవడానికి కొన్ని రోజులు వెనక్కు వెళ్దాము………….

రాణి రత్నమాంబ కాలేజీలో ఆడిట్ మొదలైంది. రాజావారి దగ్గర్నుంచి వచ్చే డబ్బుల్లో ఏ కాస్త తగ్గినా తమ జీతాలకే ఎసరు కాబట్టి లెక్చరర్లు అందరూ టెన్షన్ తో ఆడిటర్ గారికి ఏం కావాలంటే అవి సమకూరుస్తున్నారు. వచ్చిన ఆడిటర్ పేరు శేఖర్ అని తెలుసుకుంది శైలు. క్రితంసారి రాజా గారి దగ్గరకు వెళ్లినప్పుడు చూడటమే అతన్ని. మళ్ళీ ఇన్నాళ్లకు కాలేజీలో కనిపించాడు. అతడికి సహాయం చెయ్యమని ప్రసాదవర్మ గారు అడగటం గుర్తొచ్చి మాట కలిపింది.

‘నేను సోమ, బుధ వారాల్లో మధ్యాహ్నం పూట ఖాళీగా వుంటాను. మీకేమన్నా హెల్ప్ కావాలంటే అడగండి’ అంది. ‘తప్పకుండా, థాంక్స్’ అని ఒక మాట అని ఊరుకున్నాడు. శేఖర్ తన పని తాను చేసుకుపోతున్నాడు. ప్రిన్సిపాల్ గారి గదిలో కాలేజీ అక్కౌంట్ పుస్తకాలు ముందేసుకొని కుస్తీ పడుతున్నాడు. అప్పుడప్పుడూ క్లాస్ రూముల్లోకి వచ్చి విద్యార్ధుల హాజరు శాతం ఎలా వుందో నోట్ చేసుకొని వెళ్తున్నాడు.

మంచి కుర్రాడిలానే వున్నాడు శేఖర్. కాలేజీ స్టాఫ్ అందరితోనూ polite గా, కాకపోతే కొంచెం పొడిపొడిగా మాట్లాడుతాడు మనిషి. పోనీ అది కిరీటి లాగా సహజంగా వున్న సిగ్గు వల్లా అంటే అలా అనిపించట్లేదు శైలుకి. శైలుకి ఎందుకో తేడాగా వుంది ఆ అబ్బాయిని చూస్తే.

ఓ రోజు చాలా అందంగా ముస్తాబయ్యి వచ్చింది కాలేజీకి. స్వతహాగా అందగత్తె కాబట్టి ఎలా వున్నా చూపు తిప్పుకోలేరు కుర్రాళ్ళు. అవాళ ఎందుకో కొంచెం శ్రద్ధ పెట్టి తయారయింది. కిరీటి వున్న క్లాసులో పాఠం చెప్పి స్టాఫ్ రూమ్ కి వెళ్తోంది. ఓ కారిడార్ లో ఎవరూ లేనిచోట సడన్ గా కిరీటి వెనకనుంచి వచ్చి ‘చాలా బాగున్నారు మేడమ్, ఇలా వస్తే క్లాసులో లెసన్ ఏం వింటారు పిల్లలు’ అని ఆమె నడుముని నొక్కి ఆమె పెదాలను తన పెదాలతో అలా స్పృశించి వెళ్లిపోయాడు.

1 Comment

  1. Bro emindhi story update em levu story apesara leka ayipoindha konchm chppndi

Comments are closed.